Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 27 Jul 2023 13:00 IST

1. విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవు

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం కూడా సెలవును ప్రకటించింది. ఇందుకు సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జలదిగ్బంధంలో మోరంచపల్లి.. చెట్లపైకి ఎక్కి తలదాచుకుని

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం జల దిగ్బంధంలో ఉండిపోయింది. మోరంచ వాగు ఉప్పొంగడంతో సమీపంలోని ఇళ్లలోకి 4 నుంచి 5 అడుగుల మేర నీరు చేరింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇంటి స్లాబ్‌ల పైకి ఎక్కారు. కొంతమంది నిత్యావసర వస్తువులు కూడా తీసుకెళ్లి స్లాబ్‌లపై కూర్చున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మోరంచపల్లికి రెండు సైనిక హెలికాప్టర్లు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పూర్తిగా నీట మునిగిన మోరంచపల్లి గ్రామంలో.. సహాయక చర్యల కోసం హెలికాప్టర్‌ను తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.   ఈ మేరకు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ అధికారులతో సీఎస్ శాంతికుమారి చర్చించారు. అనంతరం ముంపునకు గురైన మోరంచపల్లి గ్రామానికి రెండు సైనిక హెలికాప్టర్లను పంపుతున్నట్లు సీఎస్‌ తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హైదరాబాద్‌కు మళ్లీ అతి భారీ వర్ష సూచన

తెలంగాణలోని పలు చోట్ల ఇవాళ కూడా అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్‌లో నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని.. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అలర్ట్‌.. మూసీ నదికి పెరిగిన వరద ప్రవాహం

నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఫలితంగా గండిపేట 2 గేట్లు, హిమాయత్ సాగర్ 6  గేట్లు తెరవడంతో.. మూసీ నదిలోకి వరద ప్రవాహం పెరిగింది. మూసీకి భారీగా వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉంటున్న స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. శంషాబాద్‌లో ‘ఖతార్‌’ విమానం అత్యవసర ల్యాండింగ్‌

దుబాయ్‌ నుంచి నాగ్‌పుర్‌ వెళ్లాల్సిన ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం.. శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ అయింది. నాగ్‌పుర్‌లో వాతావరణం అనుకూలించక విమానం ఇక్కడ ల్యాండింగ్‌ అయినట్లు తెలుస్తోంది. విమానంలోని 160 మంది ప్రయాణికులను అధికారులు నోవాటెల్‌కు తరలించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. గుండెపోటుతో పటాన్‌చెరు ఎమ్మెల్యే కుమారుడి మృతి

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో మృతిచెందారు. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన మృతి చెందారు. కిడ్నీలు పాడవటంతో విష్ణువర్ధన్‌రెడ్డి ఆస్పత్రిలో చేరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పార్లమెంట్‌లో మణిపుర్ కల్లోలం.. ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్‌(Parliament) వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మణిపుర్ అంశం(Manipur)పై ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. ప్రధాని సమక్షంలోనే మణిపుర్‌ అంశంపై చర్చ జరగాలని విపక్షాలు(Opposition) పట్టుపట్టడంతో గురువారం ఉదయం లోక్‌సభ వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి ప్రారంభం కానుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పుతిన్‌ కలల వంతెనపై దాడి చేసింది మేమే: ఉక్రెయిన్‌

రష్యా-క్రిమియా(Russia-Crimea)ను కలిపే కెర్చ్‌ వంతెన(Kerch Bridge)పై గత ఏడాది భారీ పేలుడు జరిగింది. దాంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కలల వంతెన కొంత భాగం కూలింది. అప్పట్లో దాడి చేసింది తామేనని మొదటిసారి ఉక్రెయిన్(Ukraine) అంగీకరించింది. ఈ మేరకు ఆ దేశ నిఘా సంస్థ బాధ్యత తీసుకుంది. ఉక్రెయిన్‌ నిఘా సంస్థ(ఎస్‌బీయూ) చీఫ్ వాసిల్‌ మాల్యుక్‌ ఈ దాడి గురించి స్పందించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సైన్యం తిరుగుబాటు.. బందీగా అధ్యక్షుడు..!

పశ్చిమ ఆఫ్రికా (West Africa) దేశమైన నైగర్‌ (Niger)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు మహ్మద్‌ బజౌమ్‌ (Mohamed Bazoum)కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటు (Military Coup) చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే అధ్యక్షుడి నివాసాన్ని ప్రెసిడెన్షియల్‌ గార్డు సభ్యులు బుధవారం చుట్టుముట్టారు. బజౌమ్‌, ఆయన కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వాన్ని పడగొట్టినట్లు సైన్యం ప్రకటించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు