Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Aug 2023 13:13 IST

1. గుండెకు మూడు సర్జరీలు.. అయినా గిన్నిస్‌ రికార్డు..!

హృదయానికి మూడు సార్లు బైపాస్‌ సర్జరీలు చేయించుకొని అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డు (Guinness World Record)లో స్థానం సంపాధించారు బ్రిటన్‌కు చెందిన 77 ఏళ్ల కోలిన్‌ హాంకాక్‌ (Colin Hancock). ఈ క్రమంలో పాత రికార్డును ఆయన బద్దలు కొట్టారు. వంశపారపర్యంగా సంక్రమించే హైపర్‌ కొలెస్టెరోలేమియా అనే సమస్యతో కోలిన్‌ బాధపడుతున్నారు. ఇది శరీరంలో కొవ్వులు పెరగడంతో పాటు కరోనరీ హార్ట్‌ డిసీజ్‌కు కారణమవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రైల్లో లోయర్‌ బెర్త్‌ కావాలా? ఈసారి ఇలా చేయండి..

 రైళ్లలో (Indian Railways) లోయర్‌ బెర్త్‌ (Lowr berth) దొరికితే ఆ సౌకర్యమే వేరు. కూర్చున్నంత సేపూ కిటికీ నుంచి అందాలను వీక్షించొచ్చు. పడుకునేటప్పుడు పైకెక్కాల్సిన బాధలేదు. అందుకే పెద్దవాళ్లతో ప్రయాణించేవారు లోయర్ బెర్త్‌ కోసం ప్రయత్నిస్తుంటారు. వారికి టికెట్‌ బుక్‌ చేసినప్పుడు లోయర్‌ బెర్త్‌ను (Berth preference) ప్రిఫరెన్స్‌గా పెడతారు. అయినా ఏ కొద్ది మందికో మినహా లోయర్‌ బెర్తులు ఒక్కోసారి దొరక్కపోవచ్చు. ప్రయాణానికి చాలా రోజుల ముందు టికెట్‌ బుక్‌ చేసినా ఈ పరిస్థితి తలెత్తొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి?పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?: చిరంజీవి

బాబీ దర్శకత్వంలో చిరంజీవి (chiranjeevi) నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). ఈ సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందమంతా వేడుక చేసుకుంది. ఇందులో చిరంజీవి మాట్లాడుతూ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతకొన్నేళ్లుగా సినీ పరిశ్రమను చుట్టుముడుతున్న కొన్ని రాజకీయాంశాలపై చిరంజీవి మాట్లాడారు. ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మణిపుర్‌కు మోదీ ఎందుకెళ్లట్లేదు..? అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రశ్నలు

పార్లమెంట్‌లో మాట్లాడకుండా ఉండేందుకు ప్రధాని మోదీ మౌనవత్రం పట్టారని, ఆయన్ను మాట్లాడించేందుకే తాము అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చామని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Confidence Debate)పై మంగళవారం చర్చ ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఆయన ఈ మాట అన్నారు. అలాగే మూడు ప్రశ్నలను సంధించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమెరికాలో ‘నేషనల్‌ డే ఆఫ్‌ సెలబ్రేషన్‌’గా ఆగస్టు 15.. చట్టసభలో తీర్మానం

భారత (India) స్వాతంత్ర్య దినోత్సవాన్ని అమెరికా(USA)లో కూడా ప్రత్యేకంగా నిర్వహించుకొనేలా ఓ తీర్మానాన్ని కాంగ్రెస్‌ సభ్యుడు శ్రీ తానేదార్‌ ప్రవేశపెట్టారు. ఆగస్టు 15ను అమెరికాలో ‘నేషనల్‌ డే ఆఫ్‌ సెలబ్రేషన్‌’గా ప్రకటించాలని దీనిలో కోరారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్‌ సభ్యులు బడ్డీ కార్టర్‌, బ్రాడ్‌ షర్మాన్‌ సహ ప్రాయోజకులుగా వ్యవహరించారు. ఆ రోజును ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల్లో సంబరాల దినోత్సవంగా మార్చాలని వారు కోరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘అన్యాయమైన ఛార్జీలు’.. జొమాటోపై కస్టమర్‌ అసంతృప్తి.. స్పందించిన సంస్థ

జొమాటో నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన మహిళ బిల్లు చూసి షాకైంది. డెలివరీ బిల్లులో అనవసరంగా కంటైనర్‌ ఛార్జీలు విధించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా జొమాటోకు(Zomato) ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన ఓ స్క్రీన్‌ షాట్‌ను కూడా ఆమె ట్యాగ్‌ చేసింది. అహ్మదాబాద్‌కు చెందిన ఖుష్బూ ఠక్కర్ అనే మహిళ మూడు ప్లేట్ల దూదీ తేప్లా (రోటీ వంటిది) ఆహారాన్ని జొమాటోలో ఆర్డర్ చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కోరుట్లలో దారుణం.. బైక్‌పై వచ్చి కౌన్సిలర్‌ భర్తను నరికేశారు!

జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. స్థానిక మున్సిపల్‌ కౌన్సిలర్‌ భర్త పోగుల లక్ష్మీరాజం(48)పై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా సమీపంలోని ఓ హోటల్లో లక్ష్మీరాజం టీ తాగుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘చివరి బంతికి సిక్స్‌ కొట్టండి’.. అవిశ్వాసం వేళ ఎంపీలకు మోదీ సూచన

కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (no confidence motion)పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) స్పందించారు. అది ప్రభుత్వంపై తీసుకొచ్చిన అవిశ్వాసం కాదని.. వాళ్లలో వారికే నమ్మకం లేక దీన్ని ప్రవేశపెడుతున్నారని విపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. అంతేగాక, 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై ‘సిక్స్‌’ కొట్టాలని స్వపక్ష ఎంపీలకు సూచించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి కామెంట్‌ చేయను: సునీత

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన పని తాను చేసుకుంటూ వెళ్తోందని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత అన్నారు. వివేకా జయంతి సందర్భంగా కడప జిల్లా పులివెందులలో ఆయన సమాధి వద్ద సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, కుటుంబసభ్యులు నివాళులర్పించారు. అనంతరం సునీత మీడియాతో మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దిల్లీ బిల్లు ఆమోదం వేళ.. మంత్రుల శాఖలు మార్చిన కేజ్రీవాల్‌..!

దిల్లీ(Delhi)లోని ఆప్‌(AAP) ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గంలో అనూహ్య మార్పు చేసింది. మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌(Saurabh Bhardwaj)ను సేవలు, విజిలెన్స్‌ విభాగం బాధ్యతల నుంచి తప్పించి.. ఆ రెండు శాఖలను ఆతిశీ(Atishi)కి అప్పగించింది. పార్లమెంట్‌లో దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు ఆమోదం లభించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని