Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. డిసెంబరులో ఎన్నికలు రావొచ్చు.. జులై నుంచి ఇక్కడే ఉంటా: పవన్
డిసెంబరులో ఎన్నికలు పెట్టే అవకాశముందని, జులై నుంచి ఇక్కడే ఉంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జనసేన మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘సీఎం.. సీఎం అనే కేకలు వేస్తే ముఖ్యమంత్రి కాలేను. క్రేన్లతో గజమాలలు వేసే కన్నా.. ఓట్లు వేయాలి’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. శ్రీవారి ఆనందనిలయం చిత్రీకరణ కేసులో నిందితుడి అరెస్టు
శ్రీవారి ఆలయంలోని ఆనందనిలయాన్ని మొబైల్‌ద్వారా వీడియో తీసిన నిందితుడిని అరెస్టు చేశామని తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య తెలిపారు. తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన రాహుల్‌రెడ్డిని(19)ని గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం తిరుమల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఏఎస్పీ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. విరాట్, రోహిత్.. టీ20 క్రికెట్‌కు దూరమైనట్లు ఉంది: మాజీ సెలెక్టర్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆటతీరుపై తీవ్ర విమర్శలు రేగాయి. ఇద్దరూ ఓపెనర్లుగా వస్తున్నా.. రోహిత్ పరుగులు చేయడంలో విఫలం కాగా.. విరాట్ మాత్రం తక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు రాబట్టాడు. అర్ధశతకాలు సాధించినా టీ20 క్రికెట్ సరిపడే ఆటతీరు కాదని మాజీలు, క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. మేం గెలిస్తే.. సీఎం ఎవరో డిసైడ్ చేసేది వాళ్లే: డీకే శివకుమార్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయంటూ భారీ అంచనాలు కొనసాగుతున్న వేళ సీఎం ఎవరు అవుతారనే అంశంపై ఆసక్తి నెలకొంది. దీనిపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఎవరు సీఎం కావాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీయే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. కాక్‌పిట్‌లోకి స్నేహితురాలు.. పైలట్ సస్పెన్షన్.. రూ.30 లక్షల జరిమానా!
విమానంలో ఓ పైలట్ తన స్నేహితురాలిని కాక్‌పిట్ (Cockpit) లోకి ఆహ్వానించిన ఘటనలో.. ఎయిర్ ఇండియా (Air India)పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) కొరడా ఝుళిపించింది. నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ.. ఈ వ్యవహారంలో పైలట్‌పై మూడు నెలల సస్పెన్షన్ వేటు వేయడంపాటు సంస్థకు రూ.30 లక్షల జరిమానా విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ‘అలారమ్ స్టాపర్ల విక్రయాలు ఆపేయండి’.. ఇ-కామర్స్ సంస్థలకు కేంద్రం ఆదేశం
కారు సీటు బెల్ట్ అలారమ్ స్టాపర్ క్లిప్‌లకు చరమగీతం పాడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటి విక్రయాలను నిలిపివేయాలని ఇ-కామర్స్ సంస్థలకు ఆదేశించింది. ఈ మేరకు తమ వేదికల నుంచి శాశ్వతంగా వాటిని తొలగించాలంటూ అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో పాటు ఐదు ఇ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. సీటు బెల్ట్ ధరించని సమయంలో వచ్చే అలారం సౌండ్‌ను ఆపేందుకు ఉపయోగించే ఈ స్టాపర్ల వల్ల ప్రయాణికుల భద్రతకు హాని కలిగే ప్రమాదం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. దోషిగా తేలితే నన్ను ఉరితీయండి: బిహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్
ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య హత్య కేసులో 14 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించి విడుదలైన బిహార్ (Bihar) మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ సింగ్ (Anand Mohan Singh).. ఈ కేసులో తాను నిర్దోషినని ప్రకటించాడు. బిహార్‌లోని అరారియాలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన అతడు తాను దోషిగా తేలితే ఉరిశిక్షనైనా స్వీకరిస్తానన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ‘టైటిల్ 42’కు తెర.. అమెరికా సరిహద్దులో ఏం జరుగుతోంది?
మెక్సికోతోపాటు ఇతర దేశాల నుంచి అమెరికాకు శరణార్థుల (Asylum-seekers) తాకిడి కొన్నేళ్లుగా విపరీతంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. వీటిని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతూనే ఉంది. ఈ క్రమంలో కొవిడ్-19 విజృంభణ సమయంలో శరణార్థులపై ‘టైటిల్ 42’ పేరుతో అమెరికా ప్రభుత్వం విధించిన ఆంక్షల (Asylum Restrictions) గడువు మే 11తో ముగిసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ‘జైలు టు బెయిల్’.. ఇమ్రాన్ అరెస్టులో కీలక పరిణామాలివే!
పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను (Imran Khan) అరెస్టు చేయడం అక్రమమని పాక్ సుప్రీం (Pak Supreme Court) కోర్టు గురువారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఇవాళ ఆయనకు రెండు వారాల బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)
-
Movies News
Siddharth: ఆమెను చూడగానే ఒక్కసారిగా ఏడ్చేసిన హీరో సిద్ధార్థ్
-
Movies News
Anasuya: ఇకపై ఆపేద్దామనుకుంటున్నా.. విజయ్‌తో వార్‌పై తొలిసారి స్పందించిన అనసూయ
-
Sports News
Trent Boult: ట్రెంట్ బౌల్ట్ ఈజ్ బ్యాక్.. వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం!
-
Movies News
Vimanam: ప్రివ్యూలకు రావాలంటే నాకు భయం.. ఇలాంటి చిత్రాలు అరుదు: శివ బాలాజీ