Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 31 May 2024 21:00 IST

1. మనసులో మాట బయటపెట్టిన మల్లికార్జున ఖర్గే

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తన మనసులో మాటను బయటపెట్టారు. అగ్రనేత రాహుల్‌ గాంధీకి (Rahul gandhi) అండగా నిలిచారు. భాజపాను (BJP) ఓడించి ఇండియా (INDIA) కూటమి అధికారంలోకి వస్తే.. ప్రధాని అభ్యర్థిగా తాను రాహుల్‌నే సమర్థిస్తానని చెప్పారు. పూర్తి కథనం

2. భాజపాకి 303 సీట్లు నిలవాలంటే ఇదే కీలకం!

సార్వత్రిక సమరం తుది అంకానికి చేరుకుంది. శనివారం ఏడోవిడత పోలింగ్‌తో ఓటింగ్‌ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 1న 8 రాష్ట్రాల పరిధిలోని 57 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. గతంలో సాధించిన 303 స్థానాల రికార్డును బ్రేక్‌ చేయాలని భాజపా ఈసారి తీవ్రంగా ప్రయత్నించింది.  పూర్తి కథనం

3. గొర్రెల పంపిణీ స్కామ్‌.. మరో ఇద్దరు ఉన్నతాధికారులు అరెస్ట్‌

గొర్రెల పంపిణీ స్కామ్‌లో మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. పశుసంవర్థకశాఖ మాజీ సీఈ రాంచందర్‌రావు, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌ కుమార్‌ అరెస్టయ్యారు. రూ.2.10కోట్ల ప్రభుత్వ నిధులను రాంచందర్‌ దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలున్నాయి.  పూర్తి కథనం

4. అన్యాయాన్ని ఎదురిస్తూనే ఉంటా.. నా పోరాటం ఆగదు: ఏబీవీ

వైకాపా సర్కారు చేసిన అక్రమ సస్పెన్షన్ పై సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేసి విజయం సాధించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సగర్వంగా బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. సర్వీసులో చివరి రోజైన శుక్రవారం ఉదయం విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఏబీవీ.. సాయంత్రానికే పదవీ విరమణచేశారు. పూర్తి కథనం

5. విషాదంలో ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు

‘ఉప్పెన’ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెంకటరావు (68) మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పూర్తి కథనం

6. ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా రోహిత్ సొంతం: షకిబ్

కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) తన సారథ్యంలో తొలి ఐసీసీ ట్రోఫీని అందించాలనే లక్ష్యంతో బరిలోకి దిగాడు. టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) కోసం ఇప్పటికే టీమ్‌ఇండియా సాధన చేస్తోంది. శనివారం భారత్ - బంగ్లాదేశ్‌ (IND vs BAN) జట్ల మధ్య వార్మప్‌ మ్యాచ్‌ జరగనుంది. పూర్తి కథనం

7. ఆ విషయాలు నా పిల్లల నుంచే నేర్చుకున్నా.. మామా ఎర్త్‌ సీఈఓ

ఏదైనా పనిచేస్తున్నప్పుడు దగ్గరకొచ్చి.. ఎందుకిలానే చేయాలి? ఏమిటి ప్రయోజనం? అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు చిన్నారులు. చిన్న పని చేసినా తెగ సంబరపడిపోతుంటారు. ఇలాంటి విషయాలన్నీ మనం చిన్నపిల్లల చేష్టల్లో గమనిస్తూ ఉంటాం. ఇవే మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఇలా తన పిల్లల దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు బ్యూటీ బ్రాండ్ మామాఎర్త్‌ (Mamaearth) సహ-వ్యవస్థాపకురాలు, సీఈఓ గజల్ అలఘ్‌ (Ghazal Alagh).   పూర్తి కథనం

8. ఉత్తరాదికి ఎండదెబ్బ.. ఒక్క రోజులో 50 మంది మృతి

దేశవ్యాప్తంగా భానుడు భగభగమంటున్నాడు. వారం రోజులుగా ఉత్తరాదిన 50 డిగ్రీల సెల్సియస్‌ వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. దిల్లీ, రాజస్థాన్‌, బిహార్‌, యూపీతోపాటు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వడదెబ్బల ధాటికి అనేకమంది పిట్టల్లా రాలిపోతున్నారు. పూర్తి కథనం

9. గాల్లోని విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలపై ఎఫెక్ట్‌!

గాల్లో ఉన్న విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) ఘటన కలకలం రేపింది. ఇది కాస్త శ్రీనగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (Srinagar Airport)లో కార్యకలాపాల అంతరాయానికి దారితీసింది. అధికారుల వివరాల ప్రకారం.. ఎయిర్‌ విస్తారా (Air Vistara)కు చెందిన ఓ విమానం 178 మంది ప్రయాణికులతో దిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయల్దేరింది. పూర్తి కథనం

10. ప్రజ్వల్‌ రేవణ్ణకు జూన్‌ 6 వరకు సిట్ కస్టడీ

పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)కు బెంగళూరు కోర్టు కస్టడీ విధించింది. జూన్‌ 6 వరకు సిట్‌ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు