Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Mar 2024 13:16 IST

1. పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

రాజేంద్రనగర్‌ పరిధి కాటేదాన్‌లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని 3 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన సిబ్బంది బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైరింజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి కథనం

2. టికెట్‌ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత

లోక్‌సభ ఎన్నికల ముందు తమిళనాడు (Tamil Nadu)లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఈరోడ్‌ (Erode) ఎంపీ, ఎండీఎంకే నేత గణేశమూర్తి (77) కన్నుమూశారు. ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోవడంతో ఇటీవల ఆయన ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. కోయంబత్తూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.పూర్తి కథనం

3. కేసీఆర్‌ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్‌ ట్యాపింగ్‌: భాజపా ఎంపీ లక్ష్మణ్‌

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియంతృత్వాన్ని పాటించే వాళ్లు నీడను కూడా నమ్మరన్నారు.పూర్తి కథనం

4. కొనసాగుతున్న మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. దీని కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో 10 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎక్స్‌అఫీషియో సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.పూర్తి కథనం

5. న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ

దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ప్రముఖ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, పింకీ ఆనంద్‌ సహా 600 మందికి పైగా లాయర్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు.పూర్తి కథనం

6. భారత్‌ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్‌ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య (Nijjar Killing) కేసు నేపథ్యంలో భారత్‌, కెనడా (Canada) మధ్య దౌత్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హత్యలో భారత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుపై తాజాగా స్పందించిన ట్రూడో.. మరోసారి భారత్‌ (India)పై నోరుపారేసుకున్నారు.పూర్తి కథనం

7. భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్‌

కరోనా మహమ్మారి (Corona Pandemic) తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న రోజులవి. ప్రపంచమంతా స్తంభించిపోయింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి కష్టాలను చూసి కెనడాలోని ఓ వైద్యురాలు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. దీంతో ఆమె తీవ్ర విమర్శలపాలయ్యారు.పూర్తి కథనం

8.ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!

ఉప్పల్ స్టేడియం సిక్సర్లతో తడిసిపోయింది. ఐపీఎల్‌ చరిత్రలోనే రికార్డు స్థాయి పరుగుల సునామీ సన్‌రైజర్స్‌ సృష్టించింది. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 31 పరుగుల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ 277/3 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబయి 246/5కే పరిమితమైంది. పూర్తి కథనం

9. కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్‌కు కాంగ్రెస్‌ షాక్‌!

ప్రముఖ నటి, భాజపా ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై (Kangana Ranaut) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుప్రియా శ్రీనేత్‌కు (Supriya Shrinate ) కాంగ్రెస్‌ పార్టీ షాకిచ్చింది. తాజాగా విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఆమెను పక్కన పెట్టింది.పూర్తి కథనం

10. ‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్‌

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో హైదరాబాద్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయిని 31 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ ఐపీఎల్‌లోనే రికార్డు స్థాయి స్కోరును సాధించింది. ముగ్గురు బ్యాటర్లు హాఫ్‌ సెంచరీలు చేయడంతో 277/3 స్కోరు చేసింది. అంతకుముందు కోల్‌కతాపైనా 209 పరుగుల లక్ష్య ఛేదనలో 200+ పరుగులు వరకు వచ్చింది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని