Parliament: పార్లమెంట్‌లో మణిపుర్ కల్లోలం.. ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్(Parliament) కార్యకలాపాలపై మణిపుర్ అంశం ప్రభావం చూపుతోంది. దానిపై ప్రధాని సమక్షంలో చర్చ జరగాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. 

Updated : 27 Jul 2023 12:37 IST

దిల్లీ: పార్లమెంట్‌(Parliament) వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మణిపుర్ అంశం(Manipur)పై ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. ప్రధాని సమక్షంలోనే మణిపుర్‌ అంశంపై చర్చ జరగాలని విపక్షాలు(Opposition) పట్టుపట్టడంతో గురువారం ఉదయం లోక్‌సభ వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి ప్రారంభం కానుంది. మరోవైపు రాజ్యసభ(Rajya Sabha) కూడా మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. 

నా ప్రసంగం రద్దు చేశారుగా.. మీకిదే స్వాగతం: మోదీకి గహ్లోత్‌ కౌంటర్‌

మణిపుర్ హింసకు నిరసనగా ప్రతిపక్షాల కూటమికి చెందిన ఎంపీలు నల్లదుస్తులు ధరించి పార్లమెంట్‌కు వచ్చారు. మణిపుర్‌లో చోటుచేసుకుంటున్న అకృత్యాలను నిరసించేందుకు, ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా ఉన్నామని తెలిపేందుకే నల్ల దుస్తులు ధరించామని ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దా వెల్లడించారు. అలాగే మణిపుర్‌ ముఖ్యమంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే నేడు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష సభ్యులు చర్చించారు. 

విపక్ష ఎంపీలు నల్లదుస్తులు ధరించిరావడాన్ని భాజపా నేత పీయూష్ గోయల్ విమర్శించారు. ‘తీవ్రమైన విషయాలపై కూడా రాజకీయాలు చేయడం దురదృష్టకరం. అంతర్జాతీయంగా భారత్‌కు పెరుగుతోన్న ప్రతిష్ఠను ఈ నల్లదుస్తులు ధరించిన వ్యక్తులు అర్థం చేసుకోలేకపోతున్నారనుకుంటా. వారి గతం, వర్తమానం, భవిష్యత్తు అంధకారంలో ఉంది. కానీ, మేం వారి జీవితాల్లో వెలుగులు నిండాలని మేం ఆశిస్తున్నాం’ అని గోయల్‌ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. భారత విదేశాంగ విధానాల్లో ఇటీవలి పరిణామాలను విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ వెల్లడిస్తోన్న సమయంలో ఎన్డీఏ ఎంపీలు.. ‘మోదీ, మోదీ’ అని నినాదాలు చేయగా.. అందుకు ప్రతిగా విపక్ష ఎంపీలు ‘ఇండియా, ఇండియా’ అని నినాదాలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని