Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Nov 2022 14:08 IST

1. ‘మా రాష్ట్రంలో కమీషన్లు ఇవ్వనిదే ఏదీ జరగదు’.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో కమీషన్లు ఇవ్వనిదే ఏ పని జరగదంటూ ఆయన మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పార్టీ సీనియర్‌ నేత, మాజీ సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర భాజపా సర్కారును ఇరుకునపడేసింది. ఆ వీడియోలో తీరత్‌ సింగ్ ఓ గదిలో కూర్చుని రాష్ట్రంలోని ‘కమీషన్‌ఖోరి’ గురించి మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమం: వైద్యులు

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులిటెన్ విడుదల చేశారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ‘‘కార్డియాక్‌ ఆరెస్టుతో కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారు. కార్డియాలజిస్టుల బృందం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది. కృష్ణకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్నాం. 24గంటల వరకు ఏమీ చెప్పలేం. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు మరోసారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తాం’’ అని వైద్యులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. లిక్కర్‌ స్కాంలో మనీష్‌ సిసోదియా సహాయకుడి అరెస్టు..!

దిల్లీ లిక్కర్‌ స్కాంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా సహాయకుడిని నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్స్‌ చీఫ్‌ విజయ్‌ నాయర్‌ను నేడు ఈడీ అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ప్రకటించింది.  మనీలాండరింగ్‌ కేసు కింద ఈడీ విచారించేందుకు ఆయనను కస్టడీకి కోరనుంది. ఇప్పటికే దిల్లీ లిక్కర్‌ స్కాంలో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఇతడు, వ్యాపారవేత్త అభిషేక్‌ బోయినపల్లి సీబీఐ కస్టడీలో ఉన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. చేతిలో చాలా పనుంది.. 24X7 కష్టపడుతున్నా: ఎలాన్‌ మస్క్‌

ఇటీవల ట్విటర్‌ను సొంతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌.. దాంట్లో సమూలంగా మార్పు తీసుకురావడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఆదాయం పెంచుకోవడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అందరూ కష్టపడి పనిచేయాలని.. అలాగైతేనే కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని ఉద్యోగులకు సూచించారు. రోజుకి 12 గంటల వరకు పనిచేయాలని కోరారు. అయితే, వారికి చెప్పడమే కాదు.. తానూ కష్టపడి పనిచేస్తున్నానంటున్నాడు ఈ ప్రపంచ కుబేరుడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బ్యాట్‌తో వీళ్లు.. బంతితో వాళ్లు దుమ్మురేపేశారు..!

పొట్టి ప్రపంచకప్‌ ముగిసింది. ఫైనల్‌ పోరులో.. చిన్న లక్ష్యాన్ని కాపాడుకోవడానికి పాక్‌ చేసిన ప్రయత్నం.. అంతకుమించి ఇంగ్లాండ్‌ అద్వితీయమైన ప్రదర్శన అభిమానులకు అసలు సిసలైన క్రికెట్‌ మజాను అందించింది. ప్రతీ మ్యాచ్‌ ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ టోర్నీలో పలువురు ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన టాప్‌ 5 ఆటగాళ్ల వివరాలు తెలుసుకుందామా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈ వారం థియేటర్‌/ఓటీటీలో రాబోతున్న చిత్రాలివే

ఈ వారం థియేటర్‌లో మరికొన్ని చిన్న చిత్రాలు సందడి చేయనుండగా, ఓటీటీలో మాత్రం బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. థియేటర్‌: నవంబర్‌ 18- మసూద, సుధీర్‌ ‘గాలోడు’, అలిపిరికి అల్లంత దూరంలో, సీతారామపురంలో ఒక ప్రేమ జంట, అజయ్‌దేవ్‌గణ్‌ ‘దృశ్యం2’. ఓటీటీ: నవంబరు 16- ది వండర్‌(నెట్‌ఫ్లిక్స్‌). నవంబర్‌ 17- అహనా పెళ్లంట(జీ5), ఇరవతం(డిస్నీ+హాట్‌స్టార్‌). పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ట్విటర్‌లో కొనసాగుతున్న లేఆఫ్‌లు.. మరో 4400 మంది తొలగింపు..!

కొత్త యజమాని ఎలాన్ మస్క్‌ నేతృత్వంలో ట్విటర్‌లో ఉద్యోగుల లేఆఫ్‌ కొనసాగుతోంది. ఈ సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న వారానికే ట్విటర్‌లో దాదాపు సగం మంది ఉద్యోగులకు మస్క్‌ ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఔట్‌సోర్సింగ్‌ విభాగంలోనూ కోతలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో 5500 మంది కాంట్రాక్టు ఉద్యోగులుండగా.. వీరిలో 4400 మందిని ట్విటర్‌ తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. హత్యచేసి, 35 ముక్కలుగా కోసి.. దిల్లీ అంతా విసిరి..!

దేశ రాజధాని నగరం దిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక హత్య కేసు విచారణ సమయంలో  విస్తుపోయే విషయాలు బయటకువచ్చాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతురాలు శ్రద్ధా(26) ముంబయిలోని ప్రముఖ సంస్థ కాల్‌ సెంటర్‌లో పనిచేసేది. ఈ క్రమంలో ఆమెకు అఫ్తాబ్‌ అమీన్‌ పునావాలాతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి.. ఇద్దరు సహజీవనంలో ఉన్నారు. అయితే వారి బంధాన్ని ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఐసీసీ అత్యంత విలువైన జట్టు ఇదే.. కోహ్లీ, సూర్యకు చోటు

పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2022లో అత్యంత విలువైన ఆటగాళ్లతో కూడిన టీమ్‌ను ఐసీసీ తాజాగా ప్రకటించింది. టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. తాజా టోర్నీలో 98.66 సగటుతో 296 పరుగులు చేసిన కింగ్‌ కోహ్లీ ఈ జాబితాలో ముందు వరసలో నిలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎమ్మెల్యేలకు ఎర కేసు.. పరారీలో కేరళ వైద్యుడు

తెరాస ఎమ్మెల్యేలకు ఎరవేసిన కేసులో ప్రమేయమున్నట్లు సిట్ విచారణలో గుర్తించిన కేరళకు చెందిన వైద్యుడు పరారయ్యాడు. రామచంద్రభారతికి సన్నిహితుడిగా గుర్తించిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా కేరళలోని తన నివాసానికి వెళ్లేలోగా వైద్యుడు తప్పించుకున్నాడు. ఈ వ్యవహారంలో ఇప్పటికే కర్ణాటక, హరియాణా, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌లో సోదాలు ముగియగా.. కేరళలో తప్పించుకున్న వైద్యుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని