Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 14 May 2023 17:08 IST

1. సీబీఐ నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సూద్‌

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ నూతన డైరెక్టర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ ప్రవీణ్‌ సూద్‌  ఎంపికయ్యారు. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభప్రతిపక్ష నేతతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఈయన్ను ఎంపిక చేసింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు ప్రవీణ్‌సూద్‌ ఈ పదవిలో కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అతి తీవ్రంగా ‘మోచా’ తుపాను.. 5 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు!

బంగాళాఖాతం (Bay Of Bengal)లో ఏర్పడిన ‘మోచా (Mocha)’ తుపాను బంగ్లాదేశ్‌ (Bangladesh), మయన్మార్‌ (Myanmar)లను వణికిస్తోంది. గంటకు గరిష్ఠంగా 180-190 నుంచి 210 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కర్ణాటక కాంగ్రెస్‌ విజయం వెనుక ‘మిస్టర్‌ కె’..!

అతడో రాజకీయ వ్యూహకర్త.. పూర్తిగా లోప్రొఫైల్‌లో ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో వెతికినా కనిపించరు.. తన వాట్సాప్‌ ఖాతాలో ఫొటో కూడా పెట్టుకోరు. మీడియా కూడా ఆయన ఫొటో కోసం ఆపసోపాలు పడిన సందర్భాలున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్‌(Congress) విజయం (karnataka election 2023)అన్నీ తానై వ్యవహరించిన చతురుడు. టికెట్ల పంపిణీ నుంచి ప్రచారం వరకు అతి జాగ్రత్తగా పర్యవేక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సీఎం ఎంపికపై కసరత్తు.. ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ..!

ర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections) విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అయితే, ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే విషయంపై పార్టీలో తర్జనభర్జన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆదివారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ సీఎల్పీ సమావేశం (CLP Meet) నిర్వహించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సిద్ధూ వర్సెస్‌ డీకే: కన్నడనాట ఫ్లెక్సీల వార్‌

కర్ణాటకలో ఘన విజయం తర్వాత సీఎం పీఠం కోసం కేపీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌, మాజీ సీఎం సిద్ధరామయ్య వర్గీయుల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇరు పక్షాల మధ్య ఫ్లెక్సీల వార్‌ మొదలైంది. ఆదివారం ఉదయం బెంగళూరులో ఇరువురి అభిమానులు పలు రకాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం పదవిలో తమ అభిమాన నాయకుడే ఉండాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మేం గెలవటానికి ఆడినట్లు లేదు: డేవిడ్ వార్నర్

ఐపీఎల్‌ సీజన్‌లో (IPL 2023) దిల్లీ క్యాపిటల్స్‌ తీరు మారలేదు. హార్డ్‌ హిట్టర్లు ఉన్నప్పటికీ.. జట్టు మాత్రం పాయింట్ల పట్టికలో పైకిమాత్రం ఎగబాకలేకపోతోంది. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 168 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో తడబాటుకు గురైంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (54*), ఫిలిప్‌ సాల్ట్ (21) మంచి ఆరంభం ఇచ్చినా సద్వినియోగం చేసుకోకుండా ఓటమిపాలైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పోయిన ఫోన్లను ట్రాక్‌ చేసి బ్లాక్‌ చేసే వ్యవస్థ మే 17 నుంచి అమలు!

పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్ల (Mobile phones)ను ట్రాక్‌ చేసి బ్లాక్‌ చేసే సాంకేతికతను ఈ వారమే దేశవ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ‘సెంటర్‌ ఫర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలీమేటిక్స్‌ (CDoT)’ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థను ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు కింద కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ట్విటర్‌ కొత్త సీఈఓ లిండా తొలి ట్వీట్‌ ఇదే..!

మరింత మెరుగైన భవిష్యత్‌ను సృష్టించాలనే ఎలాన్‌ మస్క్‌ విజన్‌ నుంచి తాను స్ఫూర్తి పొందానని ట్విటర్‌ కొత్త సీఈఓ లిండా యాకరినో అన్నారు. ఆ దిశగా సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. మస్క్‌ ఆమెను ట్విటర్‌ సీఈఓగా ప్రకటించిన తర్వాత లిండా చేసిన తొలి ట్వీట్‌ ఇదే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మహిళలు మృతి

కాకినాడ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. తాళ్లరేవు మండలం క్వారింగ పంచాయతీ పరిధిలోని సుబ్బరాయుని దిమ్మె కూడలిలో ప్రైవేటు బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు మృతి చెందారు. మరో నలుగురిని యానాం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఐ ఫోన్‌లోకి వైరస్‌.. ఎలా అడ్డుకోవాలంటే!

ఆండ్రాయిడ్‌ (Android) ఫోన్లతో పోలిస్తే ఐ ఫోన్లలో (IPhones) భద్రతా ప్రమాణాలు ఎక్కువే అయినప్పటికీ కొన్ని అసాధారణ పరిస్థితుల్లో వాటికి కూడా వైరస్‌ (Viruse)వస్తుంది. అయితే అది చాలా అరుదుగా జరుగుతుంది. ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌ (Software) అప్‌డేట్‌ చేసుకోకపోవడం, కొన్ని రకాల వెబ్‌సైట్‌లు (Websites), మెయిళ్లను (Mails) తెరవడం వల్ల ఐ ఫోన్లలోకి వైరస్‌లు చొరబడుతుంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని