Mobile phones: పోయిన ఫోన్లను ట్రాక్‌ చేసి బ్లాక్‌ చేసే వ్యవస్థ మే 17 నుంచి అమలు!

Mobile phones: సీఈఐఆర్‌ వ్యవస్థ, మొబైల్‌ నెట్‌వర్క్‌ల దగ్గర ఐఎంఈఐ నెంబర్లు, వాటికి అనుసంధానమైన మొబైల్‌ నెంబర్ల జాబితా ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగానే పోయిన ఫోన్లను ట్రాక్‌ చేసి, బ్లాక్‌ చేస్తారు.

Updated : 14 May 2023 15:38 IST

దిల్లీ: పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్ల (Mobile phones)ను ట్రాక్‌ చేసి బ్లాక్‌ చేసే సాంకేతికతను ఈ వారమే దేశవ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ‘సెంటర్‌ ఫర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలీమేటిక్స్‌ (CDoT)’ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థను ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు కింద కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

మే 17న ఈ ‘సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ (CEIR)’ వ్యవస్థను భారతదేశ వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందని సదరు అధికారి తెలిపారు. సీడాట్‌ సీఈఓ రాజ్‌కుమార్‌ ఉపాధ్యాయ్‌ మాత్రం ఇంకా తేదీని ధ్రువీకరించలేదు. కానీ, దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మాత్రం స్పష్టం చేశారు. అందుకోసం వ్యవస్థ సిద్ధంగా ఉందని తెలిపారు.

మొబైల్‌ ఫోన్‌ను విక్రయించడానికి ముందే దాని ఐఎంఈఐ నెంబర్‌ను బహిర్గతం చేయాలనేది నిబంధన. మొబైల్‌ నెట్‌వర్క్‌ల వద్ద ఈ అధీకృత ఐఎంఈఐ నెంబర్ల జాబితా ఉంటుంది. ఒకవేళ ఏవైనా అనధికారిక మొబైళ్లు తమ నెట్‌వర్క్‌లోకి వస్తే టెలికాం సంస్థలు గుర్తించగలుగుతాయి. సీఈఐఆర్‌ వ్యవస్థ, మొబైల్‌ నెట్‌వర్క్‌ల దగ్గర ఐఎంఈఐ నెంబర్లు, వాటికి అనుసంధానమైన మొబైల్‌ నెంబర్ల జాబితా ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగానే పోయిన ఫోన్లను ట్రాక్‌ చేసి, బ్లాక్‌ చేస్తారు. తద్వారా ఫోన్ల దొంగతనాలు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అలాగే దొంగలను గుర్తించడానికి కూడా పోలీసులకు సులభమవుతుంది.

ఈ సర్వీసును ఎలా వాడాలంటే...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు