Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 29 Nov 2023 21:01 IST

1. ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పక్షపాతం చూపించారని ముగ్గురు పోలీసు అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది. నగరంలోని ముషీరాబాద్‌ పరిధిలో నగదు స్వాధీనం వ్యవహారంలో పక్షపాతం చూపించారని డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ యాదగిరి, సీఐ జహంగీర్‌లను ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించింది. వీరిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ లేఖ రాసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. చరిత్రను మలుపు తిప్పిన ‘ఒక్క ఓటు’.. ఈ ఘటనలే సాక్ష్యం!

ఓటు.. ప్రజల చేతిలో అదో వజ్రాయుధం. ఐదేళ్లకు ఒక్కసారి ప్రజల భవితను నిర్ణయించే సువర్ణావకాశమది. ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం వద్దు. ఒక్క ఓటుతో చరిత్ర తారుమారైన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందువల్ల మీ ఒక్క ఓటు సమాజంలో ఏం మార్పు తీసుకొస్తుందని నిరుత్సాహ పడొద్దు. ఒక్క ఓటే చరిత్రను మలుపుతిప్పిన చారిత్రక సందర్భాలివే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు అర్జిత సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఉద్యోగులకు ఆర్జిత సెలవు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. సీఏఏ అమలును ఎవ్వరూ ఆపలేరు : అమిత్‌ షా

పౌరసత్వ (సవరణ) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) స్పష్టం చేశారు.  2024 లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. మీ ఓటు ఎవరైనా వేస్తే.. ఏం చేయాలో తెలుసా?

ఎన్నికలు జరిగే సమయంలో కొందరి పేర్లు జాబితాలో మిస్‌ కావడం, మరికొందరు ఇతరుల పేరుతో దొంగ ఓట్లు వేయడం జరుగుతూనే ఉంటుంది. ఓటరు లిస్ట్‌లో మన పేరు లేకపోతే నిరాశగా వెనుదిరగడం తప్ప చేసేదేమీ ఉండదు. అయితే, మన పేరుతో మరొకరు ఓటు వేస్తే ఏం చేయాలి అన్న ప్రశ్న చాలామందికి వస్తుంటుంది. దానికి పరిష్కారమే సెక్షన్‌ 49(పి). పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. చారిత్రక మైలు రాయి.. కేంద్రంతో యూఎన్‌ఎల్‌ఎఫ్‌ శాంతి ఒప్పందం

జాతుల ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్‌లో శాంతి పునరుద్ధరణలో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఇంఫాల్‌ లోయలోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌తో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన శాంతి చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. చారిత్రక మైలురాయిని అధిగమించామని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఓటుకు ముందు ఏమైనా సందేహాలా? సమాధానాలివిగో..!

ఓటు... ఇందులో అక్షరాలు రెండే అయినా... ప్రజాస్వామ్యంలో వాటి విలువ అమూల్యం. మెరుగైన పాలనకు బాటలు వేసేది... పౌరుల బంగారు భవితను నిర్దేశించేది ఓటే. వ్యవస్థలో మార్పునకు నాంది పలికేది... వ్యక్తి అస్తిత్వానికి గుర్తింపునిచ్చేదీ ఓటే. ఒక్క ఓటే ప్రభుత్వాలను మారుస్తుందన్న విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది. ఓటుకు ముందు కొందరికి ఎన్నో సందేహాలు... వాటికి సమాధానాలివిగో...! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. వచ్చే ఏడాదిలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి రానున్న బైక్స్‌ ఇవే..

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వచ్చే ఏడాదిలో పలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ముఖ్యంగా 650 సీసీ సెగ్మెంట్‌పై కంపెనీ దృష్టి సారించనుంది. మరోవైపు తన మొదటి విద్యుత్‌ వాహనాన్నీ తీసుకొచ్చేందుకు కూడా సన్నద్ధమవుతోంది. ఇంతకీ వచ్చే ఏడాదిలో అత్యాధునికి ఫీచర్లతో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తీసుకురానున్న మోటార్‌ సైకిళ్లపై లుక్కేద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. హెచ్‌-1బీ వీసాదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక అమెరికాలోనే వీసా రెన్యువల్‌!

హెచ్‌-1బీ వీసా పునరుద్ధరణ విధానాన్ని మరింత సరళీకరించేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని కేటగిరీల హెచ్‌-1బీ వీసాలను దేశీయంగానే రెన్యువల్‌ చేసుకునేలా ఓ పైలట్‌ ప్రోగ్రామ్‌ను డిసెంబరులో ప్రారంభించనుంది. మూడు నెలల పాటు ఈ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంటుందని వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ జూలీ స్టఫ్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. చిరిగిన బూట్లు వేసుకున్నా.. వాళ్లంతా సంపన్న నేతలే: రాహుల్‌

కొందరు రాజకీయ నాయకుల సాధారణ వస్త్రధారణ చూసి వారిపై ఒక అంచనాకు రాకూదని.. దానికి వెనుక వారి మరో నిజస్వరూపం ఉంటుందని కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul gandhi)అన్నారు. కేరళలోని కొయ్‌కోడ్‌లో ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో బుధవారం రాహుల్‌ పాల్గొన్నారు. సాధారణ జీవితం గడుపుతున్నట్లుగా కనిపించే కొందరి నాయకులను ఉద్దేశించి ఈ సందర్భంగా మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని