Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Jun 2024 21:01 IST

1.డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు: రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ఏటా డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ రోజున సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో ఉత్సవాలు చేస్తామని పేర్కొన్నారు.  పూర్తి కథనం

2. కీలక దస్త్రాలు ప్రాసెస్‌ చేయొద్దు: ఏపీ రెవెన్యూశాఖ ఆదేశాలు

రెవెన్యూ శాఖలో ముఖ్యమైన దస్త్రాలను ప్రాసెస్‌ చేయవద్దని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పేషీలోని రికార్డులు, దస్త్రాలను జాగ్రత్తపరచాలని సిబ్బందికి సూచించారు. గుత్తేదారులకు నిధుల విడుదల, భూ కేటాయింపు దస్త్రాలు నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. పూర్తి కథనం

3. పడుతూ లేస్తూ.. 3 రోజులుగా అదానీ గ్రూప్‌ షేర్లలో ఇదీ పరిస్థితి

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు భాజపాకు పట్టం కట్టడంతో స్టాక్‌ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఫలితాలు అందుకు విరుద్ధంగా ఉండడంతో భారీగా పతనం అయ్యాయి. అయితే, మరోసారి అధికారం చేపట్టడంలో ఎలాంటి ఢోకా లేదని తేలాకా సూచీలు ఇవాళ మళ్లీ పరుగులు తీశాయి.  పూర్తి కథనం

4. పునరుత్పాదక ఇంధనం కోసం రూ.450 కోట్ల పెట్టుబడి

మారుతీ సుజుకీ తన పునరుత్పాదక ఇంధన వ్యూహంలో భాగంగా హరియాణాలోని తన మనేసర్‌ ప్లాంట్‌లోని బయోగ్యాస్‌ కేంద్రంలో ఆహార వ్యర్థాలు, నేపియర్‌ గడ్డిని ఉపయోగించి కార్యకలాపాలను ప్రారంభించింది. పూర్తి కథనం

5. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రాజీనామా

అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘోరంగా ఓడిపోవడంతో పలువురు ప్రభుత్వ సలహాదారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. జగన్‌ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డితో సహా 20 మందికి పైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా సీఎస్‌ జవహర్‌రెడ్డికి లేఖలు పంపారు.  పూర్తి కథనం

6. విద్యుత్‌ కారు ఓకే.. ఛార్జింగ్ సమయమే ప్చ్‌!.. ఈవీ యూజర్ల మనోగతమిదీ..

దేశంలో ఎలక్ట్రానిక్‌ వాహన విక్రయాలు ఊపందుకుంటున్నాయి. పర్యావరణ హితంగా ఉండటంతో వీటి కొనుగోలుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అయితే.. వీరిలో ఎక్కువ మంది ఛార్జింగ్ టైమ్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. పూర్తి కథనం

7. సినీ నటుడు సురేష్‌ గోపీకి త్రిశ్శూరులో ఘన స్వాగతం

కేరళలో భాజపా ఖాతా తెరవడంతో కాషాయ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. త్రిశ్శూర్‌ నుంచి భాజపా అభ్యర్థిగా సినీ నటుడు సురేష్‌ గోపీ గెలవడంతో భారీ రోడ్‌షో నిర్వహించారు. తిరువనంతపురం నుంచి బుధవారం ఆయన త్రిశ్శూరుకు రాగా.. పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.  పూర్తి కథనం

8. గుజరాత్‌లో రూ.130 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత

గుజరాత్‌లోని కచ్‌ తీరంలో రూ.130 కోట్ల విలువైన కొకైన్‌(cocaine)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీధామ్ పట్టణంలోని మితి రోహర్‌ ప్రాంతంలో స్మగ్లర్లు సముద్ర తీరంలో మాదకద్రవ్యాలను దాచి పెట్టారు. పూర్తి కథనం

9. ఆప్‌ ఆఫీస్‌ స్థలంపై నిర్ణయం తీసుకోండి.. కేంద్రానికి దిల్లీ హైకోర్టు ఆదేశం

అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే దిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ(AAP) కార్యాలయానికి స్థలం కేటాయించాలని దిల్లీ హైకోర్టు(High Court) కేంద్రాన్ని (Centre) ఆదేశించింది. ఈ విషయంపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పూర్తి కథనం

10. టీ20 వరల్డ్‌కప్‌.. క్రికెట్‌ ప్రియుల కోసం ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌

క్రికెట్‌ సీజన్‌ కోసం ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ భారతీ (Bharati Airtel) ప్రత్యేక ప్లాన్‌ తీసుకొచ్చింది. టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) నేపథ్యంలో క్రికెట్‌ ప్రియుల కోసం ప్రీపెయిడ్‌ ప్లాన్‌  (Prepaid Plan) ప్రవేశపెట్టింది. దీని రీఛార్జితో మూడు నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. ఇక ప్లాన్‌ వివరాలు ఏంటో చూసేద్దాం.. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని