Maharashtra: ఉద్ధవ్‌ ఠాక్రేను విమర్శించడానికే ఏర్పాటు చేసిన సభలా ఉంది..

శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray)ను చూసి భాజపా భయపడుతోందని ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) వ్యాఖ్యానించారు. నాందేడ్‌ సభ భాజపా అంతర్గత సభలా లేదని, ఉద్ధవ్‌ను విమర్శించేందుకు ఏర్పాటు చేసినట్లు ఉందన్నారు.

Published : 11 Jun 2023 16:01 IST

ముంబయి: శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray)ను చూసి భారతీయ జనతా పార్టీ (Bjp) భయపడుతోందని ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) అన్నారు. ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. శనివారం మహారాష్ట్ర (Maharshtra)లోని నాందేడ్‌లో జరిగిన ‘మహా సంపర్క్‌ అభియాన్‌’ కార్యక్రమంలో ఉద్ధవ్‌ను ఉద్దేశించి కేంద్రమంత్రి అమిత్‌ షా మాట్లాడటంపై సంజయ్‌ రౌత్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు.

‘‘నాందేడ్‌ సభలో అమిత్‌ షా 20 నిమిషాలు మాట్లాడితే.. అందులో 7 నిమిషాలు ఉద్ధవ్‌ ఠాక్రే గురించే మాట్లాడారు. అది భాజపా అంతర్గత సభలా లేదు.. ఉద్ధవ్‌ ఠాక్రేను విమర్శించడానికే ఏర్పాటు చేసిన సభలా ఉంది. ఉద్ధవ్‌పై సంధించిన ప్రశ్నలను భాజపా మరోసారి సమీక్షించుకోవాలి. అలాంటి ప్రశ్నలడిగి భాజపా.. తను వేసిన వలలో తనే చిక్కుకుంది’’అని సంజయ్‌ రౌత్‌  ట్వీట్‌ చేశారు.

కేంద్రంలో భాజపా (bjp) తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నాందేడ్‌లో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అమిత్‌ షా పాల్గొని ప్రసంగించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండకూడదని, అది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ముస్లింలకు రిజర్వేషన్‌ ఉండకూడదని భాజపా నమ్ముతుందన్నారు. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రతిపక్ష నేత ఉద్ధవ్‌ ఠాక్రే తన వైఖరి ఏంటో చెప్పాలన్నారు. సొంత పార్టీని మోసం చేసి.. సీఎం పదవి కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు