Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 May 2024 09:12 IST

1. మందుల్లేవండి... రోగులను తీసుకెళ్లిపోండి!

ఉమ్మడి కడప జిల్లాకు పెద్దాసుపత్రిగా నిలుస్తున్న కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ప్రతిరోజూ జిల్లా నలుమూలాల నుంచి పెద్దసంఖ్యలో రోగులొస్తుంటారు. వీరిని అక్కున చేర్చుకుని వైద్యసేవలందించాల్సిన ఆసుపత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది ఇక్కడ మందుల్లేవని, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, వేలూరు ప్రభుత్వాసుపత్రులకు గానీ, ప్రైవేటు ఆసుపత్రులకు గానీ వెళ్లాలని చెబుతుంటే భయమేస్తోందని రోగులు, వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి కథనం

2. క్రికెట్‌ హోరు.. బెట్టింగ్‌ జోరు!

గత నెలన్నర రోజులుగా క్రికెట్‌ ఐపీఎల్‌ నడుస్తుండడంతో ప్రతి రోజు రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. మెదక్, చేగుంట, తూప్రాన్, నర్సాపూర్, పట్టణాలు, మండల కేంద్రం పాపన్నపేటతో పాటు ఆయా గ్రామాల్లో ప్రతిరోజు జోరుగా నడుస్తోంది. చాయ్‌ హోటళ్లు, దుకాణాలే కేంద్రంగా ఈ వ్యవహారం కొనసాగుతోంది.పూర్తి కథనం

3. బిక్కుబిక్కుమంటున్న పాల్వాయి గేటు

గడప గడపకు కార్యక్రమం ద్వారా ఊర్లోకి వచ్చిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి గ్రామస్థులు పూలతో స్వాగతం పలికారు. కానీ నేడు అదే ఎమ్మెల్యే మహిళలని చూడకుండా ఓ ప్రజాప్రతినిధినని మరిచి వేలు చూపిస్తూ అసభ్య పదజాలంతో బెదిరించాడు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీరుపై పాల్వాయిగేటు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పూర్తి కథనం

4. 1, 2, 3... దూకేయ్‌

దర్గాకెళ్లి తిరిగొస్తుండగా.. పీకల్లోతు మత్తులో జోగుతున్న యువకుడు బ్యారేజీలోకి దూకి నీటమునిగి మృతిచెందాడు. ఈ దుర్ఘటన ఈ నెల 19న కర్ణాటక రాష్ట్రం, కమలాపూర్‌ తాలూకా, పటవాడ గ్రామం సమీపంలో జరిగింది. మృతుడు పాతబస్తీ బండ్లగూడ ఠాణా పరిధిలోని జహంగీరాబాద్‌ వాసిగా గుర్తించారు.పూర్తి కథనం

5. రక్తపోటు.. మేల్కొనకుంటే చేటు!

నేటి యువత ఆహారపు అలవాట్లు.. జీవనశైలిలో మార్పు, శారీరక, మానసిక రుగ్మతల కారణంగా జిల్లాలో ఎక్కువ మంది రక్తపోటు (బీపీ) బారిన పడుతున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే ఈ లక్షణాలు నేడు ఉడుకు రక్తంతో మరిగిపోవాల్సిన యువతలోనూ కనిపిస్తోంది.పూర్తి కథనం

6. బిహార్‌లో దారిమళ్లిన యోగి హెలికాప్టర్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఒకటి బిహార్‌లో దారిమళ్లింది. ఒక ప్రాంతానికి బదులు మరో ప్రాంతానికి వెళ్లింది! లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి గురువారం బిహార్‌కు వెళ్లారు. భాజపా ముందుగా విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం- పశ్చిమ చంపారణ్‌లో ర్యాలీతో రాష్ట్రంలో ఆయన పర్యటన ముగియాలి.పూర్తి కథనం

7. అడ్డొస్తే కొట్టేయ్‌.. అడగరులే కట్టేయ్‌.. వైకాపా నేతల బరితెగింపు

‘‘విజయవాడ నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. అది ప్రభుత్వానిదైనా, ప్రైవేటుదైనా.. కబ్జా చేసేయ్‌.. రాత్రికి రాత్రి నిర్మాణం మొదలెట్టేయ్‌.. ఎవరైనా అడ్డొస్తే.. కొట్టి పడేయ్‌..’’ అన్నట్టుగా కొందరు వైకాపా నాయకులు, అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.పూర్తి కథనం

8. పరుగులు పెట్టినా ఫలితం దక్కలే!.. రైలు నిలయంలో ప్రయాణికులకు వెతలు

తూ.కో రైల్వే విశాఖ రైలు నిలయంలో అధికారుల వింత చర్యలతో  ప్రయాణికులకు వెతలు తప్పడం లేదు. ప్లాట్‌ఫామ్‌ల కొరత నెపంతో విశాఖ నుంచి రెండు వేర్వేరు  ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లను ఒకే సమయంలో ఒక దాని వెనక మరొకటి ఉంచడంతో ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు.పూర్తి కథనం

9. నన్ను ఉరి తీసినా ఆప్‌ను అంతం చేయలేరు

వచ్చే నెల 1వ తేదీన బెయిల్‌ గడువు ముగుస్తున్న నేపథ్యంలో తిహాడ్‌ జైలుకు తిరిగి వెళ్లేందుకు తనకు ఎటువంటి ఆందోళన లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం తాను చేస్తున్న పోరాటంలో భాగంగా ఆ నిర్బంధాన్ని భావిస్తున్నానని తెలిపారు. దిల్లీ మద్యం విధాన కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వీలుగా సుప్రీంకోర్టు ఈ నెల 10న మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.పూర్తి కథనం

10. శవ రాజకీయాలు మానండి: మంత్రి జూపల్లి

భారాస కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్యకు దురలవాట్లు, భూతగాదాలు, ఆర్థిక లావాదేవీలే కారణమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ నాయకులు రాజకీయ హత్యగా చిత్రీకరించడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఓప్రకటన విడుదల చేశారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు