logo

అయిదేళ్లలో రాష్ట్రానికి పెట్టుబడులేవీ?

రాష్ట్రానికి వైకాపా ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు రాలేదని, యువతకు ఉద్యోగాలు లేవని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

Updated : 28 Mar 2024 06:19 IST

మాట్లాడుతున్న దేవినేని ఉమా

గొల్లపూడి, న్యూస్‌టుడే: రాష్ట్రానికి వైకాపా ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు రాలేదని, యువతకు ఉద్యోగాలు లేవని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులుగా వచ్చాయని గుర్తుచేశారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేస్తే సొంత కుటుంబాలకు అన్యాయం చేసినట్టేనని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం చేస్తారన్నారు. జగన్‌ ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి రూ.లక్షల కోట్లు దోచుకున్నారని వెల్లడించారు. అడ్డగోలుగా ఐరన్‌ ఓర్‌, బైరైటీస్‌, బొగ్గు గనులను అస్మదీయులకు కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి హంద్రీ-నీవా నీరు తెచ్చినట్లు సినిమా సెట్టింగ్‌లా గేట్లు పెట్టిన ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని