Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 06 Dec 2023 17:13 IST

1. Telangana secretariat: రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటా: కోదండరామ్‌

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. సచివాలయం వద్ద బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగులతో  పాటు తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కూడా సంబురాల్లో పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటానని కోదండరామ్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రేవంత్‌ సీఎం అని ముందే ఎలా చెప్పారు?.. తనదైన శైలిలో ఆన్సర్‌ చెప్పిన బండ్ల గణేశ్‌

రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని తాను నెలరోజుల క్రితమే చెప్పానని.. అదే నిజమైందని సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) అన్నారు. రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సీఎం అవుతారని ముందే ఎలా అంచనా వేశారని ప్రశ్నించగా ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఎల్బీ స్టేడియంలో ఈనాడు-ఈటీవీ ప్రతినిధితో బండ్ల గణేశ్‌ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Raja Singh: కాంగ్రెస్‌వి మోసపూరిత హామీలు: భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ అని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Raja singh) అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా నాంపల్లిలోని భాజపా(BJP) రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద భాజపా నేతలు నివాళులర్పించారు. అనంతరం రాజాసింగ్‌ మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. AP High Court: విశాఖకు కార్యాలయాలను తరలించడంపై జీవో.. హైకోర్టులో విచారణ

విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ‘‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్‌గా దాఖలు చేశారు. అందువల్ల పిటిషన్‌కు విచారణ అర్హత లేదు. ఇది ఫోరమ్‌ షాపింగ్‌ కిందకు వస్తుంది’’ అని ఏజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. AP High Court: ‘ఇసుక కేసు’లో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఉచిత ఇసుక కేసులో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్‌ 12వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Kondareddypalli: రేవంత్ సొంత ఊరిలో సంబరాలు

రేవంత్‌ రెడ్డిని (Revanth Reddy) తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో.. ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆయన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాతే కాంగ్రెస్‌ పార్టీ పరుగులు పెట్టిందని, ఆయన ముఖ్యమంత్రి అవుతారని ముందుగానే ఊహించామని గ్రామస్థులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Stock Market: మూడోరోజూ రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 20,900 పైన ముగిసిన నిఫ్టీ

Stock Market Closing bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం వరుసగా మూడోరోజూ రికార్డు గరిష్ఠాలను నమోదు చేశాయి. ఐటీ, ఇంధన రంగ షేర్లు సూచీల లాభాలకు దోహదం చేశాయి. చమురు ధరల్లో స్థిరీకరణ, అమెరికాలో వడ్డీరేట్ల కోత సంకేతాలు.. స్టాక్‌ మార్కెట్లలో సానుకూల వాతావరణాన్ని నెలకొల్పాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Instagram: త్వరలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో క్రాస్‌ చాటింగ్‌ బంద్‌!

Instagram Facebook cross chatting | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సామాజిక మాధ్యమాలు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ విషయంలో టెక్‌ దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. క్రాస్‌ చాటింగ్‌ ఫీచర్‌ను నిలిపివేయబోతున్నట్లు తెలిపింది. డిసెంబర్‌లోనే దీన్ని అమల్లోకి తెస్తామని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. BJP: భాజపా గెలిచిన మూడు రాష్ట్రాల్లో సీఎంలుగా కొత్త వారికి అవకాశం

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాలకు సీఎంలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఈసారి కొత్తవారికి సీఎంలుగా అవకాశం ఇవ్వవచ్చనే ఊహాగానాలు వినిపిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Cyclone Michaung: అల్లూరి జిల్లాలో పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రంపచోడవరం మన్యంలో కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.  భూపతిపాలెం జలాశయం నుంచి ఆరు గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న సీతపల్లి వాగులోకి విడుదల చేశారు. దీంతో సీతపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహించి రంప వంతెనను ముంచెత్తింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాడేరు పరిసరాల్లో ఇ.కొత్తూరు వద్ద వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని