Elon Musk: టెస్లా లీక్‌.. ఎలాన్‌మస్క్‌ సెక్యూరిటీ నంబర్‌ కూడా బహిర్గతం..!

ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని టెస్లాలో మేలో జరిగిన డేటా లీకేజీలో కీలక అంశాలు బహిర్గతమయ్యాయి. కంపెనీ వాహనాల సమస్యలు, మస్క్‌ సెక్యూరిటీ నంబర్‌ కూడా బహిర్గతమైన వాటిల్లో ఉన్నాయి.

Updated : 21 Aug 2023 12:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొన్ని నెలల క్రితం టెస్లా ఉద్యోగుల కారణంగా దాదాపు 75,000 మంది ఉద్యోగులు, ఇతరుల డేటా చోరికి గురైందని మైనే అటార్నీ జనరల్‌ కార్యాలయం ఇటీవల వెల్లడించింది. వీరిలో తొమ్మిది మంది మైనే వాసులు, ఆటోమొబైల్‌ కంపెనీ ఆస్టిన్‌కు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ఉన్నారని వెల్లడించింది. ‘‘తాము టెస్లా అత్యంత రహస్య సమాచారం సంపాదించామని విదేశీ మీడియా సంస్థ (హాండెల్స్‌బ్లాట్‌) మే 10వ తేదీన ప్రకటించింది’’ అని టెస్లా 18వ తేదీన విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది. ఇద్దరు మాజీ ఉద్యోగులు టెస్లా డేటా ప్రొటెక్షన్‌ నిబంధనలు ఉల్లంఘించి డేటాను దుర్వినియోగం చేశారని వెల్లడించింది. వీటిని సదరు మాజీ ఉద్యోగులు ఓ మీడియా సంస్థతో పంచుకొన్నారని తెలిపింది.

ఈ డేటా చౌర్యంపై టెస్లా న్యాయపోరాటం చేస్తోంది. ఈ కేసు ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తుందో కచ్చితంగా తెలియలేదు. దీంతోపాటు కంపెనీ డేటా ఉన్న పరికరాలను సీజ్‌ చేయనుంది. దీనిపై టెస్లా డేటా ప్రైవసీ అధికారి స్టీవెన్‌ ఎలెన్‌టుక్‌ మాట్లాడుతూ ‘‘టెస్లా డేటాను మాజీ ఉద్యోగులు ఏ విధంగాను వాడుకోకుండా ఇప్పటికే కంపెనీ కోర్టు ఆదేశాలను పొందింది. భవిష్యత్తులో చర్యలు తీసుకొనేలా కంపెనీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఫోరెన్సిక్‌ నిపుణులతో కలిసి పనిచేస్తోంది’’ అని పేర్కొన్నారు.

జీడీపీలో హోటల్‌ పరిశ్రమ వాటా.. రూ.83 లక్షల కోట్లు!

టెస్లా నుంచి లీకైన డేటాలో 2,400 కస్టమర్‌ కంప్లైట్లు, బ్రేకింగ్‌ సమస్యల ఫిర్యాదులు, ఫాంటమ్‌ బ్రేకింగ్‌కు సంబంధించిన సమస్యలున్నాయి. ఎలాన్‌ మస్క్‌ సెక్యూరిటీ నంబర్‌ కూడా లీకైన డేటాలో ఉంది. దాదాపు 100 జీబీ డేటా లీకైనట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని