Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 May 2024 13:08 IST

1. పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి

హింసను ప్రేరేపించేలా అనేక వేదికల్లో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  రెచ్చగొట్టె  వ్యాఖ్యలు చేశారని.. తెదేపా నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. గుంటూరులో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘పల్నాడు జిల్లాలో హింసపై ముందుగానే అప్రమత్తం చేశాం. ఈసీ, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. పూర్తి కథనం

2. ‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. తమ ఎంపీకి భాజపా షోకాజ్‌ నోటీసులు

కేంద్ర మాజీ మంత్రి, తమ పార్టీ ఎంపీ జయంత్‌ సిన్హా (Jayant Sinha) తీరుపై భాజపా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన.. తాజా ఎన్నికల్లో ఓటు హక్కు కూడా వినియోగించుకోకపోవడంపై ఆగ్రహించింది. దీంతో చర్యలకు ఉపక్రమించింది. షోకాజ్‌ నోటీసులు (Show Cause Notice) జారీ చేసింది.పూర్తి కథనం

3. అనంతపురంలో ఎన్‌ఐఏ అదుపులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూర్‌ వీధికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఆయన కుమారుడు సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.పూర్తి కథనం

4. ఎట్టిపరిస్థితుల్లోనూ భారత భద్రతకు ముప్పును అనుమతించబోం: శ్రీలంక

భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను తాము అనుమతించబోమని శ్రీలంక (Sri Lanka) విదేశాంగ మంత్రి అలీ సబ్రీ అన్నారు. పొరుగు దేశంగా అది తమ బాధ్యత అని స్పష్టం చేశారు. భారత భద్రత ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.పూర్తి కథనం

5. డీజీపీ ఫొటోతో వాట్సప్‌ డీపీ.. సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు

తెలంగాణ డీజీపీ ఫొటోతో కేటుగాళ్లు సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సప్‌ డీపీగా డీజీపీ రవిగుప్తా ఫొటో పెట్టి మోసాలు చేస్తున్నారు. ఈక్రమంలో ఓ వ్యాపారవేత్తకు, ఆయన కుమార్తెకు వాట్సప్‌ కాల్స్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. కేసు నుంచి తప్పించేందుకు రూ.50 వేలు డిమాండ్‌ చేశారు.పూర్తి కథనం

6. నోరుజారి ఇరకాటంలో పడి.. ఉపవాసానికి సిద్ధమై: వివాదం వేళ భాజపా నేత పోస్టు

ఒడిశా(Odisha)లో ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా నేత సంబిత్‌ పాత్ర (Sambit Patra) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అది అనుకోకుండా జరిగిందని, దానికి ప్రాయశ్చిత్తంగా ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీడియో సందేశం విడుదల చేశారు.పూర్తి కథనం

7. అట్టహాసంగా నియామక పత్రాలిచ్చారు.. 4 నెలలుగా జీతాలివ్వలేదు: హరీశ్‌రావు

నర్సింగ్‌ ఆఫీసర్లకు కాంగ్రెస్‌ ప్రభుత్వం 4 నెలలుగా జీతాలివ్వలేదని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. భారాస హయాంలో చేసిన రిక్రూట్‌మెంట్‌ను ఈ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుందని ఆరోపించారు. ఎల్బీ స్టేడియం వద్ద అట్టహాసంగా నియామక పత్రాలిచ్చి.. జీతభత్యాలను పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.పూర్తి కథనం

8. సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు

సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు చేపట్టింది. అశోక్‌నగర్‌లోని ఇంటితో సహా ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఆయనకు ఉన్న ఆస్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సర్వీసు రికార్డు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌లోని 6 చోట్ల, మిగతా 4 ప్రాంతాల్లో దాడులు చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి.పూర్తి కథనం

9. మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే

దేశ వ్యాప్తంగా ఐదు విడతల పోలింగ్‌ ముగిసే నాటికి విపక్ష కూటమి బలంగా పుంజుకొందని కాంగ్రెస్‌ (Congress) అధినేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) విశ్వాసం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రాజ్యాంగానికి ముప్పు, ప్రజాస్వామ్యంపై దాడి వంటివే ప్రధాన అంశాలుగా ఎన్నికలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.పూర్తి కథనం

10. కాకాణి అవినీతిపై పెద్ద పుస్తకమే రాయొచ్చు : సోమిరెడ్డి

బెంగళూరు రేవ్‌పార్టీతో సంబంధం లేదని మంత్రి కాకాణి చెబుతున్నారని.. ఆయన పేరుతో ఉన్న స్టిక్కర్‌ అక్కడి కారులో ఎలా దొరికిందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రేవ్‌ పార్టీ జరిగిన ఫాంహౌస్‌ యజమాని గోపాల్‌ రెడ్డి.. కాకాణికి మిత్రుడు. ఈ వ్యవహారంతో సంబంధం లేదంటున్న కాకాణి స్టిక్కర్‌ అక్కడ ఎలా దొరికింది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని