Heart attack: శోభనం గదిలో గుండెపోటుతో నవదంపతుల మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో పెళ్లయిన గంటల వ్యవధిలోనే ఓ నూతన జంట గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది.
లఖ్‌నవూ: పెళ్లి రోజే ఆ నవదంపతులకు (Newly married couple) చివరి రోజైంది. బంధువులు, స్నేహితులతో కళకళలాడుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. మూడుముళ్లతో ఒక్కటై గంటలు కూడా గడవక ముందే ఆ నూతన జంట తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttarpradesh) బహ్రైచ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..22 ఏళ్ల ప్రతాప్ యాదవ్‌కు 20 ఏళ్ల పుష్పతో వివాహం జరిగింది. పెళ్లితంతు పూర్తయిన తర్వాత వాళ్లిద్దరూ పడక గదికి వెళ్లారు. తీరా తెల్లారి చూసే సరికి ఇద్దరూ మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, నూతన దంపతుల మృతికి గుండెపోటు కారణమని పోస్టుమార్టంలో తేలినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. వారిద్దరికీ ఒకే చోట దహన సంస్కారాలు నిర్వహించారు. మే 30న జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: కొనసాగుతున్న నష్టాల పరంపర.. 19,400 దిగువకు నిఫ్టీ
-
AP BJP: ‘పవన్’ ప్రకటనలపై ఏం చేద్దాం!
-
Floods: సిక్కింలో మెరుపు వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
YSRCP: వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు
-
Vizag: ఫోర్జరీ సంతకాలతో ముదపాక భూముల విక్రయం