Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Jun 2024 21:04 IST

1.రాష్ట్రంలో వైకాపా కవ్వింపు చర్యలు, దాడులపై చంద్రబాబు ఆరా

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడా జరుగుతున్న వైకాపా కవ్వింపు చర్యలు, దాడులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరా తీశారు. కొన్ని చోట్ల వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయమై ఆయన పార్టీ నేతల ద్వారా సమాచారం అడిగి తెలుసుకున్నారు.  పూర్తి కథనం

2. దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీకి పయనమయ్యారు. శనివారం దిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం కాంగ్రెస్‌ పెద్దలతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం

3. జీరో వేస్ట్‌ వెడ్డింగ్‌.. నెట్టింట వీడియో ట్రెండింగ్‌

చిన్న వేడుక చేసుకోవాలన్నా ప్లేట్లు, గ్లాసులని ఎక్కడో ఒకచోట ప్లాస్టిక్‌ను వాడుతుంటాం. ఇక వివాహం జరిపించాలంటే ఈ వ్యర్థాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మండపం అలంకరణ దగ్గర నుంచి అతిధులకు ఇచ్చే గిఫ్ట్‌ల వరకు అన్నింటా ఎక్కువగా ప్లాస్టిక్‌నే వినియోగిస్తాం. పూర్తి కథనం

4. 34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.. నెటిజన్ల కామెంటిదే!

చిరంజీవి హీరోగా కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’. ఈ సినిమా వచ్చి 34 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ సోషల్‌ మీడియాలో దీని డైలాగ్స్, పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో చిరుతో కలిసి షాలిని, షామిలి, రిషి చైల్డ్‌ ఆర్టిస్టులుగా అల్లరి చేశారు. వాళ్లు తాజాగా మెగాస్టార్‌ని కలిశారు. పూర్తి కథనం

5. భారత్‌లో వాట్సప్‌ బిజినెస్‌ అకౌంట్స్‌కు మెటా వెరిఫైడ్‌

భారత్‌లోని వాట్సప్‌ బిజినెస్‌ యూజర్ల కోసం వెరిఫైడ్‌ ప్రోగ్రామ్‌ను మెటా (meta) ప్రారంభించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్‌లో ప్రస్తుతం ఈ వెరిఫికేషన్‌ ఆప్షన్‌ ఉంది. అలాగే, వాట్సప్‌ బిజినెస్‌ యాప్‌ వాడే వారి కోసం గతేడాది సెప్టెంబర్‌లోనే మెటా వెరిఫైడ్‌ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. పూర్తి కథనం

6. స్పోర్టీ లుక్‌తో మార్కెట్లోకి టాటా ఆల్ట్రోజ్‌ రేసర్‌ కారు.. ధర, వివరాలు ఇవే..

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ (Tata motors) తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో కొత్త ఆల్ట్రోజ్‌ రేసర్‌ను (Altroz Racer) తీసుకొచ్చింది. స్పోర్టీ లుక్‌లో తీసుకొచ్చిన ఈ కొత్త ఆల్ట్రోజ్‌ ధర రూ.9.49 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది. ఆర్‌1, ఆర్‌2, ఆర్‌3 పేరుతో మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. పూర్తి కథనం

7. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తాం : మోదీ

ఎన్డీయే లోక్‌సభాపక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ.. కూటమి నేతలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతిచ్చే ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందజేశారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.  పూర్తి కథనం

8. ‘వందేభారత్‌’.. సంఖ్య పెరుగుతోంది.. వేగం తగ్గుతోంది !

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్‌ రైళ్ల (Vande Bharat trains)  సరాసరి వేగం గత మూడేళ్లలో గంటకు 84.48 కి.మీ. నుంచి 76.25 కి.మీ.లకు పడిపోయినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఈమేరకు సమాచార హక్కు చట్టం ( సహచ) ద్వారా మధ్యప్రదేశ్‌కు (Madhyapradesh) చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ చేసిన దరఖాస్తుకు అధికారులు సమాధానమిచ్చారు. పూర్తి కథనం

9. కొందరు ఓట్లేస్తే.. ఇంకొందరు చెంప దెబ్బలు కొడుతున్నారు: ఎంపీ సంజయ్ రౌత్

బాలీవుడ్‌ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్‌(Kangana Ranaut)ను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో మహిళా సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టడంపై శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) శుక్రవారం స్పందించారు. పూర్తి కథనం

10. ‘భారత్‌లో కేజ్రీవాల్‌కు బెయిల్‌’.. ఇమ్రాన్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు!

ఓ కేసులో పాకిస్థాన్‌ (Pakistan) సుప్రీంకోర్టు ముందు హాజరైన ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan).. దిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రస్తావన తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల వేళ ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు బెయిల్‌ దక్కింది. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు