Top Ten News @ 9 AM:: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Mar 2024 09:14 IST

1. కన్నెత్తి చూశావా జగన్‌?

కరవు జిల్లా అనంతపై కనికరం లేదు. కర్షకుల కన్నీరు కనిపించదు. మాటలు కోటలు దాటుతాయ్‌.. అభివృద్ధి పనులు చేయడానికి చేతులాడవ్‌.. నీటి మీద రాత రాసే నైపుణ్యం.. ఇచ్చిన హామీ మడతపెట్టేయడం.. పైగా అందరికీ అన్నీ చేశానంటూ ఏ వేదిక ఎక్కినా ఊదరగొట్టడం జగన్‌ నైజం. రూ.వందల కోట్లు మంజూరు చేస్తానని ఒక్క రూపాయి ఇవ్వని సీఎం.. ఐదేళ్లలో హెచ్చెల్సీ ఆధునికీకరణకు తట్ట మట్టి కూడా పోయించిన పాపాన పోలేదు. పూర్తి కథనం 

2. ‘కారు’లోనే ఉండండి.. స్టీరింగ్‌ మా ‘చేతి’కివ్వండి!

రాజధాని పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో మూడింటిలో గెలిచేందుకు కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కొందరు ప్రజాప్రతినిధులతో అనధికారికంగా ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ప్రధానంగా భారాస ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ అగ్రనేతలు సమావేశమవుతున్నారు. వీరిలో కొందరు ఇప్పటికిప్పుడు పార్టీ మారడానికి సిద్ధంగా లేరు.పూర్తి కథనం 

3. ఓట్ల వేటలో మహా నటులు

వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జనం బాధలు అంతగా పట్టించుకున్నది లేదు. రోడ్లు వేసింది లేదు.. పరిశ్రమలు తెచ్చింది లేదు.. కాలనీల్లో ఇళ్లూ పూర్తిచేసింది లేదు.. అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టిందీ లేదు. అదేమని అడిగితే అధినేత బటన్‌ నొక్కుడుతో సరిపుచ్చారు. సమస్యలు పరిష్కరించాలని జనం ఎన్నిసార్లు ఆందోళనలు చేసినప్పటికీ పాలకుల్లో ఉలుకూ పలుకు లేదు. పూర్తి కథనం 

4. పెరుగుతున్న ఔషధ వినియోగం

ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల వినియోగం పెరుగుతోంది.. వైద్య కళాశాలల ఏర్పాటు, మాతాశిశు కేంద్రాలు, బస్తీ, పల్లె దవాఖానాలతో సదుపాయాలు పెరిగి జనం రాక పెరగడమే ఇందుకు కారణం. గతంతో పోల్చితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు.పూర్తి కథనం 

5. సీఎం బస్సు యాత్రలో ‘జల’గళం

కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌కు నిరసన సెగ తగిలింది. గూడూరు మండలం పెంచికలపాడులో గురువారం రాత్రి బస చేసిన ఆయన ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన ‘మేమంతా సిద్ధం’ సభకు బస్సు యాత్రగా శుక్రవారం ఉదయం బయలుదేరారు. కొద్దిసేపటికే గూడూరు మండలం కొత్తూరు (రామచంద్రాపురం)లో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు.పూర్తి కథనం 

6. టూరు.. ధరలతో బేజారు!

వేసవిలో పర్యాటకం పరుగులు తీస్తోంది. ఏడాది అంతా ఉద్యోగ, వ్యాపార జీవితంలో తీరిక లేకుండా గడిపినవాళ్లు పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు. స్వస్థలాలకు సమీపంలో కాకుండా దూరప్రాంతాలు, అంతర్రాష్ట్ర పర్యాటకానికి ఆసక్తి చూపుతున్నారు. వారం నుంచి పర్యాటకం ఒక్కసారిగా జోరు అందుకుంది. హోటళ్లలో గదుల అద్దెలు పెరిగాయి. విమాన టికెట్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.పూర్తి కథనం 

7. మా అభ్యర్థులు పేదోళ్లు

వైకాపా తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులు పేదోళ్లని.. వారి ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమేనని సీఎం జగన్‌ శుక్రవారం ఎమ్మిగనూరులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో వ్యాఖ్యానించడంతో పలువురు ఆశ్చర్యపోయారు. వారంతా కోటీశ్వరులని, విలాసవంతమైన కార్లు, బంగళాలు ఉన్నాయని అంతా అనుకుంటున్న వేళ ముఖ్యమంత్రి పేదలు అనేసరికి అందరికీ ఒక్కసారి షాకయ్యారు.పూర్తి కథనం 

8. వైకాపాకు కాదు.. ప్రజలకు సేవ చేయండి

‘వాలంటీర్లు వైకాపాకు, ఆ పార్టీ నేతలకు కాకుండా ప్రజలకు సేవకులుగా పనిచేయాలి. రాజీనామా చేశామని అనుకున్నా క్రిమినల్‌ కేసులు నమోదైతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలోని ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.పూర్తి కథనం 

9. ఆర్టీసీలో జీరో టికెట్ల తిర‘కాసు’!

ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. అయితే ఈ జీరో టికెట్లు కొట్టడంలో ఆర్టీసీ కండక్టర్లు కొందరు తిరకాసు చూపుతున్నారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో ప్రయాణించే మహిళలకు ఆధార్‌ కార్డు ఉంటే వారికి జీరో టికెట్‌ కొట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పూర్తి కథనం 

10. మాజీ ప్రధాని మన్మోహన్‌కు భాజపా క్షమాపణ చెప్పాలి - సంజయ్‌ రౌత్‌

ఓ అవినీతికి సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌కు సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై శివసేన (UBT) స్పందించింది. మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) ప్రధానిగా ఉన్న సమయంలో పౌర విమానయాన రంగంలో అవినీతి చోటుచేసుకుందని భాజపా హల్‌చల్‌ చేసింది. తాజాగా ఈ కేసును సీబీఐ మూసివేసిన నేపథ్యంలో మన్మోహన్‌కు భాజపా క్షమాపణలు చెప్పాలని శివసేన పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) పేర్కొన్నారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని