Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 May 2024 13:13 IST

1. ఆర్టీసీ కొత్త లోగో చూపుతున్న వారిపై కేసులేవీ: కేటీఆర్‌

కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్నవారిపై కేసులు ఎందుకు పెట్టట్లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ప్రశ్నించారు. డీజీపీ, టీజీఎస్‌ఆర్టీసీ ఎండీకి ఆయన ప్రశ్నలు సంధించారు. ఆర్టీసీ కొత్త లోగో చూపుతున్న వారిపై కేసులు ఎందుకు పెట్టట్లేదని నిలదీశారు. రాజకీయ పెద్దల మాటలు విని వేధిస్తే మిమ్మల్ని కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. పూర్తి కథనం

2. వలపు వలతో చంపి.. చర్మాన్ని ఒలిచి: బంగ్లా ఎంపీ హత్య కేసులో వెలుగులోకి దారుణాలు

చికిత్స కోసం పశ్చిమ బెంగాల్‌కు వచ్చి హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ మహమ్మద్‌ అన్వర్‌ ఉల్‌ అనర్‌ (Anwarul Azim Anar) కేసులో మరిన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ మహిళతో ఆయనను వలపు వలలోకి లాగి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఓ అక్రమ వలసదారుడిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు.పూర్తి కథనం

3. భద్రాచలంలో నర్సింగ్‌ విద్యార్థిని మృతి.. కళాశాల వద్ద బంధువుల ఆందోళన

నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతికి నిరసనగా భద్రాచలం పారా మెడికల్ కళాశాల వద్ద విద్యార్థులు, బంధువులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నర్సింగ్‌ విద్యార్థిని కారుణ్య గురువారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కళాశాల ప్రాంగణంలో గాయాలతో పడి ఉన్న ఆమెను.. యాజమాన్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది.పూర్తి కథనం

4. తిరుమలలో రద్దీ.. 3 కి.మీ మేర బారులు తీరిన భక్తులు..

శ్రీవారి దర్శనానికి తిరుమలలో శుక్రవారం రద్దీ  నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. వీరికి శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తితిదే ప్రకటించింది.పూర్తి కథనం

5. ఆస్ట్రేలియాలో షాద్‌నగర్‌ వాసి అనుమానాస్పద మృతి

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ వాసి అరటి అరవింద్ యాదవ్ (30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షాద్‌నగర్‌ భాజపా నేత అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరవింద్.. ఉద్యోగరీత్యా సిడ్నీలో స్థిరపడ్డాడు. ఐదు రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోగా కుటుంబ సభ్యులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.పూర్తి కథనం

6. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌లో కుదుపులు.. ప్రయాణికుల మెదడు, వెన్నుకు తీవ్ర గాయాలు!

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆకాశంలో భారీ కుదుపునకు (Singapore Airlines Turbulence Incident) లోనైన ఘటనలో కొంత మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డట్లు బ్యాంకాక్‌ ఆసుపత్రి వర్గాలు గురువారం వెల్లడించాయి. కొందరికి పుర్రె , మెదడు, వెన్నెముక భాగాల్లో తీవ్ర గాయాలను గుర్తించినట్లు తెలిపాయి.పూర్తి కథనం

7. ‘కూలడానికి 90 సెకన్ల ముందు’.. ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌ ప్రమాదంపై తొలి నివేదిక!

ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) మరణానికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదంపై (Iran Presidents Helicopter crash) ఆ దేశ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తొలి నివేదికను విడుదల చేశారు. ఘటన తర్వాత వివిధ విభాగాలకు చెందిన నిపుణులతో కూడిన దర్యాప్తు బృందం సోమవారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్నట్లు నివేదికను ఉటంకిస్తూ తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది.పూర్తి కథనం

8. ‘మనెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చు’.. ఏఐపై మస్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

టెక్‌ ప్రపంచంలో కృత్రిమ మేధ (Artificial Intelligence - AI ) సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. ఆ దిశగా జరుగుతున్న ప్రయోగాలు, పరిశోధనలు ఓ వైపు ఆసక్తి రేకెత్తిస్తూనే.. మరోవైపు ఆందోళనకూ గురిచేస్తున్నాయి. ఉపాధి అవకాశాలు కనుమరుగవుతాయనే వాదన కొన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది.పూర్తి కథనం

9. కోచ్‌ పదవికి ఏ ఆసీస్ మాజీని సంప్రదించలేదు: జై షా

 టీమ్ఇండియా ప్రధాన కోచ్‌ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ చివరితో ముగియనుంది. టీ20 ప్రపంచ కప్‌ ముగిసిన నాటి నుంచి కొత్త కోచ్‌ బాధ్యతలు చేపడతాడు. తాజాగా భారత కోచ్‌గా తీవ్ర స్థాయిలో ఒత్తిడి, రాజకీయాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆసీస్‌ మాజీ ఆటగాడు జస్టిన్‌ లాంగర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  పూర్తి కథనం

10. భారాస హత్యా రాజకీయాలు చేయడం దురదృష్టకరం: జూపల్లి

భారాస హత్యా రాజకీయాలు చేయడం దురదృష్టకరమని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘భారాస కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్య అంశంపై ఆ పార్టీ నిరాధార ఆరోపణలు చేస్తోంది. మృతుడికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉంది. గతంలో మా కార్యకర్తలు మరణించినప్పుడు నేను ఇలా ఆరోపణలు చేయలేదు. హత్యలను రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడటం సరికాదు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని