Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 May 2024 13:12 IST

1. జవహర్‌రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు.. చీప్ సెక్రటరీ: మాజీ మంత్రి సోమిరెడ్డి

ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డిపై తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశారు. ‘‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ సీఎస్ కూడా ఇలా దిగజారలేదు. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు, చీప్ సెక్రటరీ. ఆయన హయాంలో రాష్ట్రంలోని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. పూర్తి కథనం

2. యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటల సమయం

వేసవి సెలవులు, వారాంతం కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. మెట్ల దారిలో రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు. తమ కోర్కెలు తీరాలని మొక్కులు చెల్లించుకున్నారు.పూర్తి కథనం

3. పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైకాపా మూకలు.. వెలుగులోకి మరో వీడియో

ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు, కార్యకర్తల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలింగ్‌ తర్వాతి రోజు గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలం పెద్ద అగ్రహారంలో వైకాపా మూకలు రెచ్చిపోయాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తెదేపా మద్దతుదారులపై కర్రలు, రాళ్లతో ఆ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.పూర్తి కథనం

4. త్వరలో ఇజ్రాయెల్‌కు సర్‌ప్రైజ్‌.. హెజ్‌బొల్లా హెచ్చరిక

గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్‌ (Israel) యుద్ధం ప్రారంభించి దాదాపు ఎనిమిది నెలలు కావస్తోంది. ఇప్పటికీ ముగింపు దిశగా ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు. ఈ తరుణంలో ఇరాన్‌ మద్దతున్న హెజ్‌బొల్లా (Hezbollah) గ్రూప్‌ ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేసింది. హమాస్‌కు మద్దతుగా దాడులకు దిగుతున్న ఈ సంస్థ త్వరలో తమ నుంచి ఇజ్రాయెల్‌ ‘సర్‌ప్రైజ్‌’ అందుకోబోతోందంటూ ఓ సందేశాన్ని విడుదల చేసింది.పూర్తి కథనం

5. ఆర్వో సీల్ లేకున్నా పోస్టల్‌ బ్యాలట్లు తిరస్కరించవద్దు: ఈసీ

రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) సీల్‌ లేకున్నా పోస్టల్‌ బ్యాలట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈసీ మార్గదర్శకాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా పంపించారు.పూర్తి కథనం

6. నా ఇబ్బంది చెప్పినా.. అప్పుడు ఎవరూ అంగీకరించలేదు: శ్రేయస్‌

ఐపీఎల్ 17వ సీజన్‌ ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR vs SRH) సిద్ధమైంది. అయితే, నిన్న సాయంత్రం చెన్నైలో వర్షం పడటంతో ఆ జట్టు ప్రాక్టీస్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఇండోర్‌లోనే గడిపేసింది.పూర్తి కథనం

7. భారాస ఖాతాలోని డబ్బును వెంటనే ఫ్రీజ్‌ చేయాలి: రఘునందన్‌రావు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారాసపై భాజపా మాజీ ఎమ్మెల్యే, మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంచలన ఆరోపణ చేశారు. ఈ ఎన్నికల్లో రూ.30కోట్లతో ఓట్ల కొనుగోలుకు ఆ పార్టీ తెరలేపిందన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆయన లేఖలు రాశారు.పూర్తి కథనం

8. సీఎం రేవంత్‌ను కలిసిన నందమూరి బాలకృష్ణ

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని (Revanth reddy) ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) కలిశారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా ఆయన భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు.పూర్తి కథనం

9. బార్క్ ఎయిర్‌.. ఈ విమానం కేవలం శునకాలకే

పెంపుడు శునకాలతో విమాన ప్రయాణమంటే పెద్ద సవాలే. అవి ఎక్కడ భయపడిపోతాయోననే ఆందోళన. పైగా విమానయాన సంస్థల ఆంక్షలు. వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకు ‘బార్క్‌ ఎయిర్‌’ (BarkAir) అనే సంస్థ సిద్ధమైంది. ప్రత్యేకంగా పెంపుడు శునకాల కోసమే విమాన సేవలను ప్రారంభించింది.పూర్తి కథనం

10. ఆ రూమర్స్‌పై స్పందించిన ‘సలార్‌ 2’ నిర్మాణ సంస్థ.. ఏమందంటే?

హీరో ప్రభాస్‌ (Prabhas)- డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సలార్‌’ (Salaar). బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్‌ ఉందన్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌కు, ప్రశాంత్ నీల్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు వచ్చాయని, అందుకే ‘సలార్‌ 2’ (Salaar 2) ప్రాజెక్టు రద్దు అయిందని ఇటీవల జోరుగా ప్రచారం సాగింది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని