Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Mar 2024 21:06 IST

1. దేశ రాజకీయాల్లో తెలుగువారి పాత్రపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పార్ట్‌ టైమ్‌ రాజకీయ నాయకులు రావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు. తమిళనాడు మాజీ గవర్నర్‌, మాజీ డీజీపీ పీఎస్‌ రామ్మోహన్‌రావు రచించిన ‘గవర్నర్‌పేట్‌ టు గవర్నర్‌ హౌస్‌’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తకం పొలిటికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓటమి ఖాయం: ప్రశాంత్‌ కిశోర్‌

ఏపీ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓటమి ఖాయమని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పీకే పాల్గొన్నారు. గత ఎన్నికల్లో వైకాపాకు ఆయన పనిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో త్వరలో ‘కల్లు బార్లు’: మంత్రి పొన్నం

రాబోయే రోజుల్లో ‘కల్లు బార్లు’ ఏర్పాటు దిశగా కార్యచరణ రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వివిధ కుల వృత్తులు మారుతున్నాయని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ధోనీకిదే ఆఖరి సీజనా..? ‘కెప్టెన్‌ కూల్‌’ చిన్ననాటి స్నేహితుడు ఏమన్నాడంటే?

ఐపీఎల్‌ 2024 సీజన్‌ (IPL 2024).. మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో (CSK vs RCB) తలపడనుంది. ‘కెప్టెన్‌ కూల్’ ఎంఎస్ ధోనీకిదే (MS Dhoni) చివరి సీజన్‌ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. ధోనీ నుంచి కానీ, సీఎస్‌కే యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తైవాన్‌ సరిహద్దులను ఉల్లంఘించిన చైనా యుద్ధవిమానాలు, నౌకలు..!

చైనాకు చెందిన యుద్ధ విమానాల భారీ సమూహం తైవాన్‌ (Taiwan) గగనతల సరిహద్దులను ఉల్లంఘించింది. అంతేకాదు పెద్ద సంఖ్యలో నౌకలు కూడా జల సరిహద్దులు దాటాయి. మొత్తం 21 యుద్ధవిమానాలు, ఆరు నౌకలు ఈ చర్యకు పాల్పడినట్లు తైవాన్‌ రక్షణ శాఖ వెల్లడించింది. శని, ఆదివారాల్లో ఈ ఘటనలు జరిగినట్లు తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్టు చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. లోక్‌సభ ఎన్నికల్లో భారాస, భాజపా మధ్యే పోటీ: కేసీఆర్‌

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో త్వరలో బస్సు యాత్రలు చేద్దామని పార్టీ నేతలకు భారాస అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో భారాస, భాజపా మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కరీంనగర్‌ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేతలు హరీశ్‌ రావు, వినోద్ కుమార్, గంగుల కమలాకర్, సంతోశ్‌ కుమార్ తదితరులు పాల్గొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన దరఖాస్తులెన్ని?: బండి సంజయ్‌

ఏ ప్రాతిపదికన నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తారో ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన పర్యటించారు. పలు వార్డుల్లో ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పోరాటాలు తాము చేస్తే.. అధికారం కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకుందని వ్యాఖ్యానించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కెమెరా కోసం ఇంత దారుణమా?.. ఫొటోగ్రాఫర్‌ హత్య కేసు ఛేదించిన పోలీసులు

విశాఖకు చెందిన యువ ఫొటోగ్రాఫర్‌ సాయి హత్య కేసును పోలీసులు ఛేదించారు. విలువైన కెమెరా కోసమే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు దర్యాప్తులో తేలింది. కేసు వివరాలను విశాఖ సీపీ రవిశంకర్‌ వెల్లడించారు. విశాఖ మధురవాడలోని బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయికుమార్‌ (23) వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్‌. పెళ్లి వేడుకలకు ఫొటోలు, వీడియోలు తీస్తుంటాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రూ.400 కోట్ల విలువైన అక్రమ ఫామ్‌హౌస్‌ కూల్చివేత..!

యూపీ లిక్కర్‌ కింగ్‌కు సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన అక్రమ ఫామ్‌హౌస్‌ను అధికారులు కూల్చేశారు. ఈ ఘటన దిల్లీ పరిధిలో చోటు చేసుకొంది. స్థానిక ఛత్రపుర్‌ ప్రాంతంలోని లిక్కర్‌ వ్యాపారి పాంటీ చద్దా (Ponty Chadha) కుటుంబానికి చెందిన ఓ ఫామ్‌ హౌస్‌ ఉంది. దీని విలువ రూ.400 కోట్లు పైమాటే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రాజకీయాలకు గుడ్‌బై.. కేంద్ర మాజీ మంత్రి ప్రకటన

భాజపా (BJP) ఎంపీ, కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి డా.హర్షవర్థన్ (Dr. Harsh Vardhan) రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌ (గతంలో ట్విటర్‌)లో పోస్టు చేశారు. ఇకపై దిల్లీ కృష్ణానగర్‌లోని తన క్లినిక్‌లో వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన దిల్లీలోని చాందినీ చౌక్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని