Taiwan: తైవాన్‌ సరిహద్దులను ఉల్లంఘించిన చైనా యుద్ధవిమానాలు, నౌకలు..!

తైవాన్‌ దిశగా భారీ సంఖ్యలో చైనా యుద్ధ విమానాలు ప్రయాణించాయి.

Published : 03 Mar 2024 18:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన యుద్ధ విమానాల భారీ సమూహం తైవాన్‌ (Taiwan) గగనతల సరిహద్దులను ఉల్లంఘించింది. అంతేకాదు పెద్ద సంఖ్యలో నౌకలు కూడా జల సరిహద్దులు దాటాయి. మొత్తం 21 యుద్ధవిమానాలు, ఆరు నౌకలు ఈ చర్యకు పాల్పడినట్లు తైవాన్‌ రక్షణ శాఖ వెల్లడించింది. శని, ఆదివారాల్లో ఈ ఘటనలు జరిగినట్లు తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్టు చేసింది.

ఈ పరిస్థితిని తమ దళాలు ఎప్పటికప్పుడు కనిపెట్టి తగిన మోహరింపులు చేస్తున్నట్లు తైవాన్‌ చెప్పింది. ఆ దేశం కూడా కొన్ని నౌకలు, యుద్ధ విమానాలను పంపి చైనా దళాల కార్యకలాపాలను అడ్డుకునే యత్నం చేసింది. కొన్ని చోట్ల గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులనూ మోహరించింది. 

ఈ ఘటన జరగటానికి ముందు రోజు తొమ్మిది విమానాలు, ఎనిమిది నౌకలు కూడా ఇలానే తమ వైపు వచ్చినట్లు తైపీ వెల్లడించింది. మార్చి నెలలో ఇప్పటి వరకు 30 విమానాలు, 14 నౌకలు సరిహద్దుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు పేర్కొంది.

మా అనుమతి లేకుండా ఇంటర్వ్యూ చేస్తారా.. భారత మీడియాపై చైనా రుసరుస

ఇటీవల ఓ చైనా చేపల పడవను తైవాన్‌ దళాలు వెంబడించడంతో ఇద్దరు జాలర్లు మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చైనా కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది తైవాన్‌ పర్యటక నౌకలోకి చొరబడి తనిఖీలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు