Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Jun 2024 13:07 IST

1. చంద్రబాబును కలిసేందుకు పీఎస్‌ఆర్‌, కొల్లి రఘురామిరెడ్డికి అనుమతి నిరాకరణ

తెదేపా అధినేత, కాబోయే సీఎం చంద్రబాబును కలిసేందుకు యత్నించిన ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు అనుమతి నిరాకరించారు. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులను పోలీసులు అడ్డుకున్నారు. గురువారం ఉదయం ఉండవల్లిలోని నివాసం వద్దకు ఆయన చేరుకోగా అనుమతి లేదని చెప్పారు. పూర్తి కథనం

2. ‘నిజమైన రాజుకు ద్రోహం చేశారు’: అయోధ్య ఫలితంపై ‘రామాయణ్’ నటుడు

శ్రీరాముడి జన్మభూమి అయోధ్య క్షేత్రం ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ లోక్‌సభ స్థానంలో భాజపా (BJP) ఓటమిపాలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ కమలం అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ లల్లూ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ దళిత నేత అవధేశ్‌ ప్రసాద్‌ విజయం సాధించారు. ఈ ఫలితం (Ayodhya Result)పై ‘రామాయణ్‌’ ధారావాహికలోని లక్ష్మణ పాత్రధారి సునీల్‌ లాహ్రీ (Sunil Lahiri) అసంతృప్తి వ్యక్తం చేశారు.పూర్తి కథనం

3. ఎన్టీఆర్‌ పోస్ట్‌కు రిప్లై ఇచ్చిన చంద్రబాబు

ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu)కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. తనకు శుభాకాంక్షలు చెప్పిన వారికి ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో రిప్లై పెట్టారు.పూర్తి కథనం

4. మోదీ ప్రమాణస్వీకార మహోత్సవానికి విదేశీ నేతలు

తమ కూటమికి నాయకుడిగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు నరేంద్రమోదీ (Modi)ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో.. ఆయన మూడోసారి బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. ఈ నెల జూన్‌ 8న ప్రధానిగా ఆయన ప్రమాణస్వీకార మహోత్సవం(swearing-in ceremony) ఉండనుంది. దీనికి విదేశీ నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.పూర్తి కథనం

5. తెదేపా ఏజెంట్‌పై వైకాపా మూకల దాడి.. అడ్డొచ్చిన చిన్నపిల్లలపైనా కర్కశత్వం

వైకాపా నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రగిరి మండలం కల్‌రోడ్డుపల్లిలో ఇటీవల తెదేపా ఏజెంట్‌పై వైకాపా కార్యకర్తలు చేశారు. పోలింగ్‌ రోజు వైకాపా రిగ్గింగ్‌ను తెదేపాకు చెందిన ఏజెంట్‌ నందిపాటి త్యాగరాజు రిగ్గింగ్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ మూకలు కక్షగట్టి విచక్షణారహితంగా దాడి చేశాయి.పూర్తి కథనం

6. అక్కడ ప్రభుత్వ ‘డేటింగ్‌ యాప్‌’.. హ్యాపీ అంటోన్న ఎలాన్‌ మస్క్‌

నాగరికతను కాపాడుకోవడానికి ఎక్కువ మంది పిల్లలు ఉండాల్సిన అవసరం ఉందంటూ పలుమార్లు చెప్తుంటారు టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk). జననాల రేటును పెంచడానికి తాజాగా జపాన్ (Japan) తీసుకున్న నిర్ణయంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. టోక్యో స్థానిక యంత్రాంగం ఒక డేటింగ్‌ యాప్‌ను లాంచ్‌ చేయడమే అందుకు కారణం.పూర్తి కథనం

7. మీపై దాడికి ఇతరులకు ఆయుధాలిస్తాం.. పాశ్చాత్య దేశాలకు పుతిన్‌ హెచ్చరిక!

ఉక్రెయిన్‌తో తాము చేస్తున్న యుద్ధంలో (Russia Ukraine War) పాశ్చాత్య దేశాల జోక్యంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ (Putin) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది అలాగే కొనసాగితే తమ మిత్రదేశాలను ఉసిగొల్పుతామని పరోక్షంగా హెచ్చరించారు. జర్మనీ తమ ఆయుధాలను ఉక్రెయిన్‌తో ప్రయోగింపజేస్తోందని ఆరోపించారు. పూర్తి కథనం

8. బర్డ్‌ఫ్లూ వేరియంట్‌తో తొలి మరణం.. ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్‌వో

బర్డ్‌ఫ్లూ హెచ్‌5ఎన్‌2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వైరస్‌ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని వెల్లడించింది.పూర్తి కథనం

9. మోదీ 3.O టీమ్‌లో మంత్రులెవరో..? కేబినెట్‌ కూర్పుపై భాజపా కీలక భేటీ

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీయే (NDA) కూటమి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే తమ కూటమికి నాయకుడిగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మోదీ (PM Modi)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ఇప్పుడు దేశ ప్రజల దృష్టంతా మంత్రివర్గ (Union Cabinet) కూర్పుపైనే..!పూర్తి కథనం

10. కారు ఢీకొని.. పల్టీలు కొట్టిన మరో కారు

కంటోన్మెంట్ సికింద్రాబాద్ క్లబ్ వద్ద ఘోరప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టడంతో మరో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. గురువారం ఉదయం సికింద్రాబాద్ క్లబ్ వద్ద సిగ్నల్‌ పడిన సమయంలో రోడ్డు దాటుతున్న కారు.. అడ్డుగా వచ్చిన మరో కారును బలంగా ఢీకొంది. దీంతో డివైడర్‌పై నుంచి దూసుకెళ్లిన కారు మూడు పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తూ కారులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని