Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Apr 2024 17:06 IST

1. లోక్‌సభ ఎన్నికలు.. రేపే భాజపా మేనిఫెస్టో..!

సార్వత్రిక ఎన్నికలు (Lok sabha elections) దగ్గరపడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ తమ మేనిఫెస్టో (Manifesto)ను ప్రకటించగా.. ఇప్పుడు భాజపా (BJP) తమ ‘సంకల్ప పత్రాన్ని’ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2.  నా ప్రచారంతో వైకాపాలో వణుకు: వైఎస్‌ షర్మిల

కడప వైకాపా (YSRCP) ఎంపీ అభ్యర్థిగా ఉన్న అవినాష్‌రెడ్డిని మారుస్తారనే వార్తలు వస్తున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. ఆయన్ను మారుస్తున్నారంటే సీబీఐ చెప్పింది నిజమేనని నమ్ముతున్నారా? అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. విశాఖలో ఫ్లెక్సీల కలకలం.. 7 ప్రశ్నలతో ఏర్పాటు

నగరంలోని తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. ఎంవీపీ కాలనీలోని బస్‌ కాంప్లెక్స్‌ ఎదుట 7 ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలు శనివారం దర్శనమిచ్చాయి. ‘‘విశాఖలోని సిరిపురంలో క్రిస్టియన్‌ భూములు కొట్టేసిందెవరు? స్థల వివాదాల్లో తలదూర్చి సొంత కుటుంబం కిడ్నాప్‌నకు కారణమైందెవరు? ఐపీఎస్‌ అధికారుల స్థలాలనూ కబ్జా చేసిందెవరు? వృద్ధుల కోసం ప్రభుత్వం కేటాయించిన ఆశ్రమ స్థలాలను కాజేసిందెరు?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. బోర్నవిటా సహా ఆ డ్రింక్స్‌ను ‘హెల్త్‌ డ్రింక్స్‌’ కేటగిరీ నుంచి తొలగించండి: కేంద్రం

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఇ-కామర్స్‌ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోర్నవిటా సహా ఇతర కూల్‌డ్రింక్స్‌/ బేవరేజెస్‌ను ‘హెల్త్‌ డ్రింక్స్‌’ కేటగిరీ నుంచి తొలగించాలంది. ‘‘పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం, 2005 సెక్షన్‌ 3 కింద ఏర్పాటైన జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్‌ (NCPCR) జరిపిన విచారణలో.. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ చట్టం, 2006లో ‘హెల్త్‌ డ్రింక్‌’ అని దేన్నీ నిర్వచించలేదు అని నిర్ధరణకు వచ్చింది’’ అని కేంద్రం ఏప్రిల్‌ 10న జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. గుడివాడలో కొడాలి నానికి షాక్‌.. తెదేపాలో చేరిన వైకాపా ముఖ్య నేత

కృష్ణా జిల్లా గుడివాడలో వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్‌ తగిలింది. నియోజకర్గంలో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత షేక్‌ మౌలాలి తెదేపాలో చేరారు. ఆయనతో పాటు అనుచరులకు గుడివాడ తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాము మాట్లాడుతూ ప్రజలకు మంచి చేసేందుకు మౌలాలి లాంటి వ్యక్తులు తెదేపాలోకి వస్తున్నారన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. అమెరికాలో భార్యను చంపి పరారీ.. భారతీయుడిపై రూ.2 కోట్ల రివార్డు

సరిగ్గా తొమ్మిదేళ్లక్రితం అమెరికా (USA)లో ఓ హత్య ఘటన చోటుచేసుకుంది. భారత్‌ (India)కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతంగా కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. ఈ ఘటనలో నిందితుడైన భద్రేశ్‌ కుమార్‌ చేతన్‌భాయ్‌ పటేల్‌ను అగ్రరాజ్య ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (FBI) టాప్‌ టెన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. తాజాగా అతడి తలపై భారీ రివార్డును ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. రాజకీయాల్లో ‘నూబ్‌’ ఎవరో..? మోదీ సెటైర్‌

ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌తో పాపులారిటీ సంపాదించిన కొంతమంది గేమర్ల (gamers)తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఇటీవల ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను ప్రధాని తాజాగా పంచుకున్నారు. ఇందులో ప్రతిపక్షాలను విమర్శిస్తూ మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆన్‌లైన్‌ గేమ్‌ పరిభాషలోని ‘నూబ్‌ (Noob)’తో విపక్షాలను పోలుస్తూ ప్రధాని సెటైర్లు వేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. బస్సులోంచి కిడ్నాప్‌ చేసి.. 9 మందిని చంపిన ఉగ్రవాదులు

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నోష్కి (Noshki) జిల్లాలోని హైవేపై కాపు కాసిన కొందరు ముష్కరులు.. క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు వెళ్తున్న ఓ బస్సును అడ్డుకున్నారు. అందులోని 9 మంది ప్రయాణికులను కిడ్నాప్‌ చేసి పర్వత ప్రాంతాలకు తీసుకెళ్లారు. దీంతో భయభ్రాంతులకు గురైన ఇతర ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా.. ఓ వంతెన సమీపంలో ఆ తొమ్మిది మంది మృతదేహాలు దొరికాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. మోదీతో ‘గేమ్‌’.. నెటిజన్లు శోధిస్తున్న ఆ సొట్ట బుగ్గల సుందరి ఎవరు..?

ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌తో పాపులారిటీ సంపాదించిన కొంతమంది గేమర్ల (gamers)తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఇటీవల ముచ్చటించిన సంగతి తెలిసిందే. వారితో ప్రధాని సంభాషణకు సంబంధించిన పూర్తి వీడియో ఈ రోజు విడుదలైంది. వారంతా గేమింగ్ ఇండస్ట్రీ భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నారు. అలాగే మన పురాణాల ఆధారంగా గేమ్స్ రూపకల్పన గురించి, ఈ రంగంలో కెరీర్‌ ఎంచుకుంటున్నవారు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చర్చించుకున్నారు మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. రూ.26 కోట్ల నగదు బదిలీ.. ఇద్దరు సైబర్‌ కేటుగాళ్లు అరెస్ట్‌

పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని సైబర్‌ క్రైం డీసీపీ కవిత తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు జనవరిలో కేసు నమోదు చేశామని, నిందితులు నౌషద్‌, కబీర్‌ కేరళలో ఉన్నట్లు గుర్తించి.. అక్కడికి వెళ్లి అరెస్టు చేసినట్టు చెప్పారు. కేసు వివరాలను శనివారం ఆమె మీడియాకు వెల్లడించారు. పార్ట్‌ టైం ఉద్యోగాల పేరుతో టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా బాధితులకు నిందితులు పరిచయమయ్యారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని