Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Aug 2023 13:49 IST

1. మెదక్‌, మల్కాజ్‌గిరి టికెట్లు ఇవ్వకుంటే స్వతంత్రులుగా పోటీ చేస్తాం: మైనంపల్లి

తెలంగాణ మంత్రి హరీశ్‌రావుపై మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Mynampally Hanumanth Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్‌లో హరీశ్‌రావు పెత్తనం చేస్తున్నారని.. అంతుచూసే వరకు వదలబోనని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో హరీశ్‌రావును అడ్రెస్‌ లేకుండా చేస్తానని మండిపడ్డారు. తన కుమారుడికి మెదక్‌ టికెట్‌ ఇస్తేనే తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.  పాస్‌పోర్టును నమిలేసిన శునకం.. చిక్కుల్లో పడ్డ వరుడు!

ఒక శునకం (Dog) చేసిన పనికి ఏకంగా పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకునేందుకు వేరే దేశానికి వెళ్లాలనుకున్న వరుడి పాస్‌పోర్టు (Passport)ను పెంపుడు శునకం నమిలేసింది. దీంతో ఆ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. ఈ ఘటన అమెరికా (America)లో చోటు చేసుకొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రపంచకప్‌ గెలిచిన వేళ.. తండ్రి మరణవార్త: ఛాంపియన్‌ ఓల్గా వ్యథ

ఆమె ఏకవ్యక్తి సైన్యంలా పోరాడి దేశానికి మరపురాని విజయాన్నందించింది. కానీ, ఆ సంతోషాన్ని పంచుకునేలోపే తీరని విషాద వార్త వినాల్సి వచ్చింది. ఇది స్పెయిన్‌కు తన ఏకైక గోల్‌తో ఫుట్‌బాల్‌ కప్‌ను అందించిన కెప్టెన్‌ ఓల్గా కర్మోన (Olga Carmona) పరిస్థితి. మ్యాచ్‌ అనంతరం తన కన్న తండ్రి మరణించాడనే విషాదకర వార్త ఆమెను చేరింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భూమికి కన్పించని జాబిల్లి అవతలి వైపు.. ఫొటోలు పంపిన ల్యాండర్‌

చందమామ (Moon)పై కాలుపెట్టే చారిత్రక ఘట్టం కోసం చంద్రయాన్‌-3 (Chandrayaan-3) శరవేగంగా అడుగులు వేస్తోంది. జాబిల్లి దక్షిణ ధ్రువం (Lunar South Pole)పై సాఫ్ట్ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram Lander) అన్వేషణ సాగిస్తోంది. ఈ క్రమంలోనే భూమికి ఎప్పుడూ కన్పించని జాబిల్లి అవతలివైపు (దక్షిణ ధ్రువం ఉండే ప్రాంతం) చిత్రాలను ల్యాండర్‌ తన కెమెరాలో బంధించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘రాజీవ్‌ రాజకీయ జీవితం.. దారుణంగా ముగిసింది’: సోనియా

మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌ గాంధీ(Rajiv Gandhi) రాజకీయ జీవితం అత్యంత దారుణ రీతిలో ముగిసిందని ఆయన సతీమణి, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi) అన్నారు. కానీ ఆయన పాలించిన కొద్దికాలంలోనే ఎన్నో కీలక విజయాలను సాధించారని తెలిపారు. 25వ రాజీవ్‌ గాంధీ నేషనల్‌ సద్భావన అవార్డు కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. టెస్లా లీక్‌.. ఎలాన్‌మస్క్‌ సెక్యూరిటీ నంబర్‌ కూడా బహిర్గతం..!

కొన్ని నెలల క్రితం టెస్లా ఉద్యోగుల కారణంగా దాదాపు 75,000 మంది ఉద్యోగులు, ఇతరుల డేటా చోరికి గురైందని మైనే అటార్నీ జనరల్‌ కార్యాలయం ఇటీవల వెల్లడించింది. వీరిలో తొమ్మిది మంది మైనే వాసులు, ఆటోమొబైల్‌ కంపెనీ ఆస్టిన్‌కు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ఉన్నారని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఛైర్మన్‌ అయిన 15 రోజులకే గ్యాంగ్‌స్టర్‌తో గొడవ.. తొలి సవాల్‌ గురించి చెప్పిన రతన్‌ టాటా

పారిశ్రామిక, ఉపాధి కల్పనా రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా (Ratan Tata)కు కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ రత్న (Udyoga Ratna) అవార్డును ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా రతన్‌ టాటాకు చెందిన పాత వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 2013లో కొలంబియా బిజినెస్‌ స్కూల్‌లో ఓ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న ఆయన, టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలో తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఒడవని టికెట్ల ముచ్చట.. ఇంకా భారాస నేతల ప్రయత్నాలు

టికెట్ల కోసం ఆశావహులు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో పలువురు నేతలు కలిశారు. కవితను కలిసిన వారిలో నేతలు రేఖా నాయక్‌, ఎన్‌.సంజయ్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎల్‌.రమణ, సునీతా లక్ష్మారెడ్డి, బొంతు రామ్మోహన్‌, చంద్రావతి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. మంత్రి హరీశ్‌రావును కూడా పలువురు నేతలు కలిసినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జగన్‌ శాడిజాన్ని ప్రజలంతా చూస్తున్నారు: లోకేశ్‌

పాలకుల అవినీతిని, అసమర్థతను ప్రజల దృష్టికి తెచ్చే మీడియా సంస్థల మీద పగబట్టడం ప్రజాస్వామ్యానికే ముప్పని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈనాడు మీద పగబట్టి, ఆ పగను మార్గదర్శి సంస్థలపై తీర్చుకుంటున్న జగన్ రెడ్డి శాడిజాన్ని ప్రజలంతా చూస్తున్నారని హెచ్చరించారు. ఈ మేరకు మీడియా సంస్థలపై జగన్‌ కక్ష సాధింపును ఖండిస్తూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అధికారంలోకి వస్తే.. భారత్‌పై ప్రతీకార పన్ను: ట్రంప్‌ నోట మళ్లీ అదే మాట

అమెరికా (USA) పాలనా పగ్గాల కోసం పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump).. మరోసారి భారత్‌ (India) ‘సుంకాల’ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్‌ అత్యధిక పన్నులు విధిస్తోందని ఆరోపించిన ఆయన.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే దిల్లీపై ప్రతీకార పన్నులు (Reciprocal Tax) విధిస్తానని బెదిరింపులకు దిగారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని