Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Mar 2024 09:03 IST

1. జగన్‌ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!

ఎన్నికల ఏడాది కావడంతో గృహ విద్యుత్‌ వినియోగదారులకు కోతలు పెడితే ఓట్లకు నష్టం కలుగుతుందని సీఎం జగన్‌ ఆలోచన. మరోవైపు... పీక్‌ డిమాండ్‌ సమయంలో అధిక ధరకు విద్యుత్‌ను కొనాలన్నా మార్కెట్‌లో దొరికే పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయంగా సేద్యానికిచ్చే విద్యుత్‌లో రోజుకు రెండు గంటలు కోతలు పెట్టారు. గత రెండేళ్లుగా వేసవిలో విద్యుత్‌ కోతలతో ప్రజలకు జగన్‌ ప్రభుత్వం చుక్కల్నే చూపించింది. పూర్తి కథనం

2. 4 ఖరారు.. 4 పెండింగ్‌

రాష్ట్రంలో మరో నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ బుధవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మెదక్‌ నుంచి నీలం మధు ముదిరాజ్‌, ఆదిలాబాద్‌ నుంచి ఆత్రం సుగుణ, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలకు అవకాశం కల్పించారు. దీంతో రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ స్థానాలు మినహా మిగతా వాటికి అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది.పూర్తి కథనం

3. అయిదేళ్లలో రాష్ట్రానికి పెట్టుబడులేవీ? 

రాష్ట్రానికి వైకాపా ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు రాలేదని, యువతకు ఉద్యోగాలు లేవని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులుగా వచ్చాయని గుర్తుచేశారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేస్తే సొంత కుటుంబాలకు అన్యాయం చేసినట్టేనని పేర్కొన్నారు.పూర్తి కథనం

4. మార్చిలోనే వడగాలులు!

దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. గతంలో మహారాష్ట్ర, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనే మార్చి నెలలో 40 డిగ్రీలు నమోదయ్యేవి. ప్రస్తుతం దేశమంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా సహా మొత్తం 9 రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటే అవకాశాలు కొంతమేర ఉన్నాయి.పూర్తి కథనం

5. పాదయాత్ర మాట.. పాలనలో జూట

ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో పల్లెలకొచ్చారు.. నా అక్కాచెల్లెమ్మలు, అన్నలు అంటూ ‘హామీ’లు కురిపించారు.. ఒక సంవత్సరం ఓపిక పడితే ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మించారు.. జగన్‌ వస్తే జనాలకు మంచి జరుగుతుందని భ్రమింపజేశారు.. అధికార పీఠమెక్కి ‘ప్రజా’స్వామ్యం మరిచారు.. అడిగితే అణచివేశారు.. ప్రశ్నిస్తే భయపెట్టారు.. భారం విధించారు.. ఐదేళ్లు కరిగిపోయాయి.. మళ్లీ ఓట్ల కాలం వచ్చేసింది.పూర్తి కథనం

6. వ్యాట్‌నూ తాగేశారు

మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తయారీ నుంచి అమ్మకాల దాకా పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడి రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.వందల కోట్ల ‘విలువ ఆధారిత పన్ను’(వ్యాట్‌)ను ఎగ్గొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ అవినీతి వ్యవహారంలో కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఎక్సైజ్‌ అధికారులు కుమ్మక్కై ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది.పూర్తి కథనం

7. నిజం గెలవాలి.. రాష్ట్రం వెలగాలి

నిజం గెలవాలి యాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం సాయంత్రం హనుమాన్‌జంక్షన్‌, బిళ్లనపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా నుంచి వచ్చిన ఆమెకు హనుమాన్‌జంక్షన్‌ వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అభ్యర్థన మేరకు భువనేశ్వరి అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.పూర్తి కథనం

8. ఫోన్‌ ట్యాపింగ్‌లో ఎర్రబెల్లిదే కీలక పాత్ర.. మంత్రి కొండా సురేఖ ఆరోపణలు

భారాస అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. తన భర్త కొండా మురళీధర్‌రావుతో పాటు తన ఫోన్‌ను ట్యాప్‌ చేశారని పేర్కొన్నారు. దర్యాప్తులో అన్ని నిజాలు బయటికి వస్తాయని, ట్యాపింగ్‌లో కీలక భూమిక పోషించిన పోలీసులతో పాటు తెరవెనుక ఉన్న పెద్దలను ఎవరినీ వదిలిపెట్టబోమని తెలిపారు.పూర్తి కథనం

9. అంకెలు పెంచి.. ఆశలు తుంచారు!

తమ రాష్ట్ర బాగుకు, దేశ ఉన్నతికి సొంత ఊళ్లను, పొలాలను, ఉపాధిని, సంస్కృతిని త్యాగం చేసిన ఆ అమాయక నిర్వాసితులు ఇప్పటికీ తల్లడిల్లుతున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కోసం తమ సర్వస్వాన్ని ధారబోస్తే జగన్‌ వచ్చాక వారి జీవితాలు అల్లకల్లోలం అయ్యాయి. మాట ఇస్తే మడమ తిప్పబోనని ఆయన తరచూ చెబుతుంటారు.పూర్తి కథనం

10. తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!

స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఓ స్థిరాస్తి ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనుగోలు చేసిన వినియోగదారులతోపాటు రుణాలిచ్చిన బ్యాంకుకు తెలియకుండానే ప్రైవేటు ఫైనాన్షియర్లకు అవే ఫ్లాట్లను తాకట్టుపెట్టిన వైనం వెలుగుచూసింది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని