Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 09 Dec 2023 14:21 IST

1. మా ఆటగాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత నాదే : గంభీర్‌

గత ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు - లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ (RCB vs LSG) మ్యాచ్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ (Virat Kohli) - నవీనుల్‌ హక్‌, గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి గౌతమ్‌ గంభీర్‌ వార్తల్లో నిలిచాడు. లెజెండ్‌ లీగ్ క్రికెట్‌ (LLC) సందర్భంగా గంభీర్‌ - శ్రీశాంత్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు: చంద్రబాబు

రాష్ట్ర ప్రజలకు తెదేపా(TDP) అవసరం ఎంతో ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు(ChandraBabu) అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈసందర్భంగా మాట్లాడారు. ‘‘గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు ఇస్తాను. అంతర్గతంగా చేయించే సర్వేల్లో నాయకుల పనితీరు బాగాలేకపోతే ఉపేక్షించేది లేదు. ప్రత్యామ్నాయం చూపించి పక్కన పెడతా తప్ప పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెట్టను. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. తొలుత సీఎం, తర్వాత మంత్రులు

 తెలంగాణ అసెంబ్లీ (Telangana Legislative Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణం చేయిస్తున్నారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆ తర్వాత వరుసగా మంత్రులు ప్రమాణం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 40 ఏళ్లు అలాగే పనిచేశా.. ‘70 పనిగంటల’ను సమర్థించుకున్న నారాయణమూర్తి

అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటల చొప్పున పనిచేయాలంటూ ఇటీవల ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పారిశ్రామికవేత్తలు, టెక్‌ సీఈవోలు కూడా దీనిపై స్పందిస్తూ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపర్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు

తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. ఇందుకోసం శుక్రవారం దిల్లీ వెళ్లిన సీఎం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం మంత్రుల శాఖలపై శనివారం ప్రకటన చేశారు. హోం, పురపాలక, విద్య, ఎస్సీ, ఎస్టీ సంక్షేమంతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను సీఎం తన వద్దే అట్టిపెట్టుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గాజాపై ఐరాస భద్రతా మండలి తీర్మానం.. వీటో పవర్ వాడిన అమెరికా

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య భీకరపోరు(Israel-Hamas Conflict) సాగుతోంది. ఈ దాడులతో గాజాలోని సామాన్య ప్రజల బతుకు ఛిద్రమవుతోంది. ఈ క్రమంలో గాజా(Gaza)లో తక్షణమే కాల్పులు విరమణ జరగాలని ఐరాస భద్రతా మండలి(UN Security Council) డిమాండ్‌ను అమెరికా (USA) వ్యతిరేకించింది. అందుకోసం తన వీటో పవర్‌ను ఉపయోగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నన్ను అలా పిలిస్తే తిట్టినట్లు ఉంటుంది..: నయనతార

‘జవాన్‌’లో తన యాక్షన్‌తో అదరగొట్టారు నయనతార (Nayanthara). తాజాగా ‘అన్నపూరణి’ (Annapoorani) తమిళ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా కోసం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. తనని సూపర్‌ స్టార్‌ అని పిలవడంపై ఆమె సరదాగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అస్సాం అప్పుడు మయన్మార్‌లో భాగమే: కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యలు.. ఘాటుగా స్పందించిన హిమంత

‘అస్సాం (Assam)’పై సీనియర్‌ న్యాయవాది, ఎంపీ కపిల్‌ సిబల్‌ (Kapil Sibal) చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా.. ‘అస్సాం ఒకప్పుడు మయన్మార్‌ (Myanmar)లో భాగమే’ అంటూ సిబల్‌ వ్యాఖ్యానించారు. దీంతో ఇది కాస్తా రాజకీయ దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) తీవ్రంగా మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 44 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు.. ఐసిస్‌ కుట్ర కేసులో 13 మంది అరెస్టు

ఐసిస్‌ (ISIS) కుట్ర కేసుకు సంబంధించి మహారాష్ట్ర (Maharashtra), కర్ణాటక (Karnataka)లోని 44 ప్రాంతాల్లో ఏకకాలంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాడులు ప్రారంభించింది. శనివారం తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తోన్న ఈ దాడుల్లో 13 మంది నిందితులను అరెస్టు చేసింది. ఐసిస్‌ కుట్ర కేసులో భాగంగా మహారాష్ట్రలోని పుణె, ఠాణె, మీరా భయాందర్‌తో సహా పలు ప్రాంతాల్లో ఎస్‌ఐఏ ఈ సోదాలు చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకూ నిధులు ఇవ్వట్లేదు: నారా లోకేశ్‌

సీఎం జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ, పాలన గాలికొదిలేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ప్రజాధనం దోచి దాచుకునే బిజీలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రాజెక్టులు కొత్తవి కట్టకపోగా, ఉన్న వాటి నిర్వహణనీ పట్టించుకోలేదని విమర్శించారు. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేని దిక్కుమాలిన పాలనలో.. గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిపోయిందని లోకేశ్‌ ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని