Mahindra: జనవరి నుంచి మహీంద్రా వాహన ధరలు పెంపు

Mahindra price hike: మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీకి చెందిన వాహన ధరలు పెరగనున్నాయి. జనవరి నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.

Published : 06 Dec 2023 18:57 IST

Mahindra price hike | దిల్లీ: ప్రముఖ వాహన సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra & Mahindra) వాహన ధరల పెంపునకు సిద్ధమైంది. ప్యాసింజర్‌, కమర్షియల్‌ వాహన ధరలను జనవరి నుంచి పెంచనుంది. కొత్త ఏడాదిలో ఇప్పటికే కార్ల ధరలను పెంచేందుకు పలు కంపెనీలు సిద్ధమయ్యాయి. తాజాగా ఆ జాబితాలో మహీంద్రా అండ్‌ మహీంద్రా చేరింది. ఎంత మొత్తం పెంచేదీ కంపెనీ వెల్లడించలేదు.

ద్రవ్యోల్బణం, పెరిగిన ముడి సరకు కారణంగా ఉత్పత్తి వ్యయం పెరిగిందని మహీంద్రా ఓ ప్రకటనలో పేర్కొంది. పెరిగిన వ్యయ భారం వినియోగదారులపై పడకుండా ఉండేందుకు వీలైనంత వరకు ప్రయత్నం చేసినప్పటికీ.. కొంత భారాన్ని మాత్రం కస్టమర్లకు బదిలీ చేయాల్సి వస్తోందని కంపెనీ పేర్కొంది. ఎస్‌యూవీ, కమర్షియల్‌ వాహన మోడల్‌ను బట్టి  పెంపు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మరోవైపు జనవరి నుంచి వాహనాల ధరలను పెంచనున్నట్లు ఇప్పటికే మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, ఆడి, మెర్సిడెస్‌ బెంజ్  వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని