Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 18 May 2023 21:05 IST

1. కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం.. తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలివే!

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజులపాటు జరపాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నూతన సచివాలయంలో తొలిసారి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్‌ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మంత్రి హరీశ్‌రావు మీడియా సమావేశంలో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే

ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇస్కాన్‌, యాదవ సంఘాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. విచారణ చేపట్టిన ఉన్నతన్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టొద్దని స్టే విధించింది. పువ్వాడ అజయ్‌ సహా నిర్వాహకులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాజధాని అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ వేగవంతం చేయాలి: జగన్‌

రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఇళ్లపట్టాల పంపిణీ అనంతరం వేగంగా ఇళ్ల నిర్మాణం సాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం గృహనిర్మాణశాఖపై సీఎం సమీక్షించారు. సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బాధపడటం లేదు.. ఇంకా చాలా ప్రయాణం మిగిలివుంది..

ర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM)గా పార్టీ సీనియర్‌ నేత సిద్ధరామయ్య (Siddaramaiah)ను కాంగ్రెస్‌ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మొదటి నుంచి సీఎం పదవి రేసులో ఉన్న డీకే శివకుమార్‌ (DK Shivakumar)కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. ఈ పరిణామంపై డీకే స్పందిస్తూ.. మనమంతా ఓ కోర్టు తీర్పును స్వీకరించినట్లుగానే తానూ పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని శిరసావహిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సీఎం సీటుపై అధిష్ఠానం నిర్ణయం.. కర్ణాటక కాంగ్రెస్‌లో మొదలైన విభేదాలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Eelctions) 135 స్థానాలు గెలుచుకొని జోరు మీదున్న కాంగ్రెస్‌ను (Congress) అంతర్గత సమస్యలు వెంటాడుతున్నాయి. ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఇవాళ్టి వరకు సీఎం సీటుపై తర్జనభర్జనలు పడిన హస్తం పార్టీ.. సమస్యను ఎట్టకేలకు ఓ కొలిక్కి తీసుకొచ్చింది. అనుభవజ్ఞుడైన సిద్ధరామయ్యను (Siddha ramaiah) ముఖ్యమంత్రిగా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను ఏకైక ఉపముఖ్యమంత్రిగా నియమించాలని నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. టెన్నిస్‌ స్టార్‌ జకోవిచ్‌ను ఓడించిన 20 ఏళ్ల కుర్రాడు

టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌కు ఓటమి ఎదురైంది. అదీనూ ఓ 20 ఏళ్ల కుర్రాడి చేతిలో కావడం గమనార్హం. రోమ్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో జకోవిచ్‌పై 6-2, 4-6, 6-2 తేడాతో డెన్మార్క్‌కు చెందిన హోల్గర్‌ రునె విజయం సాధించాడు. వర్షం ఆటంకం కలిగించిన కీలక పోరులో జకోవిచ్‌ ఓడిపోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఉచిత విద్యుత్‌ అన్నారు కదా.. మేం బిల్లులు చెల్లించం!

తాజా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ ఇంకా ప్రభుత్వాన్నే ఏర్పాటు చేయలేదు. సీఎం పీఠం ఎవరిదా? అన్నదానిపై ఇవాళే ఓ స్పష్టత వచ్చింది. కానీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని కాంగ్రెస్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో కొప్పల్‌, కలబురిగి, చిత్రదుర్గ జిల్లాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు విద్యుత్‌ బిల్లులు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కాంగ్రెస్ ‘తీర్పు’.. తలవంచిన వీరవిధేయుడు: డీకే శివకుమార్‌ ప్రస్థానమిదీ..

‘‘కోర్టులో మనం ఎంతైనా వాదిస్తాం. కానీ చివరకు న్యాయమూర్తి చెప్పింది పాటించాల్సిందే. హైకమాండ్‌ ఆదేశం కూడా నాకు కోర్టు తీర్పులాంటిదే’’.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక తర్వాత పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ చెప్పిన మాటలివి. అవును మరి.. కాంగ్రెస్‌ పార్టీకి వీర విధేయుడిగా ఉన్న డీకే.. అధిష్ఠానం ఇచ్చిన ఆదేశాలకు తలవంచి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు అంగీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 14 ఏళ్లకే పెళ్లి.. ఆ తర్వాత కలెక్టరై: కొత్త న్యాయశాఖ మంత్రి విశేషాలివే..!

కేంద్రమంత్రి వర్గంలో గురువారం భారీ మార్పు చోటుచేసుకుంది. న్యాయశాఖ మంత్రి (Law Minister)గా ఉన్న కిరణ్‌ రిజిజు (Kiren Rijiju)ను ఆ బాధ్యతల నుంచి తొలగించి, కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌మేఘ్వాల్‌ (Arjun Ram Meghwal)కు ఆ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు. స్వతంత్ర హోదాలో మేఘ్వాల్‌ ఆ శాఖను పర్యవేక్షించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆసీస్‌కు నో చెప్పి, చైనాకు గిఫ్ట్ ఇస్తున్నారా..? క్వాడ్‌ సదస్సు రద్దుపై బైడెన్‌పై విమర్శలు

వచ్చేవారం ఆస్ట్రేలియాలో జరగనున్న క్వాడ్‌ సమ్మిట్‌(Quad summit)కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(US President Joe Biden)హాజరుకానని చెప్పడంతో.. అది కాస్తా రద్దయింది. తన సొంత నగరమైన సిడ్నీలో మూడు శక్తివంతమైన దేశాధినేతలకు(అమెరికా, జపాన్‌, భారత్) ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌(Australian Prime Minister Anthony Albanese)కు ఇది ఎదురుదెబ్బ అని అంతర్జాతీయ కథనాలు అభివర్ణించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని