Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 16 Apr 2024 12:59 IST

1. ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మార్పు: ఎంపీ ధర్మపురి అర్వింద్‌

వందరోజుల్లో అమలు కాని కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీలు.. ఆగస్టు తర్వాత ఎలా సాధ్యమని భాజపా (BJP) ఎంపీ ధర్మపురి అర్వింద్‌ (Dharmapuri Arvind) ప్రశ్నించారు. నిజామాబాద్‌లో ఇంటింటి ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. పూర్తి కథనం

2. అర్ధరాత్రి విచారణా..? నిద్రించే హక్కును ఉల్లంఘించడమే: బాంబే హైకోర్టు

నిద్రించే హక్కును ఉల్లంఘించలేమని, అది మనుషుల ప్రాథమిక అవసరమని బాంబే హైకోర్టు (Bombay High Court) అభిప్రాయపడింది. ఓ వ్యక్తి విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేసింది.పూర్తి కథనం

3. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. 18 నుంచి అందుబాటులోకి జులై కోటా

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జులై నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంట‌ల‌కు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.పూర్తి కథనం

4. భారత ఎన్నికలను గమనిస్తున్నాం: జర్మన్ రాయబారి

భారత్‌లో జరగనున్న ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికలను జర్మనీ ఆసక్తిగా గమనిస్తోందని ఆ దేశ రాయబారి ఫిలిప్ అకెర్‌మాన్ అన్నారు. ఈ ప్రక్రియను తాము గౌరవిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా అంతర్జాతీయ వేదికపై భారత్‌ ప్రభావం మరింత పెరుగుతుందన్నారు. పూర్తి కథనం

5.  శిరోముండనం కేసుపై నేడు విశాఖ కోర్టు తీర్పు.. ఉత్కంఠ

తీవ్ర సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. 1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు. పూర్తి కథనం

6. కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన భాజపా

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిని భాజపా (BJP) ఖరారు చేసింది. వంశా తిలక్‌ను ఎంపిక చేస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. 2023లో జరిగిన ఎన్నికల్లో భారాస నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.పూర్తి కథనం

7. కౌంటర్‌కు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. UTS యాప్‌తో బుకింగ్ ఎలా..?

ఇంటర్నెట్‌డెస్క్‌: దగ్గరైనా, దూరమైనా.. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఎక్కువమంది ఇష్టపడేది ట్రైన్‌ జర్నీనే. సాధారణంగా బెర్త్‌ బుక్‌ చేసుకోవాలంటే చాలా రోజుల ముందే టికెట్ బుక్‌ చేసుకోవాలి. అప్పటికప్పుడు జర్నీ కోసమైతే కౌంటర్‌ వద్దే టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తి కథనం

8. నేనూ బ్యాటర్‌ అయితే బాగుండే: కమిన్స్‌

హైదరాబాద్‌ జట్టు సోమవారం ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో బ్యాటర్ల విధ్వంసానికి బెంగళూరు బౌలర్లు చేతులెత్తేశారు. ట్రావిస్‌ హెడ్‌ బంతిపై పగబట్టినట్లుగా విరుచుకుపడటంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు.పూర్తి కథనం

9. సన్‌రైజర్స్‌ దండయాత్ర.. రికార్డులే రికార్డులు..

ఈ ఐపీఎల్‌(IPL) సీజన్‌లో హైదరాబాద్‌ దండయాత్ర కొనసాగుతోంది. బ్యాట్‌తో వీరవిహారం చేస్తూ.. తాను నమోదు చేసిన రికార్డులను తానే బ్రేక్‌ చేస్తోంది. ట్రావిస్‌ హెడ్‌ పిడుగులు, క్లాసెన్‌ ఉరుములు, అభిషేక్‌, మార్‌క్రామ్‌ మెరుపులతో నిన్న చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిసింది. పూర్తి కథనం

10. భారాస మాదిరిగానే కాంగ్రెస్‌ది మాటల గారడీ: భాజపా ఎంపీ లక్ష్మణ్‌

కాంగ్రెస్‌పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు వరి పంట బోనస్‌ ఇవ్వలేదని, వచ్చే సీజన్‌కు ఇస్తామంటున్నారని చెప్పారు. ఇదేమైనా వాయిదాల ప్రభుత్వమా అని ఎద్దేవా చేశారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని