Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 08 May 2023 21:03 IST

1. సోనియమ్మ బిడ్డగా మాటిస్తున్నా.. యూత్ డిక్లరేషన్ అమలు చేస్తాం: ప్రియాంక

తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌లో నిర్వహించిన ‘యువ సంఘర్షణ’ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్‌ అగ్రనేత, ఏఐసీసీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీకి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అత్యంత వేడిలోనూ సభకు భారీ ఎత్తున తరలివచ్చారని.. తనకు ప్రేమ పూర్వకంగా స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికీ ప్రియాంక గాంధీ ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. రూ.80కే నగరమంతా తిరిగేయొచ్చు!

నగర మహిళలకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టి-24 టికెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.100 ఉన్న టి-24 టికెట్‌ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90కి, సీనియర్‌ సిటిజన్లకు రూ.80కి ఇటీవల టీఎస్‌ఆర్టీసీ తగ్గించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఐదు శీర్షికలుగా హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌.. ప్రవేశపెట్టిన రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో 60 ఏళ్లు పోరాడినా ఆకాంక్షలు నెరవేరలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌నకు విచ్చేసిన కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీకి ఆయన ఘన స్వాగతం పలికారు. సరూర్‌నగర్‌లో నిర్వహించిన ‘యువ సంఘర్షణ’ సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఓయూ, కాకతీయ వర్సిటీలు కేవలం విశ్వవిద్యాలయాలే కావని.. అవి తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలు అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కర్ణాటకలో ప్రచారానికి తెర.. ఎల్లుండే బిగ్‌ ఫైట్‌!

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) ప్రచారానికి తెరపడింది. భాజపా- కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన అగ్రశ్రేణి నాయకులు పోటాపోటీగా సాగించిన ప్రచార అంకం సోమవారంతో ముగిసింది. నెల రోజులకు పైగా బహిరంగ సభలు, రోడ్‌ షోలతో సందడి వాతావరణం నెలకొన్న కర్ణాటకలో ఒక్కసారిగా మైకులు మూగబోయాయి. తమ చివరి ప్రయత్నంగా నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మోదీ నోట ఆ వ్యాఖ్యలా?.. ఆశ్చర్యపోయానన్న పవార్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ(PM Modi) మతపరమైన నినాదాలు ఇవ్వడం తనను ఆశ్చర్యపర్చిందని ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌(NCP president Sharad Pawar) అన్నారు. మతం, మతపరమైన అంశాలను ఎన్నికల ప్రచారంలో జొప్పించడం సరికాదని మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. డబ్ల్యూటీసీ ఫైనల్.. కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ 

టీమ్‌ఇండియా యువ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌కు టెస్టుల్లోకి పిలుపొచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌నకు ఎంపికై గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను తీసుకుంటున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. రుతురాజ్ గైక్వాడ్, ముఖేశ్ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. యాపిల్ ఉద్యోగులకు లేఆఫ్‌లు.. టిమ్‌ కుక్‌ ఏమన్నారంటే?

ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్‌ (Layoffs)లు విధిస్తున్నాయి. గతేడాది ట్విటర్‌ (Twitter)తో ప్రారంభమై.. అమెజాన్‌ (Amazon), మైక్రోసాఫ్ట్ (Microsoft), గూగుల్ (Google), మెటా (Meta) వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కానీ, యాపిల్‌ (Apple) మాత్రం ఇప్పటి వరకు లేఆఫ్‌ల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మరణానంతరం దేహాన్ని భద్రపరుచుకునేందుకు సిద్ధం: బిలియనీర్‌ ఆసక్తికర నిర్ణయం

మరణం తర్వాత మళ్లీ ప్రాణాన్ని తిరిగితీసుకురావచ్చా..! ఈ అంశంపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. జీవితకాలం పెంపుపై పరిశోధనలు సాగుతున్నాయి. ఈ సమయంలో ఓ బిలియనీర్‌ తీసుకున్న నిర్ణయం ఆసక్తి కలిగిస్తోంది. మరణానంతరం తన దేహాన్ని భద్రపరుచుకునేందుకు సిద్ధమయ్యారు. భవిష్యత్తులో తిరిగి బతకొచ్చనే ఆలోచనే అందుకు కారణం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కర్ణాటక ‘సార్వభౌమత్వం’ పిలుపుపై దుమారం.. కాంగ్రెస్‌పై ఈసీకి ఫిర్యాదు!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) ప్రచారం చివరి రోజు కీలక పరిణామం. కర్ణాటక (Karnataka) ప్రతిష్ఠకు, సార్వభౌమత్వానికి (Sovereignty), సమగ్రతకు ముప్పు వాటిల్లేలా తమ పార్టీ ఎవరినీ అనుమతించదంటూ సోనియా గాంధీ (Sonia Gandhi) పేరిట కాంగ్రెస్‌ ఇటీవల చేసిన ఓ ట్వీట్ దుమారం రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మైసూరులో నిర్వహించిన ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలను ఖండించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇంటర్నేషనల్‌ నంబర్ల నుంచి వాట్సాప్‌ కాల్స్‌ వస్తున్నాయా? జాగ్రత్త!

వాట్సాప్‌ అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో చాలా మంది సాధారణ ఎస్‌ఎంఎస్‌ల ద్వారానే సందేశాలను పంపించుకునేవారు. కానీ, అనవసర మెసేజ్‌లు, మోసపూరిత సందేశాలు ఎక్కువవడంతో వాటికి స్వస్తి పలికారు. వాట్సాప్‌ (WhatsApp)లో ఆ బెడద లేకపోవడంతో అందరూ ఈ వేదికను వాడుకోవడం మొదలుపెట్టారు. కానీ, ఇటీవల వాట్సాప్‌ (WhatsApp)లోనూ స్కామ్‌ మెసేజ్‌లు, కాల్స్‌ ఎక్కువైపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని