Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 21 May 2024 20:59 IST

1. శత్రువు ప్రశంసించిన నేతకు అధికారమా..: రాజ్‌నాథ్‌ సింగ్‌

త్రువు మెప్పు పొందుతోన్న నేతను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలా? అంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ (Rajnath Singh) విరుచుకుపడ్డారు. పుల్వామా, ఉరీ దాడుల వెనక పాకిస్థాన్‌ ఉగ్రవాదుల హస్తం ఉందని ఆ దేశ మాజీమంత్రి ఫవాద్‌ హుస్సేన్‌ గతంలో వెల్లడించారని, ఇప్పుడాయన రాహుల్‌ (Rahul Gandhi)ను ప్రశంసిస్తున్నారని చెప్పారు. పూర్తి కథనం

2.తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి 6 కొత్త పాలసీలు: సీఎం రేవంత్‌రెడ్డి

ఎన్నికల కోడ్‌ ముగిసేలోగా పారిశ్రామికాభివృద్ధికి కొత్త పాలసీలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీఎస్‌ఐఐసీపై  సీఎం సమీక్ష నిర్వహించారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ఆరు నూతన పాలసీలు తయారు చేస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు.పూర్తి కథనం

3. నా సినిమాల్లో చేసిన నటీనటులు ఆ విషయంలో బాధపడతారు: సంజయ్‌ లీలా భన్సాలీ

బాలీవుడ్‌ అగ్ర నటీనటులతో సినిమాలు తెరకెక్కించిన దర్శకుల్లో సంజయ్‌ లీలా భన్సాలీ (Sanjay Bhansali) ఒకరు . అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యా రాయ్‌ (Aishwarya Rai) వంటి స్టార్స్ ఎందరో ఆయన దర్శకత్వంలో నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భన్సాలీ తన చిత్రాల్లో నటించిన యాక్టర్స్‌ ఓ విషయంలో బాధపడతారని తెలిపారు.పూర్తి కథనం

4. రూ.3.22 కోట్లు కాజేసిన అమెజాన్‌ ఉద్యోగి అరెస్ట్‌

అమెజాన్‌ సంస్థలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ.. రాజీనామా చేసిన ఉద్యోగులకు అందాల్సిన సొమ్మును కాజేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎం.వెంకటేశ్వర్లు అమెజాన్‌లో సీనియర్‌ ఫైనాన్షియల్‌ అనలిస్టుగా పని చేస్తున్నాడు. రాజీనామా చేసిన ఉద్యోగులకు బకాయిల చెల్లింపులను ఆసరాగా తీసుకొని ఆ సంస్థలో మోసానికి పాల్పడ్డాడు.పూర్తి కథనం

5. సీనియర్లుగా జట్టులో మీ బాధ్యత అదే కదా..: హర్భజన్‌

ఐపీఎల్‌ 17వ సీజన్‌ను ముంబయి ఇండియన్స్‌ చివరి స్థానంతో ముగించింది. స్టార్లు ఉన్నా సరే నిలకడైన ఆటతీరును ప్రదర్శించడంలో ఘోరంగా విఫలమైంది. కెప్టెన్సీ మార్పు తీవ్ర ప్రభావం చూపించిన సంగతి తెలిసిందే. రోహిత్ స్థానంలో హార్దిక్‌ పాండ్యకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. దీంతో  ఒకప్పుడు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హర్భజన్ సింగ్‌ మాత్రం ఫ్రాంచైజీ తీరుతోపాటు సీనియర్ ఆటగాళ్లపై అసహనం వ్యక్తంచేశాడు.పూర్తి కథనం

6. అమెజాన్‌-ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? ఈ రివార్డులు ఉండవిక..

అమెజాన్‌పే- ఐసీఐసీఐ బ్యాంక్‌ కో బ్రాండ్‌ క్రెడిట్‌ కార్డ్‌ వాడుతున్నారా? అయితే మీకో బ్యాడ్‌ న్యూస్‌. క్రెడిట్‌ కార్డు ప్రయోజనాల్లో బ్యాంక్‌ కొంత కోత పెట్టింది. సాధారణంగా క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా చేసే వివిధ రకాల లావాదేవీలపై రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్లను ఐసీఐసీఐ అందిస్తోంది. ఇన్నాళ్లు అద్దె చెల్లింపులపై కూడా 1 శాతం రివార్డు పాయింట్లు ఇస్తోంది. ఇకపై ఈ రివార్డు పాయింట్లు ఉండవని బ్యాంక్‌ తెలిపింది.పూర్తి కథనం

7. ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్‌ సీటీఓ సూచనలు

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ (AI).. ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటినుంచి చర్చ జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. దీనివల్ల ఉద్యోగాలు పోతాయనే వాదన ఓవైపు ఉండగా.. ఏఐ నైపుణ్యాలు అందిపుచ్చుకునే ఉద్యోగులు భారీ జీతాలు అందుకునే అవకాశాలు ఉన్నాయనేది నిపుణులు చెబుతున్న మాట. దీనిపై ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ (Infosys) సీటీఓ రఫీ తరఫ్దర్‌ (Rafee Tarafdar) మాట్లాడారు.పూర్తి కథనం

8. సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు

ఓ కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తోన్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులే అవినీతికి పాల్పడిన కేసు ఇది. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న నర్సింగ్‌ కాలేజీ స్కామ్‌ వ్యవహారంలో తనిఖీలకు వెళ్లిన అధికారులే లంచాలు తీసుకున్నారు. అనుకూలమైన నివేదిక ఇచ్చేందుకు ఒక్కో కాలేజీ నుంచి భారీ స్థాయిలో నగదు వసూలు చేశారు. ఈ వ్యవహారం వెలుగుచూడడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పలువురు సీబీఐ అధికారులతో పాటు 22 మంది బయటి వ్యక్తులపైనా కేసు నమోదు చేశారు. పూర్తి కథనం

9. ఆ బాలుడికి పోలీస్‌స్టేషన్‌లో పిజ్జా, బిర్యానీ

మహారాష్ట్ర (Maharashtra)లోని పుణెలో ఓ బాలుడు లగ్జరీ కారుతో బైక్‌ను ఢీకొట్టి ఇద్దరి మరణానికి కారణమైన కేసు (Pune Car Crash Case)లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  ఇందులో నిందితుడు స్థానికంగా ప్రముఖ వ్యక్తి కుమారుడు కావడంతో పోలీసులు అతడిని వీఐపీలా ట్రీట్‌ చేసినట్లు తెలుస్తోంది.పూర్తి కథనం

10. అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికా-రష్యా మాటల యుద్ధం

అంతరిక్షంలో ఆయుధాల నిరోధక అంశానికి సంబంధించి అగ్రరాజ్యం అమెరికా (USA), రష్యాల మధ్య కొన్ని నెలలుగా మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో వాషింగ్టన్‌పై మాస్కో మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. అంతరిక్షంలో ఆయుధాలు ఉంచాలని అమెరికా భావించిందని పేర్కొంది. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని