Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 05 Jun 2024 17:00 IST

1. కొనసాగుతోన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు

వరంగల్‌- ఖమ్మం- నల్గొండ శాసనమండలి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని తిప్పర్తి మండలం అనిశెట్టిదుప్పలపల్లి గోదాంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రస్తుతం తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పూర్తి కథనం

2. మహారాష్ట్రలో ఫలితాల ప్రకంపనలు.. రాజీనామాకు సిద్ధమైన ఉప ముఖ్యమంత్రి ఫడణవీస్‌

సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఉప ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) సిద్ధమయ్యారు. ఈమేరకు ఆయన పార్టీ కేంద్ర నాయకత్వానికి సమాచారం పంపించారు. పూర్తి కథనం

3. హిందీబెల్ట్‌లో నయా గేమ్‌ ఛేంజర్లు..!

2024 సార్వత్రిక ఎన్నికల్లో హిందీ బెల్ట్‌లోని కీలక రాష్ట్రాలైన బిహార్‌, యూపీలో యువ నేతలు జాతీయస్థాయి రాజకీయాలను ప్రభావితం చేయగల స్థాయిలో బలపడ్డారు. వీరంతా ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి నిలబడిన నేతల వారసులే. తండ్రి వారసత్వం వీరికి లాంఛ్‌ ప్యాడ్‌గా ఉపయోగపడ్డా.. ఇప్పటివరకు చెప్పుకోదగిన స్థాయిలో విజయాలు సాధించలేదు.  పూర్తి కథనం

4. ఏపీ సచివాలయం ఐటీ విభాగంలో పోలీసుల తనిఖీలు

సచివాలయంలోని ఐటీ విభాగంలో బుధవారం ఉదయం పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ కమ్యూనికేషన్‌ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్‌లు, ల్యాప్‌ ట్యాప్‌లు, ఇతర ఉపకరణాలను తనిఖీ చేశారు. ఐటీ విభాగంలోని కంప్యూటర్‌ల నుంచి డేటా తస్కరణకు, డిలీట్‌ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారుల తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి కథనం

5. ‘ఈ ప్రశ్నే తప్పు..’: రిపోర్టర్‌పై రోహిత్‌ శర్మ అసహనం

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తొలి పోరుకు సిద్ధమవుతోంది. బుధవారం రాత్రి ఐర్లాండ్‌తో టీమ్‌ఇండియా (Team India) తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) మీడియాతో మాట్లాడాడు. ఈసందర్భంగా వార్మప్‌ మ్యాచ్‌ సమయంలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై రిపోర్టర్‌ అడగ్గా.. హిట్‌మ్యాన్‌ ఒకింత అసహనానికి గురయ్యాడు.  పూర్తి కథనం

6. 10న ఇక్సిగో ఐపీఓ ప్రారంభం.. ధరల శ్రేణి రూ.88-93

ఇక్సిగో పేరిట ఆన్‌లైన్‌ ట్రావెల్‌ బుకింగ్‌ వేదికను నిర్వహిస్తున్న లీ ట్రావెన్యూస్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ ఐపీఓ (ixigo IPO) జూన్‌ 10న ప్రారంభమై 12న ముగియనుంది. దీని ధరల శ్రేణిని కంపెనీ రూ.88-93గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.740 కోట్లు సమీకరించనుంది. పూర్తి కథనం

7. హిమాలయాల్లో ప్రమాదం.. ట్రెక్కింగ్‌ చేస్తూ నలుగురి మృతి

హిమాలయ పర్వతాలపై ట్రెక్కింగ్‌ (trekking)  చేస్తూ ప్రమాదవశాత్తూ నలుగురు మరణించిన ఘటన సహస్రతల్(Sahastratal)  ప్రాంతంలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు స్థానిక గైడ్‌లతో పాటు కర్ణాటకకు చెందిన 18 మంది ట్రెక్కర్లు, మహారాష్ట్రకు చెందిన ఒకరు హిమాలయాల్లో 4,100-4,400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతల్ ఆల్పైన్ సరస్సు వద్ద బుధవారం ట్రెక్కింగ్ చేస్తుండగా మంచులో చిక్కుకుపోయారు. పూర్తి కథనం

8. భాజపా హ్యాపీ..కాంగ్రెస్ హ్యాపీ: ఆకట్టుకుంటోన్న హర్ష గోయెంకా ఫన్నీ పోస్టు

వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే విషయాలతో పాటు వర్తమాన అంశాలను ప్రస్తావిస్తుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka). వాటికి తనదైన చమత్కారాన్ని జోడిస్తుంటారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల (Lok Sabha Election Results)పై ఆయన చేసిన పోస్టు వైరల్‌గా మారింది. పూర్తి కథనం

9. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే: ఈటల

తెలంగాణలో అధికార కాంగ్రెస్‌కు భాజపానే ప్రత్యామ్నాయం అని ఓటర్లు తీర్పునిచ్చారని మల్కాజిగిరి ఎంపీగా గెలుపొందిన ఈటల రాజేందర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘లోక్‌సభ ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా మోదీ మూడోసారి ప్రధాని కావాలని భాజపాకు ఓటేశారు. పూర్తి కథనం

10. నవీన్‌ పట్నాయక్‌ రాజీనామా.. ఒడిశా తదుపరి సీఎం ఎవరో?

ఒడిశాను 24ఏళ్లపాటు ఏకధాటిగా పాలించిన బిజూ జనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్‌కు తొలిసారి ఓటమి ఎదురయ్యింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ రఘుబర్‌ దాస్‌కు రాజీనామా లేఖను అందించారు. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని