Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 06 Dec 2023 21:37 IST

1. Nimmagadda: నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి.. గవర్నర్‌కు నిమ్మగడ్డ వినతి

ప్రభుత్వ నిధులు పార్టీ కార్యక్రమాలకు వినియోగించడం అనైతికమని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ఫోరం ప్రతినిధులు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌, తదితరులు బుధవారం గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం రమేశ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తిపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. KCR: కేసీఆర్‌కు సంఘీభావం తెలిపిన చింతమడక గ్రామస్థులు

భారాస అధినేత కేసీఆర్‌ను బుధవారం ఆయన స్వగ్రామం చింతమడక వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి కలిశారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కలిసి తమ సంఘీభావం తెలిపారు. ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చింతమడక గ్రామస్థులకు కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. హరీశ్‌రావు, పలువురు భారాస నేతలు కూడా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Revanth Reddy: ప్రమాణ స్వీకారానికి ఇదే నా ఆహ్వానం.. తెలంగాణ ప్రజలకు రేవంత్‌ లేఖ

ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని తెలంగాణ ప్రజలను సీఎల్పీనేత రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఆహ్వానిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Apple: యూఎస్‌బీ-సి టైప్‌ నుంచి మినహాయింపు కోరిన యాపిల్‌

ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను తగ్గించాలనే ఉద్దేశంతో దేశీయంగా తయారయ్యే ఫోన్‌, ట్యాబ్‌ మోడల్స్‌లో ఒకే విధమైన ఛార్జింగ్‌ పోర్టు ఉండేలా చూసుకోవాలని గతంలో కేంద్రం ఫోన్‌ తయారీ సంస్థలకు సూచించింది. 2025 నుంచి ఈ నిబంధనను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం మొబైల్ తయారీ సంస్థలతో సమావేశం నిర్వహించింది. ఇందులో  కేంద్రం తన ప్రతిపాదనను మొబైల్‌ సంస్థలకు తెలియజేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Digital India Act: ఎన్నికల తర్వాతే డిజిటల్‌ ఇండియా యాక్ట్‌: రాజీవ్‌ చంద్రశేఖర్‌

పాత ఐటీ చట్టం స్థానంలో ప్రవేశపెట్టాలనుకున్న డిజిటల్‌ ఇండియా చట్టం (Digital India act) ఇప్పట్లో వచ్చే అవకాశం లేనట్లే. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోగా ఈ చట్టం తీసుకొచ్చే అవకాశం లేదని కేంద్ర ఎలక్ట్రానిక్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. ఈ చట్టంపై పూర్తి స్థాయిలో చర్చలు జరపటానికి తగినంత సమయం లేకపోవడమే దీనికి కారణమని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Michaung Cyclone: చెరువులా మారిన చెన్నై నగరం

మిగ్‌జాం తుపాను బీభత్సానికి చెన్నై చిగురుటాకులా వణికిపోయింది. కుండపోత వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వర్షం తగ్గినప్పటికీ ముంపు కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరపాలక సిబ్బంది పడవల ద్వారా బాధితులను.. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Apply Now: ఫ్యాషన్‌ ప్రపంచం వైపు వెళ్తారా? ఇదిగో గొప్ప ఛాన్స్‌!

ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆకర్షణీయంగా, ప్రత్యేకంగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. ఫ్యాషన్‌ రంగంలో వస్తోన్న కొత్త ట్రెండ్స్‌ దిశగా వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో ఫ్యాషన్‌ కోర్సులకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో పాటు 18 కేంద్రాల్లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(NIFT) క్యాంపస్‌ల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. IND vs SA: ముందుంది సఫారీ సవాల్‌.. ఈసారి జెండా పాతుతారా?

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ ఇలా ఒక్కో విదేశీ గడ్డపై భారత క్రికెట్‌ జట్టు (Team India) జెండాలు ఎగరేస్తూ వచ్చింది. కానీ దక్షిణాఫ్రికాకి వచ్చేసరికే ఎందుకో ఒకింత తడబాటు. చేతికి అందినట్టే ఉంటది కానీ అందదు. మనోళ్లు గెలిచేస్తారా? అనిపిస్తారు చివరికి గెలవరు! 90ల్లో అయితే బలహీనమైన భారత జట్టు కదా అనుకోవచ్చు.. కానీ ఎంతో మెరుగుపడిన ప్రస్తుత టీమ్‌ఇండియా కూడా దక్షిణాఫ్రికాలో జెండా పాతలేకపోతోంది. మళ్లీ వచ్చింది సఫారీ సిరీస్‌! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Mahindra: జనవరి నుంచి మహీంద్రా వాహన ధరలు పెంపు

దిల్లీ: ప్రముఖ వాహన సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra & Mahindra) వాహన ధరల పెంపునకు సిద్ధమైంది. ప్యాసింజర్‌, కమర్షియల్‌ వాహన ధరలను జనవరి నుంచి పెంచనుంది. కొత్త ఏడాదిలో ఇప్పటికే కార్ల ధరలను పెంచేందుకు పలు కంపెనీలు సిద్ధమయ్యాయి. తాజాగా ఆ జాబితాలో మహీంద్రా అండ్‌ మహీంద్రా చేరింది. ఎంత మొత్తం పెంచేదీ కంపెనీ వెల్లడించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Chhattisgarh: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 80శాతం కోటీశ్వరులే..

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) విజయం సాధించిన ఎమ్మెల్యే (MLAs)ల ఆస్తులపై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ADR) నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల్లో 80శాతం కోటీశ్వరులేనని తేలింది. ఇందులో అత్యధికులు భాజపా (BJP)కు చెందినవారేనని ఏడీఆర్‌ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు