China: కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి

చైనా (China)లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 14 మంది మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టాయని స్థానిక అధికారులు తెలిపారు.

Published : 04 Jun 2023 18:58 IST

(ప్రతీకాత్మత చిత్రం)

బీజింగ్: చైనా (China)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి చెందగా, ఐదుగురు గల్లంతయ్యారు. చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లోని జిన్‌కౌహీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టాయని వెల్లడించారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలో సుమారు 40 వేల మంది వరకు నివాసం ఉంటున్నట్లు సమాచారం.

గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయని, వాటి వల్లే ఈ ప్రమాదం జరిగిఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ‘‘ ప్రమాద సమాచారం గురించి తెలిసిన వెంటనే 180 మందితో కూడిన సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను వెలికితీశాం. మరో ఐదుగురి ఆచూకీ తెలియాల్సివుంది’’ అని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని