Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 11 Jun 2023 17:10 IST

1. ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు.. జల్లులు పడే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తిరుపతి జిల్లా శ్రీహరి కోట సమీప ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఉత్తర కోన శ్రీహరికోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్‌ తదితర ప్రాంతాలపై ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై కేసు నమోదు

భారాస కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సామ ఇంద్రపాల్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. 2018లో ఉప్పరపల్లిలో ఓ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు సామ ఇంద్రపాల్‌ రెడ్డి ప్రయత్నించారు. అదే సమయంలో మధ్యవర్తులుగా ఎమ్మెల్యే పట్నం నరేందర్‌, రాకేశ్‌ రెడ్డి అతనికి పరిచయమయ్యారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. ‘ఓ నడ్డా గారూ.. మీకు చేతనైతే విపక్షాలకు సమాధానం చెప్పండి’: పేర్ని నాని

‘‘మేం చూసిన ప్రభుత్వాల్లో అత్యంత అవినీతిమయమైంది వైకాపా పాలనే. రాష్ట్రంలో కుంభకోణాలకు విరామం లేదు. గనులు, ఇసుక, మద్యం, భూముల వ్యవహారాల్లో పెద్ద ఎత్తున కుంభకోణాలు, అవినీతి జరిగాయి. వైకాపా ప్రభుత్వం అవినీతి, డబ్బు సంపాదనపైనే దృష్టిసారించింది’ అని శ్రీకాళహస్తి సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలకు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు.  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. పాఠశాలల పునఃప్రారంభంపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఆదేశాలు జారీ

వేసవి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలుల దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ వరకు ఒక్క పూట బడులు పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. దిల్లీలో ‘పోస్టర్‌ వార్‌’.. రంగంలోకి పారామిలటరీ!

దేశ రాజధాని దిల్లీలో పోస్టర్‌ వార్‌ నడుస్తోంది. భాజపా, ఆప్‌ నేతలు రోడ్లకు ఇరువైపులా పోటాపోటీగా పోస్టర్లు, ప్లకార్డులు అతికిస్తూ ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. దిల్లీ పరిధిలోని గ్రూప్‌-ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలివ్వండి.. రెజ్లర్లను కోరిన దిల్లీ పోలీసులు!

భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ (Brij Bhushan Sharan Singh) తమను లైంగికంగా వేధించారంటూ మహిళా రెజర్లు చేసిన ఆరోపణలపై దిల్లీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అందులో భాగంగా ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలుంటే సమర్పించాలని రెజ్లర్లను పోలీసులు కోరినట్లు సమాచారం. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. అమెరికా ముంగిట చైనా గూఢచర్యం.. క్యూబాలో డ్రాగన్‌ వేగులు..

గూఢచర్యంపై అమెరికా (USA)- చైనా(China) మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తమ దేశానికి అత్యంత సమీపంలోని క్యూబా(Cuba)లో చైనా గూఢచర్య కార్యాలయాలు నిర్వహిస్తోందని అమెరికా అధికారి ఒకరు బాంబు పేల్చారు. దీని ఆధారంగా అక్కడి పత్రికలు కథనాలు ప్రచురించాయి. 2019లో ట్రంప్‌ హయాంలో మొదలైన కార్యకలాపాలను చైనా మెల్లగా విస్తరిస్తోందని వాటిల్లో పేర్కొన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. ఉద్ధవ్‌ ఠాక్రేను విమర్శించడానికే ఏర్పాటు చేసిన సభలా ఉంది..

శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray)ను చూసి భారతీయ జనతా పార్టీ (Bjp) భయపడుతోందని ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) అన్నారు. ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. శనివారం మహారాష్ట్ర (Maharshtra)లోని నాందేడ్‌లో జరిగిన ‘మహా సంపర్క్‌ అభియాన్‌’ కార్యక్రమంలో ఉద్ధవ్‌ను ఉద్దేశించి కేంద్రమంత్రి అమిత్‌ షా మాట్లాడటంపై సంజయ్‌ రౌత్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రిలిమినరీ కీ విడుదల.. రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ(IITs)ల్లో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష(JEE Advanced Exam) జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్‌ కీని  ఐఐటీ గువాహటి(IIT Guwahati) ఆదివారం విడుదల చేసింది. ఈ కీపై అభ్యంతరాలు లేవనెత్తేందుకు విద్యార్థులకు జూన్‌ 12 సాయంత్రం 5గంటలవరకు అవకాశం ఇచ్చింది. అలాగే, ఈ పరీక్షలో రెండు పేపర్లకు సంబంధించిన ప్రొవిజినల్‌ సమాధానాల కీలతో పాటు విద్యార్థులు తమ ఫీడ్‌బ్యాక్‌ తెలిపేందుకు ప్రత్యేకంగా లింక్‌లను అందుబాటులో ఉంచింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. Crime News: వికారాబాద్‌ జిల్లాలో నర్సింగ్‌ విద్యార్థిని దారుణ హత్య

వికారాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. పరిగి మండలం కాళ్లాపూర్‌ గ్రామంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష(19) తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని నీటికుంటలో రక్తపు మరకలతో మృతదేహం కనిపించింది.  దీంతో కుటుంబ సభ్యులు పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై విఠల్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని