Payyavula Keshav: ఫారం-7 గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదు: పయ్యావుల

ఓట్లు తొలగించేందుకు ఫారం-7 ద్వారా గంపగుత్త అప్లికేషన్లకు వీల్లేదని ఈసీ ఇచ్చిన ఆదేశాలు తాము చేస్తున్న పోరాటానికి స్పష్టత ఇచ్చినట్లు అయ్యిందని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు.

Updated : 02 Dec 2023 13:05 IST

అనంతపురం: ఓట్లు తొలగించేందుకు ఫారం-7 ద్వారా గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదని ఈసీ ఇచ్చిన ఆదేశాలు.. తాము చేస్తున్న పోరాటంపై స్పష్టత ఇచ్చినట్లు అయ్యిందని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పయ్యావుల మాట్లాడారు. ఓట్లు తొలగించాలని అధికారులపై వైకాపా నాయకులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. ఓటు ఎక్కడ ఉండాలనేది ఓటరు హక్కు, రెండు ఓట్లు ఉంటే తప్పు అని ఆయన స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే ఉరవకొండలో వైకాపా నేత విశ్వేశ్వర్‌ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఎవడ్రా నువ్వు.. తమాషాలు చేస్తున్నావా’.. ఎంపీడీవోపై ముత్తంశెట్టి చిందులు

‘‘విశ్వేశ్వర్‌ రెడ్డి నీతి సూత్రాలు చెబుతుంటే ఆశ్చర్యమేస్తోంది. ఆయన జీవితమంతా బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలే. టికెట్‌ ఇవ్వకపోతే పార్టీ మారతానని బ్లాక్‌మెయిల్‌ చేసేవారు. నేడు స్పష్టంగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ఫారం-7 గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదు. తప్పులు కళ్ల ముందే జరుగుతుంటే పరిశీలకులు ఏం చేస్తున్నారు? మా ఫిర్యాదులపై ఏం స్పందించారో వారే చెప్పాలి. నిష్పక్షపాతంగా పనిచేస్తే మేం ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు కదా? విశ్వేశ్వర్‌ రెడ్డి ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో చూపించమంటారా?’’ అని పయ్యావుల ప్రశ్నించారు. కాగా, పయ్యావుల ఫిర్యాదు మేరకు ఫారం-7 గంపగుత్తగా సమర్పించకూడదని ఉత్తర్వులు జారీ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం కీలక ఆదేశాలు ఇచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు