Moon : ఈ నెలలో కన్పించే పున్నమి చంద్రుడికి ఎన్ని పేర్లున్నాయంటే..!
ప్రపంచంలోని (World) పలు దేశాల్లో శనివారం రాత్రి ‘ఫుల్ మూన్’ (Full moon) దర్శనమిచ్చాడు. భూమికి అత్యంత సమీపంలో ఉన్నట్లుగా కనిపించే ఈ చంద్రుడిని (Moon) రకరకాల పేర్లతో పిలుస్తారు. వాటి వెనకున్న కథేంటో తెలుసుకోండి.
ఏటా జూన్ (June) మాసంలో వెన్నెల కాంతులు వెదజల్లే పున్నమి చంద్రుడిని ‘స్ట్రాబెరీ మూన్ (strawberry moon)’ అని పిలుస్తారు. ‘స్ట్రాబెరీ మూన్’ అంటే అర్థం చంద్రుడు స్ట్రాబెరీ రంగులోకి మారిపోతాడని కాదు. అలా పిలవడానికి గల కారణం ప్రాచీన సంప్రదాయాలతో ముడిపడి ఉంది. నిజానికి ఈ నెలలో కన్పించే పున్నమి జాబిలిని ప్రపంచవ్యాప్తంగా రకరకాల పేర్లతో పిలుస్తారు. ‘రెడ్ మూన్’, ‘హనీ మూన్’, ‘ఫ్లవర్ మూన్’, ‘హాట్ మూన్’, ‘హో మూన్’, ‘ప్లాంటింగ్ మూన్’ ఇలా బోలెడు పేర్లున్నాయి.
స్ట్రాబెరీ మూన్ అంటే..
ఉత్తర అమెరికా ప్రాంతంలో జూన్ నెలలోనే స్ట్రాబెరీ మొక్కలు వికసించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. పౌర్ణమి వస్తే పండిన స్ట్రాబెరీలను కోయాలని గుర్తు పెట్టుకునేవారు. అలా ‘స్ట్రాబెరీ మూన్’ అనే పదం విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఇలా ఒక్కో చోట చంద్రుడ్ని ఒక్కో విధంగా సంబోధించడం ప్రారంభించారు.
మీడ్ మూన్, హనీమూన్
మధ్యయుగంలో.. ఐరోపాలో జూన్ నెల పున్నమి చంద్రుడిని ‘మీడ్ మూన్’, ‘హనీమూన్’ అని పిలవడం ప్రారంభించారు. మీడ్ మూన్ అనే పేరు ఒక ప్రాచీన మద్య పానీయం ‘మీడ్’ నుంచి ఉత్పన్నమైంది. తేనెను పులియబెట్టి నీరు, సుగంధ ద్రవ్యాలు, ఇతర ధాన్యాలతో కలిపి ఆ మద్యాన్ని తయారు చేసేవారు. ఈ విధానంలో వాడే తేనెను సేకరించడానికి జూన్ మాత్రమే సరైన సమయమని విశ్వసించేవారు. దాంతో ‘మీడ్ మూన్’, ‘హనీ మూన్’ పేర్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి.
రోజ్ మూన్
యూరప్‌లో ‘ఫుల్ మూన్’ను ‘రోజ్ మూన్’ అని ఎందుకు పిలుస్తారనే విషయంపై స్పష్టత లేదు. గులాబీలు పుష్పించడానికి జూన్ అనువైన సమయం కాబట్టి ఆ పేరు వచ్చి ఉంటుందనే వాదనతో కొందరు ఏకీభవిస్తున్నారు. మరికొందరు ఆకాశంలో చంద్రుడు కన్పించే తీరు కొంత గులాబీ రంగులో ఉండటం వల్ల ఆ పేరుతో పిలుస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
లోటస్ మూన్
తూర్పు నాగరికత దేశాల్లో జూన్ నెల ‘ఫుల్ మూన్’ను ‘లోటస్ మూన్’గా పిలుస్తారు. ఎందుకంటే ఈ నెలలోనే ఆయా దేశాల్లో తామరపువ్వులు ఎక్కువగా వికసిస్తాయి. ఈ దేశాల సంప్రదాయం ప్రకారం ‘లోటస్ మూన్’ను స్వచ్ఛత, అందం, జ్ఞానోదయానికి ప్రతీకగా చూస్తారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
Andhra news: ఐబీ సిలబస్ విధివిధానాల కోసం కమిటీల ఏర్పాటు
-
Ram Pothineni: ‘స్కంద’ మాస్ చిత్రం మాత్రమే కాదు..: రామ్
-
BJP: మధ్యప్రదేశ్ అసెంబ్లీ బరిలో కేంద్రమంత్రులు, ఎంపీలు.. 39మందితో భాజపా రెండో జాబితా!
-
Black Sea: రష్యాకు ఎదురుదెబ్బ.. నౌకాదళ కమాండర్ సహా 34 మంది మృతి!