Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 30 May 2024 16:59 IST

1. నాడు కేదార్‌నాథ్‌.. నేడు కన్యాకుమారి: ప్రధాని ధ్యాన సాధనకు వేదిక

సార్వత్రిక ఎన్నికల ప్రచార ఘట్టం నేటితో పూర్తికానుంది. పంజాబ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోదీ (PM Modi) హోషియార్‌పుర్‌తో ముగించుకోనున్నారు. అనంతరం ఆయన కన్యాకుమారికి బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడ ఆయన సుమారు 45 గంటలపాటు గడిపేలా కార్యక్రమాలను ప్లాన్ చేశారు. పూర్తి కథనం

2. సీఎస్‌ పదవికి మచ్చ తెచ్చిన జవహర్‌రెడ్డిని తప్పించాలి: దేవినేని ఉమ

సజ్జల వ్యాఖ్యలపై ఈసీ తక్షణమే స్పందించి అరెస్టు చేయాలని తెదేపా నేత దేవినేని ఉమ డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘నిబంధనలు పాటించేవాళ్లు ఏజెంట్లుగా సజ్జలకు అవసరం లేదట. తెదేపా, జనసేన ఏజెంట్లకు అడ్డుపడాలని ఆయన హితబోధ చేయడం సిగ్గుచేటు. పూర్తి కథనం

3. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దు: సీఈవో మీనా

ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్‌ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారిని అరెస్టు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్‌ కుమార్‌ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. పూర్తి కథనం

4. బాలయ్యబాబు కూర్చొన్న దగ్గర ఏ బాటిల్‌ లేదు.. అదంతా సీజీ: నాగవంశీ

విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా ‘గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari). ఇటీవల జరిగిన ప్రీరిలీజ్‌ వేడుకకు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna) విచ్చేసి సందడి చేశారు. ఈ మూవీ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. పూర్తి కథనం

5. రణ్‌వీర్‌ - ప్రశాంత్ వర్మల ప్రాజెక్ట్‌ వాయిదా.. అధికారిక వెల్లడి

కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా తెరకెక్కనున్న ‘రాక్షస’ (Rakshasa) ఆగిపోయిందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీస్‌ మేకర్స్‌పై రానున్న ఈ చిత్రంపై తాజాగా టీమ్‌ అధికారిక నోట్‌ విడుదల చేసింది.  పూర్తి కథనం

6. ఏలూరులో దారుణం.. ప్రియురాలిని కత్తితో నరికి చంపిన ప్రియుడు

ప్రియురాలిని ఓ యువకుడు కత్తితో నరికి దారుణంగా హతమార్చిన ఘటన ఏలూరులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం నగరంలోని సత్రంపాడు సాయిబాబా గుడి వద్ద యువతిపై కత్తితో దాడి చేసిన అనంతరం యువకుడు కూడా అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పూర్తి కథనం

7. ఆ పోస్టును రైనా డిలీట్‌ చేయడానికి కారణమదే: షాహిద్‌ అఫ్రిది

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిపై భారత క్రికెటర్ సురేశ్‌ రైనా (Suresh Raina) సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే, ఆ తర్వాత దానిని తన ఖాతా నుంచి తొలగించాడు. అలా ఎందుకు చేశాడనేది షాహిద్ అఫ్రిది ఓ యూట్యూబ్ ఛానెల్‌లో స్పందించాడు.   పూర్తి కథనం

8. ఆర్‌బీఐ నివేదిక: పెరిగిన మోసాలు.. ఈ బ్యాంకుల్లోనే అధికం..!

దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 36,075 మోసాలు నమోదయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9,046, 2022-23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 13,564 మోసాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా అధికం. పూర్తి కథనం

9. మోదీవి విద్వేష ప్రసంగాలు.. ప్రధానిపై మండిపడ్డ మన్మోహన్‌

ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో విపక్షాలను లేదా ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని విద్వేషపూరిత, అనుచిత ప్రసంగాలతో ప్రధాని కార్యాలయం హుందాతనాన్ని తగ్గించారని ధ్వజమెత్తారు.  పూర్తి కథనం

10. టీమ్‌ఇండియా హెడ్‌ కోచ్‌ పదవి.. కాస్త తెలివిగా ఎంచుకోండి: గంగూలీ

ప్రస్తుతం భారత జట్టు ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid). జూన్ 30తో అతడి పదవీకాలం ముగుస్తుంది. ఈలోగా కొత్త కోచ్‌ను ఎంపిక చేసి జులై 1 నుంచి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. అయితే, ఎవరిని ఎంపిక చేస్తారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.  పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని