Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Dec 2023 13:10 IST

1. చైనాకు రాకపోకలు నిషేధించండి: బైడెన్‌ను కోరిన సెనెటర్లు

చైనా (China)లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల (Respiratory illness) వ్యాప్తి నానాటికీ పెరుగుతుండటం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇదే సమయంలో బ్యాక్టీరియల్‌ నిమోనియాకు సంబంధించిన ఒక కొత్త రకం ఇన్ఫెక్షన్‌.. అమెరికా (USA) సహా పలు దేశాలను వణికిస్తోంది. దీంతో ఈ మిస్టరీ వ్యాధి పట్ల రిపబ్లికన్‌ సెనెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఫారం-7 గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదు: పయ్యావుల

ఓట్లు తొలగించేందుకు ఫారం-7 ద్వారా గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదని ఈసీ ఇచ్చిన ఆదేశాలు.. తాము చేస్తున్న పోరాటంపై స్పష్టత ఇచ్చినట్లు అయ్యిందని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పయ్యావుల మాట్లాడారు. ఓట్లు తొలగించాలని అధికారులపై వైకాపా నాయకులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సాగర్‌ ఘటన.. ముగిసిన జలశక్తి శాఖ కీలక సమావేశం

నాగార్జునసాగర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం ముగిసింది. ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌.. స్పీడ్‌ చలాన్‌లకు ఇక చెక్‌

రహదారులపై పరిమితికి మించి వేగంతో వాహనం నడపడం చాలా ప్రమాదం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే స్పీడ్‌గన్లను ఏర్పాటు చేస్తుంటారు. నిర్దేశిత వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే చలాన్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వేగం గురించి అవగాహన లేని చోట్ల వాహనాలను వేగంగా పోనిస్తే జరిమానా తప్పదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తప్పుడు కేసులకు భయపడేది లేదు: తెదేపా నేత బీటెక్‌ రవి

తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని, తప్పుడు కేసులకు భయపడేది లేదని తెదేపా (TDP) నేత బీటెక్‌ రవి (Btech Ravi) స్పష్టం చేశారు. వైకాపా దౌర్జన్యాలను ప్రజలంతా గమనిస్తున్నారని, సరైన సమయంలో వైకాపాకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఎవరికైనా సమస్య వస్తే పోలీసులకు చెప్పడం సహజం కానీ, పోలీసులే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే పరిస్థితి ఉంటే ఏం చేయాలని బీటెక్‌ రవి ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. మా అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు KCR యత్నం: డీకే

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ సునాయాసంగా అధికారంలోకి వస్తోందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(DK Shivakumar) ధీమా వ్యక్తం చేశారు.  తెలంగాణ ఎన్నికల(Telangana Assembly Elections 2023) ఫలితాలపై ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్(Congress) అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మోదీ, మెలోనీ ‘మెలోడీ’ సెల్ఫీ చూశారా..?

వివిధ సదస్సుల్లో భాగంగా అంతర్జాతీయ వేదికలపై ప్రపంచనేతలు సమావేశం అవుతుంటారు. ఆ సందర్భంగా రాజకీయ, భౌగోళిక, ఆర్థిక అంశాలు చర్చకు వస్తుంటాయి. అదే సమయంలో వారు దిగే చిత్రాలు, వారిమధ్య చోటుచేసుకునే సరదా సంభాషణలు వైరల్‌ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ(Modi), ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ(Giorgia Meloni) దిగిన సెల్ఫీ తాజాగా నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘ఆదిత్య-ఎల్‌ 1’లో రికార్డయిన సౌరగాలులు.. ఫొటో షేర్‌ చేసిన ఇస్రో

సూర్యుడి (Sun)ని అధ్యయనం చేసేందుకు రోదసిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1)’ తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పరిమెంట్‌ పేలోడ్‌ తన ఆపరేషన్స్‌ను ప్రారంభించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) తాజాగా వెల్లడించింది. ఈ పేలోడ్‌లోని రెండు పరికరాలు పరిశోధనలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని, ఇవి సౌర గాలుల (Solar Winds)ను అధ్యయనం చేస్తున్నాయని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఓట్ల లెక్కింపుపై పోలీసులకు డీజీపీ కీలక సూచనలు

ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) సూచించారు. సీపీలు, ఎస్పీలతో డీజీపీ ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లెక్కింపు కేంద్రాల వద్ద బందోబస్తుపై సమీక్షించారు. లెక్కింపు కేంద్రాల వెలుపల పటిష్ఠ నిఘా పెట్టాలని, కేంద్రాల లోపల సైతం దృష్టి సారించాలని అంజనీ కుమార్ సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దుర్గమ్మ సేవలో చంద్రబాబు దంపతులు

తెలుగు ప్రజానీకానికి సేవ చేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు  (Chandrababu) తెలిపారు. తెలుగు ప్రజలు సిరి సంపదలతో, ఆనందంగా జీవించేందుకు వారికి సేవ చేసే అవకాశం అమ్మవారు ప్రసాదిస్తారని నమ్ముతున్నానన్నారు. విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మను సతీసమేతంగా చంద్రబాబు ఇవాళ దర్శించుకున్నారు. తొలుత వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని