Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 22 Apr 2024 13:01 IST

1. ప్రభుత్వం మారినప్పుడల్లా పరిశ్రమలు తరలిపోకుండా ప్రత్యేక చట్టం: నారా లోకేశ్‌

తమ పార్టీ అధికారంలోకి వచ్చాక వైకాపా హయాంలో అదృశ్యమైన యువతుల ఆచూకీ కనుక్కొని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం కాజాలోని ఏఆర్ అపార్టుమెంట్‌ వాసులతో ఆయన సమావేశమై మాట్లాడారు. పూర్తి కథనం

2. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు

భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. సుల్తాన్‌బజార్ పీఎస్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ ఫిర్యాదు మేరకు అదే పీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. పూర్తి కథనం

3. ఈరోజు గూగుల్‌ డూడుల్‌ గమనించారా? అక్షరాలను పోలి ఉన్న ఆ చిత్రాలేంటో తెలుసా?

నేడు గూగుల్‌ డూడుల్‌ పరిశీలించారా? ధరిత్రి దినోత్సవం సందర్భంగా గూగుల్‌ ప్రత్యేకంగా రూపొందించిన ఈ డూడుల్‌ (Google Doodle) అందరినీ ఆకర్షిస్తోంది. అవి చూడ్డానికి ఫొటోల్లాగే కనిపిస్తున్నా.. వాటిలో ‘G O O G L E’ అనే అక్షరాలు దాగి ఉన్నాయి. తీక్షణంగా గమనిస్తే అవి కనిపిస్తాయి.పూర్తి కథనం

4. ఏపీ టెన్త్‌ ఫలితాలు: పార్వతీపురం మన్యం ఫస్ట్‌.. కర్నూలు లాస్ట్‌

ఏపీ పదో తరగతి ఫలితాల్లో (AP SSC Results) 86.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. రిజల్ట్స్‌ విడుదల సందర్భంగా ఉత్తీర్ణత వివరాలను విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ వివరించారు. బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత సాధించగా..  బాలురు 84.32 శాతం పాసయ్యారు. 2,803 పాఠశాలలు శతశాతం.. 17 స్కూళ్లలో సున్నా ఉత్తీర్ణత నమోదైంది.పూర్తి కథనం

5. 66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

అమెరికా పౌరసత్వం పొందుతున్న వారిలో భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. 2022లో మెక్సికో తర్వాత అత్యధిక మంది అక్కడి పౌరసత్వం పొందింది మనవారే. ఆ ఏడాదిలో 65,960 మందికి సహజీకృత సిటిజన్‌షిప్‌ (Naturalisation citizenship) లభించింది.పూర్తి కథనం

6. మోదీ వ్యాఖ్యలపై వివాదం.. మైనార్టీలపై నాడు మన్మోహన్‌ ఏమన్నారు?

కేంద్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దేశ వనరులపై మైనార్టీలదే తొలి హక్కు అని గతంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) చేసిన వ్యాఖ్యలను ఆయన తాజాగా ప్రస్తావించారు. దీనిపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.పూర్తి కథనం

7. క్వైట్‌ ఫైరింగ్‌.. పొమ్మనలేక పొగబెట్టడం..!

కొంత కాలంగా అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2024లోనూ అది కొనసాగుతోంది. ముఖ్యంగా టెక్‌ రంగంలో మరింత ఎక్కువగా ఉంది. ఆర్థిక అనిశ్చితులతో పాటు సాంకేతికంగా వచ్చిన అనేక కొత్త మార్పులే దీనికి కారణం. ఈ క్రమంలో కంపెనీలు ఉద్యోగులను తీసివేసే విషయంలో వివిధ పద్ధతులను అనుసరిస్తున్నాయి.పూర్తి కథనం

8. కోల్‌కతాతో మ్యాచ్‌.. చర్చకు దారితీసిన కోహ్లీ ఔట్‌ వివాదం!

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో మరోసారి అంపైరింగ్‌పై విమర్శలు వచ్చాయి. తాజాగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ (18: 7 బంతుల్లో 2 సిక్స్‌లు, ఒక ఫోర్) దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థి నిర్దేశించిన 223 పరుగుల లక్ష్య ఛేదనను బెంగళూరు వేగంగా ప్రారంభించింది. కానీ, హర్షిత్ రాణా వేసిన (2.1వ ఓవర్‌) బంతిని ఆడబోయిన కోహ్లీ (Virat Kohli) బౌలర్‌కే క్యాచ్‌ ఇచ్చాడు.పూర్తి కథనం

9. రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. బలి అవుతున్న అమాయకులు

గతంలో కలకలం సృష్టించి ప్రజల ఆత్మహత్యకు కారణమైన రుణ యాప్‌లపై పోలీసుల నిఘా పెరగడంతో తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రస్తుతం నేరగాళ్లు రూటు మార్చి మరో అడుగు ముందుకేసి సరికొత్త పంథాలో బాధితులకు నరకం చూపిస్తున్నారు. అసలు రుణం తీసుకోకున్నా ఎంతోకొంత బ్యాంకు ఖాతాలో జమచేసి తిరిగి వడ్డీతో సహా కట్టాలంటూ ఫోన్లు చేయడం, ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు.  పూర్తి కథనం

10. 30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి: 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీం అసాధారణ తీర్పు

అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలికకు సుప్రీంకోర్టు (Supreme Court) ఊరట కల్పించింది. దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని (pregnancy) వైద్యపరంగా విచ్ఛిత్తి (medical termination) చేసుకునేందుకు అనుమతించింది. దీనిని ‘అసాధారణ’ కేసుగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం.. విస్తృత అధికారాలను ఉపయోగించుకుని తీర్పు వెలువరించింది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని