Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 08 Dec 2023 17:13 IST

1. Revanth Reddy: అంతకుమించిన తృప్తి ఏముంటుంది!: సీఎం రేవంత్‌ ఆసక్తికర ట్వీట్

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నేడు ‘ప్రజాదర్బార్‌’ నిర్వహించిన విషయం తెలిసిందే. జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌ వద్దకు వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజాదర్బార్‌ జరిగిన తీరుపై సీఎం రేవంత్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సీఎంవో నుంచి నాకు ఎలాంటి సమాచారం లేదు: దేవులపల్లి ప్రభాకర్‌రావు

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. ఇటీవల ఆయన ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. విద్యుత్‌శాఖపై సమీక్షకు పూర్తి వివరాలతో సిద్ధం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం అధికారులను ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ChandraBabu: ప్రతిపక్షాల ఓట్లను అధికార పార్టీ తొలగిస్తోంది: ఈసీకి చంద్రబాబు లేఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ.. ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు (ChandraBabu) అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి చంద్రబాబు లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అభివృద్ధి లేకపోయినా నోరు కట్టేసుకోవాలా?: వైకాపా నాయకులను నిలదీసిన కార్యకర్త

ఆంధ్రప్రదేశ్‌లో ఏం అభివృద్ధి జరుగుతోందని మళ్లీ ఓట్లు వేయాలని ఓ వైకాపా (YSRCP) కార్యకర్త నాయకులను నిలదీశారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో హిందూపురంలోని 13వ వార్డు సడ్లపల్లి గ్రామంలో గురువారం రాష్ట్రానికి ‘జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా కార్యకర్త అసహనం వ్యక్తం చేశాడు. దీంతో కంగుతిన్న వైకాపా నాయకులు కార్యకర్తకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆ కార్యకర్త కార్యక్రమం నుంచి బయటికి వెళ్లిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Stock Market: ఆర్‌బీఐ ఎఫెక్ట్‌.. తొలిసారి 21,000 మార్క్‌ అందుకున్న నిఫ్టీ!

ఏడు రోజుల వరుస ర్యాలీ నుంచి గురువారం విరామం తీసుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు నేడు తిరిగి పుంజుకున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ (RBI) ప్రకటించడంతో సూచీలు శుక్రవారం సరికొత్త గరిష్ఠాలను తాకాయి. తర్వాత అమ్మకాల సెగతో ఓ దశలో దాదాపు ఫ్లాట్‌గా మారాయి. తిరిగి కొనుగోళ్ల అండతో వెంటనే పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. దీంతో వరుసగా ఆరో వారమూ ప్రధాన సూచీల్లో నికరంగా లాభాలు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Onion ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో ఉల్లి ధరలు (Onion Prices) మళ్లీ మండిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర రూ.50 పైనే పలుకుతోంది. దీంతో వీటి ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతుల (Onion Exports)పై నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (DGFT) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.దేశీయంగా ఉల్లి (Onion) అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Tata group: మరో ఐఫోన్ల ప్లాంట్‌కు టాటాలు రెడీ.. 50 వేల మందికి ఉపాధి!

ఐఫోన్ల (iphones) తయారీకి విస్ట్రాన్‌ ప్లాంట్‌ను కొనుగోలు చేసిన టాటా గ్రూప్‌ (tata group) ఇప్పుడు మరో ప్లాంట్‌ నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. కర్ణాటకలోని ఈ ప్లాంట్‌ కొనుగోలు ద్వారా ఐఫోన్లు తయారుచేసే తొలి భారత కంపెనీగా అవతరించిన టాటా గ్రూప్‌.. దేశంలోనే అతిపెద్ద ప్లాంట్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. భారత్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలన్న యాపిల్‌ లక్ష్యానికి అనుగుణంగా టాటా గ్రూప్‌ ఈ అడుగులు వేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Amit Shah: రామ మందిర నిర్మాణం జరుగుతుందని అనుకొని ఉండరు: అమిత్‌ షా

అయోధ్య (Ayodhya)లో రామ మందిర (Ram Mandir) నిర్మాణం జరుగుతుందని దేశంలో ఎవరూ అనుకొని ఉండరని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) అన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, అభివృద్ధి అనేవి రెండు విరుద్ధమైన అంశాలు కాదని తెలిపారు. దిల్లీలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ABVP) 69వ జాతీయ సమావేశంలో అమిత్‌ షా పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఘోరం.. 24 గంటల వ్యవధిలో 9 మంది శిశువులు మృతి..!

24 గంటల వ్యవధిలో 9 మంది శిశువులు(newborns) మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. వారితో పాటు రెండేళ్ల చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయింది. పశ్చిమ్ బెంగాల్‌( West Bengal)లోని ముర్షిదాబాద్ వైద్య కళాశాలలో(Bengal hospital) ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ మరణాలకు గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Mallu Ravi: ప్రజలకు జవాబుదారీగా ఉండడమే మా ప్రభుత్వ ఉద్దేశం: మల్లు రవి

కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి భారీగా ప్రజలు కదిలి వచ్చారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ప్రజలకు జవాబుదారిగా ఉండడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం వారంతా ప్రజాదర్బార్‌కు తరలి వచ్చారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు