Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 27 May 2023 20:58 IST

1. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటా: చంద్రబాబు

రాష్ట్ర నాశనమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వ పరిపాలన సాగిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘మహానాడు’లో ఆయన మాట్లాడారు. 2019లో ఏపీ ఆదాయం ₹66,786 కోట్లు కాగా.. తెలంగాణది ₹69,620 కోట్లని తెలిపారు. 2022-23 నాటికి తెలంగాణ ఆదాయం ₹1.32 లక్షల కోట్లు అయితే ఏపీ ఆదాయం ₹94,916 కోట్లు మాత్రమేనన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎమర్జెన్సీ దిశగా భాజపా వెళ్తోంది: సీఎం కేసీఆర్

ఆర్డినెన్స్‌ తెచ్చి కేంద్ర ప్రభుత్వం దిల్లీ ప్రజలను అవమానిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై జరుపుతున్న పోరాటానికి విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా.. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మా వ్యూహం ఎన్నికల సమయంలో చూపిస్తాం: కిషన్‌రెడ్డి

భాజపా రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అధ్యక్షుడి మార్పుపై అనవసర చర్చలు వద్దని భాజపా శ్రేణులకు హితవు పలికారు. క్రమశిక్షణ తప్పి మాట్లాడకూడదని నేతలు, క్యాడర్ గ్రహించాలని సూచించారు. భాజపా కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.  తెలంగాణలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. గురువారం ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విభేదాలు పక్కన పెట్టండి.. విపక్షాలకు కమల్‌ హాసన్‌ పిలుపు

పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని  (New Parliament building) విపక్షాలు బహిష్కరించడంపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) స్పందించారు. దేశ ఐక్యత కోసం ఒక్కరోజు విభేదాలు పక్కనపెట్టాలని పిలుపునిచ్చారు. బహిష్కరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘గ్యాంగ్‌’ సినిమా తరహాలో సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో భారీ చోరీ

సూర్య, కీర్తి సురేశ్‌, రమ్యకృష్ణ నటించిన ‘గ్యాంగ్‌’ సినిమా చూశారా?. ఆ సినిమాలో ఐటీ అధికారులమంటూ హీరో సూర్య సోదాలు చేసే సన్నివేశం ఉంటుంది. ఆ సీన్‌ను గుర్తుకు తెచ్చేలా సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో పట్టపగలు దుండగులు చోరీకి పాల్పడ్డారు. శనివారం ఉదయం ఐదుగురు వ్యక్తులు రద్దీగా ఉండే మోండా మార్కెట్‌లోని బాలాజీ జ్యూవెలరీ దుకాణానికి వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. గుజరాత్‌ టైటాన్స్‌ సక్సెస్‌ క్రెడిట్ వారికే దక్కుతుంది: అనిల్ కుంబ్లే

డిఫెండింగ్‌ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ ఈ సీజన్‌లోనూ అదరగొడుతోంది.  క్వాలిఫయర్-2లో ముంబయి ఇండియన్స్‌ను చిత్తు చేసి వరుసగా రెండో ఏడాది ఐపీఎల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఆడిన మొదటి రెండు సీజన్లలో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. గత సీజన్‌ మాదిరిగానే ఈ సీజన్‌లోనూ గుజరాత్ టైటాన్స్‌ మంచి ప్రదర్శన కొనసాగించడంలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య, కోచ్‌ ఆశిశ్‌ నెహ్రా కీలక పాత్ర పోషించారని భారత మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Whatsapp వీడియో కాలింగ్‌లో గూగుల్‌ మీట్‌ తరహా ఫీచర్‌!

వాట్సాప్‌లో (Whatsapp) త్వరలో మరో కొత్త ఫీచర్‌ రాబోతోంది. ఇటీవల మెసేజ్‌ ఎడిట్‌, చాట్‌ లాక్‌ వంటి ఫీచర్లు ప్రకటించిన ఆ సంస్థ.. త్వరలో వీడియో కాలింగ్‌లో స్క్రీన్‌ షేరింగ్‌ (screen-sharing) ఆప్షన్‌ను సైతం తీసుకొస్తోంది. జూమ్‌, గూగుల్‌ మీట్‌ వంటి యాప్స్‌లో వీడియో కాల్స్‌ చేసేటప్పుడు స్క్రీన్‌ షేర్‌ చేసుకునే ఆప్షన్‌ ఉంది. ఇదే ఆప్షన్‌ను తీసుకురాబోతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దేశ విభజన కారకులకు సిలబస్‌లో స్థానం ఉండకూడదు: డీయూ

దేశవిభజనకు పునాది వేసిన వ్యక్తులకు సిలబస్‌లో స్థానం ఉండకూడదని దిల్లీ విశ్వవిద్యాలయం ఉపకులపతి యోగేశ్ సింగ్ అన్నారు. రాజనీతిశాస్త్రం సిలబస్‌ నుంచి పాకిస్థాన్‌ కవి మహ్మద్ ఇక్బాల్‌పై ఉన్న పాఠ్యభాగాన్ని తొలగించేందుకు విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్‌ ఒక తీర్మానాన్ని పాస్‌చేసింది. ఈ క్రమంలో యోగేశ్‌ సింగ్ స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఐపీఎల్ టైటిల్ విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

ఐపీఎల్-16 సీజన్‌ తుది అంకానికి చేరుకుంది.  ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్‌ జరగనుంది. ఈ టైటిల్‌ పోరు (IPL Final 2023)లో డిఫెండింగ్ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్‌ (GT), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) తలపడనున్నాయి. మరి విజేతగా నిలిచే జట్టు ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకోనుంది, రన్నరప్‌గా నిలిచిన టీమ్‌ ఎంత మొత్తం దక్కించుకుంటుంది? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని