Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 07 Dec 2023 17:11 IST

1. CM Revanth: తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తా: మోదీ

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డిని (Telangna CM Revanth Reddy) ప్రధాని మోదీ అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సాధ్యమైనంత మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘‘ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి అభినందనలు. రాష్ట్రాభివృద్ధికి, అక్కడి ప్రజల సంక్షేమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హమీ ఇస్తున్నా’’ అని ప్రధాని తన ట్విటర్‌లో పోస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. General Anil Chauhan: సవాళ్లను ఎదుర్కొనేందుకు సరికొత్త సాంకేతికత అవసరం: సీడీఎస్‌

భవిష్యత్‌ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మానవ సహిత, మానవ రహిత సైనిక బలాలను అనుసంధానించడం చాలా కీలకమని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (CDS) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ (General Anil Chauhan) తెలిపారు. ఆ దిశగా భారత్‌ గట్టి ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఆధ్వర్యంలో దిల్లీలో గురువారం నిర్వహించిన ‘ఏవియానిక్స్‌ ఎక్స్‌పో 2023’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Stock Market: ఏడు రోజుల ర్యాలీకి బ్రేక్‌.. నిఫ్టీ @ 20,900

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. దీంతో ఏడు రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. రోజంతా సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. గతకొన్ని రోజుల భారీ లాభాల నేపథ్యంలో కీలక స్టాక్స్‌లో కొంత లాభాల స్వీకరణ కనిపించింది. మరోవైపు శుక్రవారం ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. CM Revanth: శుక్రవారం ప్రజాదర్బార్‌.. సీఎంగా రేవంత్‌ తొలి ప్రసంగం ఇదే

తెలంగాణ ప్రజలకు ఇవాళే స్వేచ్ఛ లభించిందని.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth) అన్నారు. ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజలను ఉద్దేశించి తొలిసారి ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Revanth Reddy: ఆరు గ్యారంటీలపైనే రేవంత్‌ తొలి సంతకం

తెలంగాణ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రెండు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ (Congress) ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీల దస్త్రంపైనే ఆయన తొలి సంతకం చేశారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక ఉత్తర్వులపై రెండో సంతకం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Revanth Reddy: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. అంతకుముందు కాంగ్రెస్‌ కార్యకర్తల కేరింతలు మధ్య ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో కలిసి ప్రత్యేక వాహనంలో రేవంత్‌ వేదిక వద్దకు చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. YouTube: యూట్యూబ్‌లో ఇక గేమ్స్‌.. వీరికి మాత్రమే!

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ (YouTube) తాజాగా గేమింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది. తన ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా గేమ్స్‌ ఆడే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌లోని యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ‘Playables’ పేరిట తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను ప్రీమియం చందాదారులు డౌన్‌లోడ్‌లు లేకుండానే వినియోగించవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Bihar: అది చాయ్‌ సమోసా మీటింగే.. ఇండియా కూటమిపై జేడీయూ నేత వ్యంగ్యాస్త్రాలు

మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi)ని ప్రశంసించిన జేడీయూ నేత సునీల్‌ కుమార్‌ పింటు (Sunil Kumar Pintu) తాజాగా ఇండియా కూటమిపై వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ఆ కూటమిలోని పార్టీల ఐక్యతను ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా పార్టీల మధ్య విభేదాలను ఎత్తిచూపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Nirmala sitharaman: బడ్జెట్‌లో ‘అద్భుతాలు’ ఉండకపోవచ్చు: నిర్మల సీతారామన్‌

సార్వత్రిక సమరానికి సెమీ ఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఇక 2024 లోక్‌సభ ఎన్నికలకు ఉన్నది ఆరు నెలలు మాత్రమే. వరుసగా మూడోసారి అధికారం చేపట్టాలని చూస్తున్న మోదీ సర్కారు.. ఎన్నికలకు ముందు జనాకర్షక పథకాలు, తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బడ్జెట్‌లో కీలక ప్రకటనలు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. China: ఆత్మహత్యా..? చిత్రహింసలు పెట్టి చంపేశారా..?: అదృశ్యమైన చైనా నేతపై కథనాలు

ప్రభుత్వాన్ని ధిక్కరించిన ప్రముఖులు అదృశ్యమైన ఘటనలు చైనా(China)లో అనేకం కనిపిస్తాయి. అలా మిస్ అయిన వ్యక్తే కిన్‌ గాంగ్‌. ఆయన సాక్షాత్తూ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే జాడ లేకుండా పోయారు. అయితే ఆయన చనిపోయి ఉంటారని పలు అంతర్జాతీయ వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకోవడమో లేక  చిత్రహింసల వల్ల మరణించి ఉండొచ్చని రాసుకొచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు