Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ప్రధానికి 9 మంది విపక్ష నేతల లేఖ
ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోదియా అరెస్టును ఖండిస్తూ తొమ్మిది మంది విపక్ష పార్టీల నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తోందని లేఖలో ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలకు దిగడం నిరంకుశత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. లేఖ రాసిన వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా దిల్లీ సీఎం కేజ్రీవాల్, భగవంత్ మాన్, మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్ ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. యుద్ధానికి సిద్ధంగా ఉండండి.. రక్షణ బడ్జెట్ పెంచనున్న చైనా
చైనా(China) రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సారి పెంపు 7.2 శాతంగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. దీంతో ఇది 230 బిలియన్ డాలర్లకు చేరుతుంది. ఈ మేరకు చైనా ఆర్థిక శాఖ ముసాయిదాను విడుదల చేసింది. చైనా (China) రక్షణ బడ్జెట్ పెంపు వరుసగా ఇది 8వసారి. చైనా ఆర్థిక వృద్ధి రేటు కంటే రక్షణ బడ్జెట్ పెంపు రేటు అధికంగా ఉండటం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఆసీస్‌కు కామెరూన్ గ్రీన్.. భారత్‌కు ఆ ఆల్‌రౌండర్ చాలా అవసరం: ఛాపెల్
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ (Team India) ఓటమి చవిచూసింది. స్పిన్ పిచ్‌పై ఆసీస్ బౌలర్ల ధాటికి కుదేలైంది. దీంతో సిరీస్ విజయంపై కన్నేసిన భారత్‌కు నాలుగో టెస్టు (IND vs AUS) కీలకం కానుంది. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే కూడా తప్పక గెలవాల్సిన పరిస్థితి. అయితే, భారత జట్టు ఎంపికలోనే సమస్య ఉందని ఆసీస్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ ఛాపెల్ అభిప్రాయపడ్డాడు. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) తప్పకుండా టెస్టు సిరీస్ ఆడాలని సూచించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. విమానంలో మరోసారి మూత్రవిసర్జన ఘటన
ఎయిరిండియా (Air India) మూత్రవిసర్జన వివాదం ఇంకా మరువక ముందే అదే తరహా ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి దిల్లీకి వస్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines)లో ఓ ప్రయాణికుడు పక్కనే కూర్చుకున్న మరో వ్యక్తిపై మూత్ర విసర్జన చేశాడు. AA292 నంబర్‌తో ఉన్న విమానంలో ఈ ఘటన జరిగింది. ఆ విమానం శుక్రవారం న్యూయార్క్ నుంచి రాత్రి 9:16 గంటలకు బయలుదేరింది. దాదాపు 14 గంటల ప్రయాణం తర్వాత దిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. సెల్‌ఫోన్ కనిపెట్టాడు.. టిక్‌టాక్ గురించి తెలియదన్నాడు!
అలెగ్జాండర్ గ్రహంబెల్ టెలిఫోన్(telephone) కనిపెట్టాడని చాలా మందికి తెలుసుంటుంది. ఇప్పుడు టెలిఫోన్ వాడకం బాగా తగ్గింది. పుట్టిన పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరి చేతుల్లోనూ సెల్‌ఫోనే(cell phone) ఉంది. మరి ఆ సెల్‌ఫోన్ ఎవరు కనిపెట్టారో ఎప్పుడైనా ఆలోచించారా? ఆయనే మార్టిన్ కూపర్. ‘ఫాదర్ ఆఫ్ ద సెల్‌ఫోన్’గా ఖ్యాతి గడించారు. మార్టిన్ కూపర్ 1928లో చికాగో(chicago)లో జన్మించారు. ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. తీవ్ర గుండెపోటు.. 95 శాతం నా రక్తనాళం మూసుకుపోయింది: సుస్మితా సేన్
తాను ఇటీవల తీవ్రమైన గుండెపోటు(Heart Attack)కు గురయ్యానని బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరి సుస్మితాసేన్ (Sushmita Sen) తెలిపారు. ప్రధాన రక్తనాళం చాలా వరకూ మూసుకుపోయిందని సకాలంలో వైద్యులు చికిత్స చేయడంతో తాను ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు. ఈ మేరకు తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. తనపై ప్రేమను చూపించిన అభిమానులకు, చికిత్స అందించిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. వీటికి మార్చి నెలాఖరే గడువు.. మరి పూర్తి చేశారా?
ఆర్థిక విషయాల్లో మనలో చాలా మంది ‘ఇంకా గడువు ఉందిగా.. అప్పుడు చూద్దాం’ అనేవారే ఎక్కువ. తీరా గడువు ముగిశాక ‘అయ్యో!’ అంటూ నిట్టూరుస్తుంటారు. కొంతమందికి గడువు తేదీపై అవగాహన ఉండదు. కారణమేదైతేనేం డబ్బుకు సంబంధించి వ్యవహారాల్లో అలసత్వం ఏమాత్రం పనికిరాదు. ఇప్పుడు మనం మార్చిలోకి అడుగుపెట్టాం. అంటే ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఉన్నాం. మరికొన్ని రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కాబట్టి నెలాఖరులోగా కొన్ని పనులు పూర్తి చేయాల్సి (March Dealine) ఉంటుంది. అవేంటో చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. సానియా ఫేర్‌వెల్ మ్యాచ్.. ఎల్బీ స్టేడియంలో సందడి
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా(Sania Mirza) ఫేర్‌వెల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇప్పటికే టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా.. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా తన చివరి మ్యాచ్ ఆడుతోంది. డబుల్స్ మ్యాచ్ సానియా, బోపన్న- ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీ మధ్య జరుగుతోంది. సింగిల్స్‌లో రోహన్ బోపన్నతో సానియా తలపడనుంది. సానియా చివరి మ్యాచ్‌ను వీక్షించేందుకు పలువురు టాలీవుడ్, బాలీవుడ్, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. సమంతతో మాట్లాడుతుంటా: రానా
వీలు కుదిరినప్పుడల్లా నటి సమంత(Samantha)తో తాను మాట్లాడుతుంటానని నటుడు దగ్గుబాటి రానా (Rana) అన్నారు. సామ్ మయోసైటిస్ బారిన పడిన విషయం తెలిసిన తర్వాత.. ఆమెకు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నట్లు చెప్పారు. తన సరికొత్త వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఇటీవల కాలంలో పలువురు నటీనటులు తమ అనారోగ్య సమస్యల గురించి వెల్లడించడంపై స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. దోశ ఇలా కూడా వేయొచ్చా?.. వీడియో వైరల్!
దోశ అంటే ఇప్పటి వరకూ మనం గుండ్రటి ఆకారంలోనే చూసుంటాం. కానీ, తోపుడు బండిపై ఓ వీధి వ్యాపారి వేసే దోశలు చూస్తే ఆ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. విభిన్న ఆకృతులతో ఆయన వేస్తున్న దోశలు చూసి సామాన్య ప్రజలతో పాటు బడా వ్యాపారవేత్తలు సైతం ఫిదా అవుతున్నారు. ఆ వ్యాపారి టెడ్డీ బేర్ ఆకృతిలో దోశ వేస్తున్న వీడియోను నాంది ఫౌండేషన్ సీఈవో మనోజ్ కుమార్ ట్విటర్‌లో షేర్ చేశారు. పనికి కళాత్మకతను జోడిస్తున్న అతడి నైపుణ్యాన్ని ప్రశంసించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Delhi: కొవిడ్ కేసుల పెరుగుదలపై ఆందోళన వద్దు: సీఎం కేజ్రీవాల్
-
World News
North Korea: కిమ్ రాజ్యంలో దారుణాలు.. గర్భిణులు, స్వలింగ సంపర్కులకు ఉరిశిక్షలు
-
General News
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో.. రద్దీ వేళల్లో రాయితీ రద్దు
-
Sports News
CSK: అత్యుత్తమ ఆల్‌రౌండర్.. ఈ స్టార్‌కు మరెవరూ సాటిరారు: హర్భజన్ సింగ్
-
Movies News
Sai Pallavi: అలా కనిపిస్తాను కాబట్టే నన్ను ఎక్కువ మంది ఇష్టపడతారు: సాయి పల్లవి
-
World News
Donald Trump: పోర్న్ స్టార్ కేసులో అభియోగాలు.. ట్రంప్ భవితవ్యమేంటి?