Whatsapp వీడియో కాలింగ్‌లో గూగుల్ మీట్ తరహా ఫీచర్!
Whatsapp screen-sharing feature: వాట్సాప్‌లో స్క్రీన్ షేరింగ్ సదుపాయం రానుంది. ప్రస్తుతం కొందరు బీటా టెస్టర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్‌లో (Whatsapp) త్వరలో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. ఇటీవల మెసేజ్ ఎడిట్, చాట్ లాక్ వంటి ఫీచర్లు ప్రకటించిన ఆ సంస్థ.. త్వరలో వీడియో కాలింగ్‌లో స్క్రీన్ షేరింగ్ (screen-sharing) ఆప్షన్‌ను సైతం తీసుకొస్తోంది. జూమ్, గూగుల్ మీట్ వంటి యాప్స్‌లో వీడియో కాల్స్ చేసేటప్పుడు స్క్రీన్ షేర్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇదే ఆప్షన్‌ను తీసుకురాబోతోంది. ప్రస్తుతం కొందరు బీటా టెస్టర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుందని వాబీటా ఇన్ఫో తెలిపింది.
ఎవరితోనైనా వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు మన మొబైల్ స్క్రీన్‌ను అవతలి వ్యక్తులకు షేర్ చేయడం ఈ ఆప్షన్ ఉద్దేశం. వాట్సాప్ సైతం ఇదే ఫీచర్‌ను తన యాప్‌లో తీసుకొస్తోంది. ఇందుకోసం స్క్రీన్ అడుగు భాగంలో కొత్తగా స్క్రీన్ షేరింగ్ బటన్‌ను వాట్సాప్ ఇస్తోంది. ఈ బటన్‌ను క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో చేసే ప్రతిదీ రికార్డు అవ్వడంతో పాటు అవతలి వ్యక్తికి షేర్ అవుతుంది. దీనికి యూజర్ అనుమతి తప్పనిసరి.
అయితే, పాత ఆండ్రాయిడ్ వెర్షన్ ఉన్న ఫోన్లలోనూ, పాత వాట్సాప్ వెర్షన్లలోనూ ఈ ఫీచర్ పనిచేయకపోవచ్చు. అలాగే ఎక్కువ సంఖ్యలో గ్రూప్ వీడియో కాలింగ్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఫీచర్ పనిచేయకపోవచ్చని తెలుస్తోంది. అయితే, బీటా టెస్టర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ కొన్ని వారాల్లో యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే యూజర్లు ఇకపై తమ ఖాతాలకు యూజర్ నేమ్‌లు పెట్టుకునే సదుపాయాన్నీ వాట్సాప్ తీసుకురానుంది. ప్రస్తుతానికి ఇది పరీక్షల దశలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Income tax refund: ఆదాయపు పన్ను రిఫండ్స్.. ఐటీ శాఖ కీలక సూచన
-
Chandrababu Arrest: విశాఖలో తెదేపా శ్రేణుల కొవ్వొత్తుల ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు
-
Asian Games 2023 : అట్టహాసంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..