Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. ధరణి వద్దన్న వాళ్లనే బంగాళాఖాతంలో కలిపేద్దాం: సీఎం కేసీఆర్
నిర్మల్ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు. జిల్లా కేంద్రమైన నిర్మల్‌లో నూతనంగా నిర్మించిన భారాస జిల్లా కార్యాలయం, రూ.56.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఎల్లపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా రూ.10లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. వైకాపా దుర్మార్గపు పాలనను అంతమొందించాలి: ఆనం రామనారాయణరెడ్డి
రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని మాజీ మంత్రి, వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా నాలుగేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని మండిపడ్డారు. దోపిడీయే ఈ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. తెలంగాణలో కర్ఫ్యూ లేని పాలన .. ఆ ఘనత పోలీసులదే: ఎమ్మెల్సీ కవిత
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అనేక అపోహలు ఉండేవి. భద్రత ఉండదు, రౌడీల రాజ్యంగా మారుతుందని దుష్ప్రచారం జరిగింది. కానీ, ఆ అపోహలను పటాపంచలు చేస్తూ కర్ఫ్యూ లేకుండా రికార్డు పాలన చేసిన ఘనత తెలంగాణ పోలీసులకే దక్కుతుంది’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన మహిళా సురక్షా సంబరాల్లో కవిత పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఒడిశా రైలు దుర్ఘటన.. సీబీఐ విచారణకు రైల్వేబోర్డు సిఫారసు
ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ దుర్ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయాలని రైల్వే బోర్డు సిఫారసు చేసిందని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన భువనేశ్వర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సహాయక కార్యక్రమాలు పూర్తయ్యాయని.. ఘటనా స్థలిలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. లోకో పైలట్ తప్పిదం లేదు..! ‘సిగ్నల్ వ్యవస్థ’ ట్యాంపరింగ్ జరిగిందా?
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం (Odisha Train Accident) పూర్తి కారణాలపై ఇంకా స్పష్టత రానప్పటికీ.. డ్రైవర్ తప్పిదం లేకపోవచ్చని రైల్వేశాఖ ఉన్నతాధికారులు (Indian Railways) పేర్కొన్నారు. ఘటన సమయంలో రెండు రైళ్లు కూడా పరిమిత వేగానికి లోబడే వెళ్తున్నాయన్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ సరిగ్గానే ఉన్నప్పటికీ.. అందులో ఎవరో ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. మార్చురీల వద్దే భారీగా ‘గుర్తుపట్టని’ మృతదేహాలు.. భద్రపరచడం పెద్ద సవాలే!
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం(Odisha Train Accident) వందలాది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదమే మాటలకందని ఓ మహా విషాదం కాగా.. ఆ దుర్ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో మార్చురీల వద్దే గుట్టలుగుట్టలుగా పడి ఉండటం మరో పెను విషాదం. శుక్రవారం రాత్రి బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొట్టడంతో జరిగిన దుర్ఘటనలో 275 మంది మృత్యువాత పడటంతో అత్యంత హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి
చైనా (China)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి చెందగా, ఐదుగురు గల్లంతయ్యారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని జిన్‌కౌహీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టాయని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఈ నెలలో కన్పించే పున్నమి చంద్రుడికి ఎన్ని పేర్లున్నాయంటే..!
ఏటా జూన్ మాసంలో వెన్నెల కాంతులు వెదజల్లే పున్నమి చంద్రుడిని ‘స్ట్రాబెరీ మూన్’ అని పిలుస్తారు. ‘స్ట్రాబెరీ మూన్’ అంటే అర్థం చంద్రుడు స్ట్రాబెరీ రంగులోకి మారిపోతాడని కాదు. అలా పిలవడానికి గల కారణం ప్రాచీన సంప్రదాయాలతో ముడిపడి ఉంది. నిజానికి ఈ నెలలో కన్పించే పున్నమి జాబిలిని ప్రపంచవ్యాప్తంగా రకరకాల పేర్లతో పిలుస్తారు. ‘రెడ్ మూన్’, ‘హనీ మూన్’, ‘ఫ్లవర్ మూన్’, ‘హాట్ మూన్’, ‘హో మూన్’, ‘ప్లాంటింగ్ మూన్’ ఇలా బోలెడు పేర్లున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. యథాతథంగానే వడ్డీరేట్లు.. నిపుణుల అంచనా!
రెపోరేటు (Repo rate)ను ఈసారి కూడా ‘భారతీయ రిజర్వ్ బ్యాంక్’ (RBI) 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం (inflation) తగ్గడం, రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉండడమే అందుకు కారణమని వివరించారు. గతంలో రేట్లను పెంచడం వల్లే ద్రవ్యోల్బణం (inflation) దిగొస్తోందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. శోభనం గదిలో గుండెపోటుతో నవదంపతుల మృతి
పెళ్లి రోజే ఆ నవదంపతులకు (Newly married couple) చివరి రోజైంది. బంధువులు, స్నేహితులతో కళకళలాడుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. మూడుముళ్లతో ఒక్కటై గంటలు కూడా గడవక ముందే ఆ నూతన జంట తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttarpradesh) బహ్రైచ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..22 ఏళ్ల ప్రతాప్ యాదవ్‌కు 20 ఏళ్ల పుష్పతో వివాహం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TSPSC: టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ను తొలగించాలి.. ఓయూలో విద్యార్థుల ఆందోళన
-
Vande bharat express: కాచిగూడ- యశ్వంత్‌పూర్, చెన్నై- విజయవాడ టికెట్ ధరలివే..!
-
High Speed Train: ఆరు నెలల్లో హైస్పీడ్ ట్రైన్.. వెల్లడించిన రైల్వే మంత్రి
-
Vizag: గోనెసంచిలో చుట్టి సముద్రంలో పడేసి.. విశాఖలో బాలుడి హత్య
-
ICC Rankings: మనోళ్లే కింగ్స్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆధిపత్యం
-
Vivek Ramaswamy: వివేక్ రామస్వామితో డిన్నర్ ఆఫర్.. ఒక్కొక్కరికి 50 వేల డాలర్లపైమాటే!