Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 28 May 2024 17:03 IST

1. ఎన్టీఆర్‌ ఎంతో దార్శనికత గల నాయకుడు: ప్రధాని మోదీ

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఎంతో దార్శనికత గల నాయకుడని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ఆయన ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా స్మరించుకున్నారు. ‘‘ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన.. ఎంతో దార్శనికత గల నాయకుడు’’ అని మోదీ పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఫోన్‌ ట్యాపింగ్‌పై వాళ్లిద్దరూ సీబీఐ విచారణ కోరరా?: సీఎం రేవంత్‌రెడ్డి

అన్నింటికీ సీబీఐ దర్యాప్తు కావాలనే భారాస నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు.. ఫోన్‌ ట్యాపింగ్‌పై మాత్రం సీబీఐ విచారణ కోరరా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన దిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. చిన్నారులను విక్రయిస్తున్న ముఠా అరెస్టు.. 16 మందిని రక్షించాం: రాచకొండ సీపీ

చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు

నగరంలోని ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. అక్కడ బాంబు ఉన్నట్లు పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. వెంటనే ప్రజాభవన్‌ వద్దకు బాంబు స్క్వాడ్‌ సిబ్బంది చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. చివరికి ఇది ఆకతాయిలు చేసిన పనిగా పోలీసులు నిర్ధరించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. జూన్‌ 4 తర్వాత ఆయన మాజీ సీఎం: అమిత్ షా వ్యాఖ్యలు

ఒడిశా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాజపా అధిక స్థానాలు గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ, 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామన్నారు. భద్రక్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చాంద్‌బలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌ షా పాల్గొని మట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. రోజంతా ఒడుదొడుకులు.. 220 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. రోజంతా ఒడుదొడుకులకు లోనయ్యాయి. రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7.  ప్రతి రాత్రి వాట్సప్‌ ‘డేటా ఎక్స్‌పోర్ట్’.. మస్క్‌ ఆరోపణలకు క్యాత్‌కార్ట్‌ కౌంటర్‌!

ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సప్‌ (WhatsApp) ప్రతీ రాత్రి యూజర్‌ డేటాను ఎక్స్‌పోర్ట్‌ చేస్తుందంటూ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) పేర్కొనడం చర్చనీయాంశమయ్యింది. వీటిని వాట్సప్‌ అధినేత విల్‌ క్యాత్‌కార్ట్‌ తోసిపుచ్చారు. ఆయన వాదన అవాస్తవమన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. గోరఖ్‌పుర్‌లో భోజ్‌పురి యాక్షన్‌ చిత్రం.. యోగి అడ్డాలో హోరాహోరీ..!

భాజపాలో మోదీ తర్వాత అత్యంత పాపులర్‌ లీడర్‌ యోగి. ఇప్పుడాయన సొంత నియోజకవర్గమైన గోరఖ్‌పుర్‌ (Gorakhpur)లో పోరు యూపీలో హీటు పుట్టిస్తోంది. ఇక్కడ ఎన్నికలు చివరిదశలో ఉండడంతో పార్టీలన్నీ తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అభ్యర్థులు ఇద్దరూ ప్రజాదరణలో ఏమాత్రం తీసిపోని భోజ్‌పురి నటులే. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. కాంబోడియాలో చిక్కుకున్న యువతను రాష్ట్రానికి తీసుకురావాలి: చంద్రబాబు

రాష్ట్రంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఆ విషాదం మరువకముందే.. టైటాన్‌ తరహాలో మరో సాహస యాత్ర..

టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురితో బయలుదేరి వెళ్లి గల్లంతైన టైటాన్‌ (Titan Submarine) మినీ జలాంతర్గామి విషాదాంతం సంగతి తెలిసిందే. ఆ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. ఇప్పుడు అదే తరహాలో ఇద్దరు వ్యక్తులతో మరో యాత్రకు రంగం సిద్ధమవుతోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు